బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి?
బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు
బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు
బ్రెస్ట్ క్యాన్సర్ రకాలు
ఆంజియోసార్కోమా (Angiosarcoma)
డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS) (Ductal Carcinoma In Situ)
ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్(Inflammatory Breast Cancer)
ఇన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా (Invasive Lobular Carcinoma)
లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు (LCIS) (Lobular Carcinoma In Situ)
బ్రెస్ట్ క్యాన్సర్ దశలు
బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానం
బ్రెస్ట్ క్యాన్సర్:
మన శరీరంలోని రొమ్ము భాగాలలో సోకే క్యాన్సర్ ను బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా మహిళల్లో మాత్రమే చూస్తుంటాం. పురుషుల్లో దాదాపుగా తక్కువగా కనిపిస్తుంటుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది.?
రొమ్ము లో ఉన్నటువంటి కణాలు సాధారణ రీతిలో కాకుండా అసాధారణ రీతిలో పెరగటం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంటుంది. అలాగే మొదటగా రొమ్ములోని పాలు ఉత్పత్తి చేసే నాళాలలో ఈ క్యాన్సర్ కణాలు మొదలవుతాయి. ఇలా మొదలైన క్యాన్సర్ని ఇన్‌వాసివ్ డక్టల్ కార్సినోమా (IDC), ఇన్‌ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా అని కూడా పిలుస్తారు. ఈ క్యాన్సర్ కణాలు క్రమ క్రమంగా పెరగడంతోపాటూ లింప్ నోడ్స్ ద్వారా ఒకచోట నుండి మరో చోటకి పాకుతాయి.
బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు
- ఇంతకుముందే ఫ్యామిలీ లో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం .
- ప్రసవం తర్వాత బాలింతలు విధిగా పిల్లలకి ఇవ్వాల్సిన చనుబాలు ఇవ్వకపోవటం.
- గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం,
- ఋతుక్రమం సరిగ్గా జరగడం కోసం లేదా హార్మోన్స్ ని కంట్రోల్ చేసే మెడిసిన్ వాడటం లేదా ఉన్నట్లుండి మెడిసిన్ వాడటం నిలిపివేయటం.
- ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ బాగా ఎక్స్ పోజ్ అవ్వటం,
- ధూమపానం, మధ్యపానం వంటి అలావాట్లు ఉండటం.
- లేటు పెళ్ళిళ్ళు, అలాగే 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం,
- గతంలో రెడీయేషన్ చేయించుకోవటం అలాగే రెడీయేషన్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో తిరగటం.
- ఊబకాయం ఉన్నవాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.
- BRCA1, BRCA2, కణాల మ్యూటేషన్స్ జరగడం. కాలుష్యమైన గాలి పీల్చడం అలాగే జీన్ మోడిఫైడ్ ఆహారాలను తీసుకోవటం.
- సంతానలేమి సమస్యలు ఉండటం.
- 12 ఏళ్ల వయసులోనే ఋతు క్రమం మొదలవ్వడం.
BRCA1, BRCA2, (BR Breast CA Cancer Gene 1 and 2)
బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు
- రొమ్ము పై గడ్డలు ఏర్పడటం,
- చను మొనల నుంచి చీము,
- రక్తం కారటం, రొమ్ము పై నొప్పి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- అలాగే వక్షోజాలల ఆకృతి లో మార్పులు, కూడా కనిపిస్తాయి.
- ఉబ్బిన రొమ్ముల రూపంలో వాపు, రొమ్ము చర్మం పొట్టు, చనుమొన నొప్పి, ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాలు.
గుర్తించడమెలా..?
పై లక్షణాలు కనిపించినప్పుడు CT scan, MRI, Nuclear Scan, Bone Scan, PET Scan, Ultrasound, X-rays, Biopsy, వంటి టెస్టులు చేయించుకోవాలి. అలాగే సంవత్సరానికి ఒకసారి 30 ఏళ్లు వపై బడిన మహిళలు కచ్చితంగా సంవత్సరానికి ఒకసారి బాడీ ఫిజికల్ ఎక్సామిన్ చేసుకోవాలి.
బాడీ ఫిజికల్ ఎక్సామిన్ చేసుకునే విధానం:
అద్దం ముందు నిలుచుని అర చేతితో ఛాతీ భాగాలపై, అలాగే రొమ్ములు, చంకలలో ఇతర భాగాలలో సున్నితంగా తాడుముకోవాలి. అయితే ఈ క్రమంలో గడ్డలు ఉన్నట్లు అనుమానం కలిగినా లేదా చను మొనల నుంచి ద్రవాలు కారుతున్నట్లు అనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
బ్రెస్ట్ క్యాన్సర్ ఎన్ని రకాలు:
- ఆంజియోసార్కోమా (Angiosarcoma)
- డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS) (Ductal carcinoma in situ)
- ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్(Inflammatory breast cancer)
- ఇన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా (Invasive lobular carcinoma)
- లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు (LCIS) (Lobular carcinoma in situ)
- మగ రొమ్ము క్యాన్సర్(Male breast cancer)
- రొమ్ము యొక్క పేగెట్స్ వ్యాధి (Paget’s disease of the breast)
- పునరావృత రొమ్ము క్యాన్సర్ (Recurrent breast cancer)
పైన తెలుపబడిన వాటిలో ఎక్కువగా మన దేశంలోని మహిళలు ఆంజియోసార్కోమా (Angiosarcoma) సమస్య ని ఎదుర్కుంటున్నారు.
ఆంజియోసార్కోమా (Angiosarcoma):
ఈ క్యాన్సర్ రొమ్ములోని రక్తనాళాలు అలాగే లింఫ్ నాళాలలో కలిసే లైనింగ్ లో వస్తుంటుంది. అయితే ఈ లైనింగ్ మన శరీరంలోని చెడు బాక్టీరియా, వైరస్ అలాగే ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి బయటికి పంపిస్తుంటుంది.
ఆంజియోసార్కోమా లక్షణాలు:
- చనుమొనల నుంచి పాలుకి బదులు చీము లేదా రక్తం కారడం
- రొమ్ముపై దద్దుర్లు
- అలాగే రొమ్ము చర్మ రంగులో స్వల్ప తేడాలు ఉండటం.
- తక్కువ సమయంలోనే రొమ్ములు పెద్దగా మారటం, (వాపు)
- రొమ్ము పై పొలుసు చర్మం.
- రొమ్ముపై చర్మం సున్నితంగా మారి చిన్న దెబ్బతగిలినా రక్తస్రావం అవటం
- రొమ్ముపై గాయం ఏర్పడినప్పుడు చర్మం చుట్టూ చీము ఏర్పడి గాయం తొందరగా మనక పోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అలాగే ఈ ఆంజియోసార్కోమా లక్షణాలు మొదటి దశ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ కి రేడియేషన్ థెరపీ చేయించిన 8 లేదా 10 సంవత్సరాల తర్వాత కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఈ ఆంజియోసార్కోమా వేధి తీవ్రత లక్షణాల ఆధారంగా రెండు రకాలుగా విభజించారు.
అవి:
- ప్రైమరీ ఆంజియోసార్కోమా (Primary angiosarcoma)
- సెకండరీ ఆంజియోసార్కోమా (Secondary angiosarcoma) ఇందులో ప్రైమరీ ఆంజియోసార్కోమా సాధారణంగా 30 నుంచి 40ఏళ్ల వయసున్న స్త్రీలలో కనిపిస్తుంటుంది. సెకండరీ ఆంజియోసార్కోమా రేడియొథెరపీ. కీమో థెరపీ వంటి చికిత్సలు తీసుకున్నవారిలో కనిపిస్తూ ఉంటుంది.
డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS) (Ductal Carcinoma In Situ)
డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS). ఇది క్యాన్సర్ ప్రారంభ దశ అని చెప్పవచ్చు. అలాగే ఈ దశలో క్యాన్సర్ రొమ్ములోని పాలు ప్రవహించే నాళాల పై ఉంటుంది. కానీ ఇది ఒక చోట నుంచి మరో చోటకి ప్రవహించదు. దీంతో క్యాన్సర్ డక్టల్ కార్సినోమా ఇన్ సిటు దశలో ఉన్నప్పుడు మాస్టేక్టమీ లేదా కీమో, రేడియేషన్ సర్జరీలతో సులభంగా నయం చేసుకోవచ్చు. అలాగే ఈ దశలో ఇమ్యూనో థెరపీ ద్వారా కూడా నొప్పి లేకుండా క్యాన్సర్ ని నయం చేస్తారు.
ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ (Inflammatory Breast Cancer):
ఈ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ ని తెలుగులో తాప జనక రొమ్ము క్యాన్సర్అని పిలుస్తారు. అయితే ఈ రొమ్ము క్యాన్సర్ దాదాపుగా 3 లేదా 4వ స్టేజీలో గుర్తిస్తుంటారు. అలాగే క్యాన్సర్ కణాలు రొమ్ము భాగంలో ఉన్నటువంటి శోషరస నాళాలను (Lymph Vessels) అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్ కణాల ప్రభావం వ్యాప్తి పెరుగుతూ రోజురోజుకి వ్యాధి తీవ్రత ఎక్కువవయాఉత్తవ్వ ఉంటుంది.
సాధారణంగా ఈ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజీలో ఉన్నప్పుడు
- రొమ్ముపై వాపు ఏర్పడటం,
- రొమ్ము రంగు మారటం (ఎరుపు లేదా గులాబీ రంగులో ఉండటం),
- చనుమొనల నుంచి చీము, నెత్తురు, జిగట ద్రవాలు కారటం,
- రొమ్ము పై చర్మ సమస్యలు రావటం,
- ఉన్నట్లుండి రొమ్ము బరువు పెరగటం లేదా తగ్గటం, వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ దశలో ట్రీట్మెంట్ తీసుకోవటం మొదలు పెట్టకపోతే వ్యాధి తీవ్రత పెరిగి ఒక చోట నుంచి మరో చోటకి క్యాన్సర్ పాకే ప్రమాదం ఉంటుంది.
ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఎలా.?
ఈ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ కి వ్యాధి తీవ్రత మరియు ప్రభావాన్ని బట్టి కీమో థెరపీ, సర్జరీ, రేడియొ థెరపీ మరియు ఇమ్యూన్ థెరపీ వంటివి డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు.
ఎన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా (ILC):
ఈ రకమైన క్యాన్సర్ రొమ్ములోని పాలు ఉత్పత్తి చేసే గ్రంధులలో వస్తుంటుంది. అలాగే క్యాన్సర్ సెల్స్ ఒక చోట నుంచి మరో చోట వ్యాపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పాలు ఉత్పత్తి చేసే గ్రంథుల నుండి విడిపోయి లింఫ్ నోడ్స్ లో చేరే ప్రమాదం కూడా ఉంటుంది.
లక్షణాలు:
ఈ ఎన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా క్యాన్సర్ మొదలైన కొత్తలో ఎలాంటి సంకేతాలను చూపించదు. కానీ సాధారణ దశ నుంచి అసాధారణ దశ కి చేరుకున్న తర్వాత మాత్రం
- రొమ్ములో వాపు
- రొమ్ము గట్టి పడటం
- రొమ్ము ఆకృతిలో మార్పు ఉండటం
- చనుమొనలపై అసాధారణ ఆకారాలు కనిపించడం,
తదితర లక్షణాలు కనిపిస్తాయి.
లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు (LCIS) (Lobular Carcinoma In Situ)
ఈ లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు (LCIS) కూడా ఎన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా మాదిరిగానే రొమ్ములో పాలు ఉత్పత్తి చేసే గ్రంథులలో ఏర్పడుతుంది. అలాగే ఈ LCIS సమస్య ఉన్నవాళ్ళలో 20 శాతం మంది మహిళలు మాత్రమే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. మిగిలిన మహిళల్లో కేవలం క్యాన్సర్ లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయ్. అలాగే ఈ లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు అనేది క్యాన్సర్ కాదు. కేవలం క్యాన్సర్ వచ్చే ముందు సంకేతం మాత్రమే. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్ళు ముందుగానే గుర్తించి డాక్టర్లను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
ఎలా గుర్తించాలి.?
కానీలోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు సాధారణ క్యాన్సర్ నిర్థారణ పరీక్షలలో కనిపించదు. కేవలం బయాప్సీ పరీక్షలో మాత్రమే బయటపడుతుంది.
చికిత్సా విధానం:
సాధారణంగా ఈ సమస్య ఉన్నవాళ్ళకి వైద్యులు ఎలాంటి చికిత్సని సూచించరు. ఎందుకంటే ఈ LCIS వలన రొమ్ము క్యాన్సర్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. దాంతో 6 నుంచి 12 నెలలు రొమ్ము పర్యవేక్షణ పద్దతి(Breast Monitoring) ని సూచిస్తారు.ఆ తర్వాత వ్యాధి తీవ్రత మరియు వ్యాప్తి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సర్జరీ మరియు హార్మోన్ థెరపీ ని డాక్టర్లు సిఫారసు చేస్తారు.అయితే సర్జరీలో కొన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా LCIS కి సంబందించిన ప్లోమోర్ఫిక్ (Pleomorphic LCIS) లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు కలిగి ఉంటే బ్రెస్ట్ మాణిటరింగ్
కాకుండా రొమ్ము సంరక్షణ శస్త్ర చికిత్స(breast conserving surgery) సూచిస్తారు. కాగా ఈ సర్జరీలో భాగంగా రొమ్ము లేదా రొమ్ము కణజాలం పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది.
ఇక హార్మోన్ థెరపీ లో భాగంగా లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు లక్షణాలను తగ్గిస్తుంది. ఇందులో భాగంగా కణాలు పెరుగుదల ను నిరోధించడంతోపాటూ తర్వాతి దశకి వెళ్ళకుండా అడ్డుకుంటాయి.
బ్రెస్ట్ క్యాన్సర్ దశలు :
బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి తీవ్రత అలాగే క్యాన్సర్ కణతి పరిమాణం వంటి వాటిని ఆధారంగా చేసుకుని 4 దశలుగా విభజించడం జరిగినది.
మొదటి దశ :
ఈ దశలో అసాధారణ కణాలు ఏర్పడుతాయి. కానీఇవి ఒక చోట నుంచి మరో చోటకి వ్యాపించవు. అలాగే లక్షణాలు మాత్రమే బయట పడుతాయి. ఈ దశలో ఉన్నప్పుడే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవటం మొదలు పెడితే చాలా సులభంగా క్యాన్సర్ ని నయం చేసుకోవచ్చు.
అలాగే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు సక్సస్ రేటు దాదాపుగా 100 శాతం ఉంటుంది. అలాగే ఈ దశలో ఉన్నప్పుడు ఎక్కువగా క్యాన్సర్ కణాలు వృద్ది చెందడానికి అవసరమయ్యే HER2 (Human Epidermal Growth factor Receptor 2) ప్రోటీన్ నియంత్రించే వైద్య విధానాలను అనుసరిస్తారు. దీంతో క్యాన్సర్ కణాలు మొదటి స్టేజ్ లోనే అంతం చేయబడతాయి.
రెండవ దశ:
మొదటి దశలో క్యాన్సర్ ని గుర్తించకపోతే కణాలు పెరిగి పెద్దవడంతోపాటూ చుట్టూ ప్రక్కలకి కూడా ప్రాకడం కనిపిస్తుంది. ఈ దశలో కచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే క్యాన్సర్ కణతులు క్రమంగా పెరిగి 2 లేదా 5 మిల్లీ. మీ ఉంటుంది. ఈ దశలో స్టేజ్ 2ఏ మరియు 2బి అనే మరో సబ్ స్టేజ్ లు ఉంటాయి.
2ఏ : ఈ స్టేజ్ లో క్యాన్సర్ కణతులు 2cm పొడవు ఉంటాయి. అలాగే లింఫ్ నోడ్స్ లో చేరుతాయి. ఒక్కోసారి క్యాన్సర్ కణాలు లేదా కణతులు కనిపించవు. కానీ సైలెంట్ గా ఒకచోట నుంచి మరోచోటకి వ్యాప్తి చెందుతుంటాయి. అలాగే లింఫ్ నాళాల్లోకి కూడా వ్యాప్తి చెందుతాయి.
2బి: ఈ స్టేజ్ లో కూడా క్యాన్సర్ కణతులు 2 లేదా 5cm ఉంటాయి. ఈ 2బి స్టేజ్ లో రెండు లేదా మూడు లింఫ్ నోడ్స్ లో చేరుతాయి. అలాగే చంకలలో మరియు రొమ్ము ఎముకలలో కూడా చేరుతాయి. దీంతో ఈ 2బి స్టేజ్ లో క్యాన్సర్ వివరాలు కచ్చితంగా బయట పడుతాయి. కానీ లింఫ్ నాళాలలోకి వ్యాపించవు.
ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ సక్సస్ రేట్ దాదాపుగా 70 నుంచి 80 శాతం ఉంటుంది.
క్యాన్సర్ ట్రీట్మెంట్ లో మొదటి రెండు దశలు ఒక ఎత్తుయితే 3 మరియు 4 దశలు చాలా కీలకం. ఎందుకంటే 3 మరియు 4 దశలలోనే వ్యాధి తీవ్రత తారా స్థాయిలో ఉంటుంది.
మూడవ దశ:
ఒకవేళ రెండవ దశలో కూడా ట్రీట్మెంట్ తీసుకోక పోతే కణతి 5-9CM మధ్య ఉంటుంది. అలాగే లింప్ నోడ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక రెండవ స్టేజ్ లో మాదిరిగానే 3వ దశలో కూడా 3ఏ, 3బి మరియి 3సి అనే మరో మూడు సబ్ స్టేజిలు ఉంటాయి.
3ఏ: ఈ స్టేజ్ లో క్యాన్సర్ కణతులు 5సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. లింఫ్ నోడ్స్ లో కనీసం 4 నుంచి 5కి పైగా చోట్లకి ప్రయకి ఉంటుంది. అంతేగాకుండా చిన్న చిన్న కణతులుగా విడిపోయి ఒక చోటనుంచి మరో చోటకి వ్యాపించి ఉంటుంది.
3బి: ఈ స్టేజ్ లో క్యాన్సర్ కణతులు కనీసం 7 నుంచి 9 లింఫ్ నోడ్స్ లో అలాగే చంక బాగాలలోకి వ్యాపించి ఉంటుంది. అలాగే రొమ్ము గోడలపై మరియు రొమ్ము చర్మం పై కూడా వ్యాపించి ఉంటుంది. దీంతో చికిత్స తీసుకోవటం అలసాయం లేదా నిర్లక్ష్యం చేసినా ట్రీట్మెంట్ కి స్పందించే అవకాశాలు రోజురోజుకి దాదాపుగా తగ్గుతూ ఉంటాయి.
3సి: ఈ స్టేజ్ లో క్యాన్సర్ కణతి ఎంత సైజులో ఉందనే విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే క్యాన్సర్ కణతులు దాదాపుగా పెరగడంతోపాటూ ఇతర చోట్లకి ప్రాకి ఒక విధమైన వాపు, పుండు, వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే క్యాన్సర్ గడ్డలు దాదాపుగా 10కి పైగా లింఫ్ నోడ్స్ లో వ్యాపించి ఉంటాయి. దీంతో దాదాపుగా క్యాన్సర్ ముదిరిన స్టేజ్ లో ఉంటుంది.
ఒకటి లేదా రెండు దశలలో నిర్లక్ష్యం చేసి నేరుగా 3వ స్టేజ్ లో ఉన్నప్పుడు పేషెంట్ ఇమ్యూనిటీ పవర్, అలాగే క్యాన్సర్ కణాలు లేదా గడ్డల పరిమాణం , ఆర్గాన్ డ్యామేజ్, మరిన్ని ఇతర ఆరోగ్య అంశాలను దృష్టా సక్సస్ రేట్ 50-60% శాతం మాత్రమే ఉంటుంది.
ఇక 4వ దశ:
క్యాన్సర్ రొమ్ము ని దాటి వేరే అవయవాలకు వ్యాపిస్తూ ఉంటుంది. ఈ దశలో రొమ్ముతోపాటూ మెదుడు, కాలేయం, ఎముకలు, కిడ్నీ వంటివాటికి కూడా క్యాన్సర్ వ్యాధి ప్రాకుతూ ఇతర శరీర భాగాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ 4వ దశ క్యాన్సర్స్ లో అన్ని క్యాన్సర్లను నయం చేయలేము. కాబట్టి సక్సస్ రేట్ 30/50 ఉంటుంది.
ఒకవేళ మనం తీసుకునే ట్రీట్మెంట్ కి క్యాన్సర్ రెస్పాండ్ అయితే క్యాన్సర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం జీవితకాలం పొడిగించే వీలు ఉంటుంది. కాబట్టి మొదటి లేదా రెండవ దశలలోనే క్యాన్సర్ ని గుర్తించి జాగ్రత్త పడితే ట్రీట్మెంట్ కి సులభంగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
చికిత్సా విధానం:
పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సోకితే శస్త్రచికిత్స, రేడియో థెరపీ, కీమో థెరపీ, హార్మోన్ థెరపీ, వంటి వైద్య నివారణోపాయాలు ఉన్నాయి.
సర్జరీ:
సాధారణంగా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నసమయంలో సర్జరీ ద్వారా క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఉన్న చోటుని లేదా పూర్తీ రొమ్ము ని తొలగిస్తూ ఉంటారు. అలాగే ఒక్కోసారి క్యాన్సర్ రొమ్ముచుట్టు ప్రక్కల ప్రాంతాలకి ప్రాకినట్లు వైద్యులు గుర్తిస్తే రొమ్ము చుట్టు ప్రక్కల ప్రాంతాలను కూడా తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కేవలం గడ్డలుగా ఏర్పడి ఉన్నా కూడా సర్జరీ చేసి క్యాన్సర్ గడ్డలను తొలగిస్తారు. ఒకవేళ కేవలం లింఫ్ నోడ్స్ లో మాత్రమే క్యాన్సర్ వ్యాపించి ఉన్నాసరే క్యాన్సర్ ని సర్జరీ చేసి తొలగిస్తారు. ఈ పద్దతిని మాస్టెక్టమి అని పిలుస్తారు.
కీమో థెరపీ:
సాధారణంగా పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించినప్పుడు ఎక్కువమంది మొదటగా సర్జరీ వైపే మొగ్గు చూపుతుంటారు.
ఒకవేళ సర్జరీ చేయించుకున్నా సరే క్యాన్సర్ తగ్గకపోయినా లేదా మళ్ళీ రిపీట్ అయిన సమయంలో డాక్టర్లు కీమో థెరపీ సిపారసు చేస్తుంటారు. అంతేగాకుండా ఒక్కోసారి క్యాన్సర్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కూడా కీమో థెరపీ ని సూచిస్తూ ఉంటారు.
ఇందులో ముఖ్యంగా క్యాన్సర్ కణతులు 2 సెంటీమీటర్లు ఉన్నప్పుడు మరియు క్యాన్సర్ కణాలు లింఫ్ నోడ్స్ లో తక్కువగా వ్యాపించి ఉన్నప్పుడు, అలాగే క్యాన్సర్ కణాలు తక్కువ చోట్లకి వ్యాపించి ఉన్నప్పుడు ఈ కీమో థెరపీ ని సూచిస్తూ ఉంటారు.
ఒకవేళ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉండి సర్జరీ చేయడానికి వీలు లేని సమయంలో కూడా ఈ కీమో థెరపీ ని సిపారాసు చేస్తుంటారు వైద్యులు. ఎందుకంటే ముందుగా ఈ కీమో థెరపీ ద్వారా క్యాన్సర్ తీవ్రతని తగ్గిస్తారు. ఆ తర్వాత సర్జరీ చేస్తారు.
రెడీయేషన్ థెరపీ:
రెడీయేషన్ థెరపీ ని దాదాపుగా సర్జరీ పూర్తయిన పేషెంట్స్ కి వైద్యులు సిపారసు చేస్తుంటారు. అయితే ఇందుకుగల ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని చూసినట్లయితే సర్జరీ చేసిన తర్వాత కణాలు ఎక్కడైనా శరీరంలో జీవించి ఉన్నా లేదా ముందస్తు జాగ్రత్తతో డాక్టర్లు ఈ రెడీయేషన్ థెరపీ ని సూచిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ రెడీయేషన్ థెరపీ ఎన్ని రోజులు తీసుకోవాలనేది క్యాన్సర్ కణాల తీవ్రతనుబట్టి ఎన్ని రోజులు తీసుకోవాలనే విషయాన్ని వైద్య నిపుణులు నిర్ణయిస్తారు.
హార్మోన్ థెరపీ:
మహిళల్లో మాదిరిగానే పురుషులలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సోకినప్పుడు హార్మోన్ థెరపీ ని వైద్యులు సిపారసు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేస్తారు. అయితే ఈ హార్మోన్ థెరపీ తీసుకున తర్వాత ఒక్కోసారి దుష్పభావాలను కూడా ఎదురయే అవకాశం ఉంటుంది.
ఇందులో ముఖ్యంగా హార్మోన్ థెరపీ చేయించుకున్న పురుషుల్లో ఎక్కువగా,
- నిద్ర పట్టకపోవడం,
- శ్రునగరంలో ఎక్కువసేపు పాల్గొనక లేకపోవటం,
- డిప్రెషన్ లో ఉండటం,
- ఆందోళన,
- ఉన్నట్లుండి బరువు పెరగటం,
వంటి చెడు ప్రభావాలు కూడా కలిగి ఉంటారు.
ఈ కారణంగానే చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ సోకిన పురుషులు ఈ హార్మోన్ థెరపీ చికిత్స తీసుకోవటానికి పెద్దగా మొగ్గుచూపరు.
Also read: క్యాన్సర్ సంక్షేమానికి లాభాపేక్షలేని సంస్థలు (నాన్ ప్రాఫిట్ ఆర్గనైసేషన్) ఏ విధంగా సహకరిస్తాయి?