మిగతా వ్యాధులతో పోలిస్తే క్యాన్సర్ వ్యాధి చికిత్స కూడా ఆ వ్యాధిలాగే కాస్త జటిలంగా ఉంటుంది. రసాయన ఆయుర్వేదంలో ఆయా క్యాన్సర్ల ఆధారంగా అర్బుదరాశులను రూపుమాపడానికి అనేక పరిష్కార మార్గాలున్నాయి. ఎలాంటి క్యాన్సర్ అయినా రసాయన ఆయుర్వేదం మొదట ఇమ్యునిటీని పెంచుతుంది. శరీరంలో ఇమ్యునిటీ పెరిగితే చాలు అదే క్యాన్సర్ల పనిపడుతుంది. ఒకపక్క నుండి ఇమ్యునిటీ వ్యవస్థ, మరోపక్క నుండి రసౌషదాలు క్యాన్సర్ కణాలపై దాడి చేసి క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా అడ్డుకుంటాయి. తద్వారా శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తి ఆగుతుంది. ఒకసారి క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోయిన తర్వాత దెబ్బతిన్న అవయవాల పనితీరును మెరుగుపరిచే విధంగా పనిచేస్తుంది రసాయన ఆయుర్వేదం. శక్తివంతమైన అనుభూతయోగాలు దోషాలను సవరించి అవయవాలను ఊహించినదానికంటే వేగంగానే యధాస్థితికి తీసుకువస్తుంది.
క్యాన్సర కణాలు ఎలా పని చేస్తాయి?
క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకునే ముందు క్యాన్సర్ గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరముంది. శరీరంలోకి ఫారిన్ కణాలు ప్రవేశించగానే అవి వాటి ఉనికి కోసం సాధారణ కణాల ముసుగులోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ముందు వాటి సంఖ్యను పెంచుకుని క్రమక్రమంగా ఇమ్యునిటీ వ్యవస్థను దెబ్బతీస్తుంటాయి. తర్వాతి దశలో అవి మెల్లగా అవయవాల పనితీరు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో పేషెంట్లలో సాధారణంగా ఆకలి వేయకపోవడం, ఒకవేళ తిన్నా కూడా వాంతులవ్వడం, విరేచనాలు కావడం, బరువు తగ్గడం, తరచుగా జ్వరం రావడం మొదలైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
క్యాన్సర్లపై బ్రహ్మాస్త్రం – రసాయన ఆయుర్వేదం..
క్యాన్సర్ కణాలు శరీరంలో ఎలా అయితే వ్యాపించాయో అలాగే వాటిని రివర్స్ గేర్లో వెనక్కి పంపించడం రసాయన ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత. దశలవారీగా క్యాన్సర్లను మట్టుబెడుతుంది. మొట్టమొదటిగా ఇమ్యునిటీని పెంచి తర్వాత క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకుంటుంది. దీనివలన పేషెంటులో మెల్లిగా జీవక్రియ గాడిలో పడుతుంది. శరీరం పూర్వపు ఓజస్సు వైపుగా ప్రయాణిస్తుంది. ఆకలి పెరగడంతోపాటే బరువు పెరగడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆవయవాల పనితీరు మెరుగవుతూ కొంతకాలానికి యధాస్థితికి చేరుకుంటాయి.