క్యాన్సర్ వ్యాధులన్నిటిలోకెల్లా ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్న వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా చనిపోయే వారే ఎక్కువ. మిగిలిన అన్ని క్యాన్సర్ల కారణంగా ఎంతమంది చనిపోతున్నారో ఒక్క ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే అంతమంది చనిపోతున్నారు. లంగ్ క్యాన్సర్ పురుషుల్లో అత్యధికంగా వస్తుంటుంది మహిళల్లో మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత రెండో స్థానంలో ఉంది.
దీనిలో ఉన్న ప్రధాన డ్రా బ్యాక్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో దీనిని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటుంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినవారిలో అత్యధిక శాతం మంది చివరి దశల్లో వ్యాధిని గుర్తించడం వలన చనిపోతుంటారు. అలాగని ఊపిరితిత్తుల క్యాన్సర్ కు చికిత్స లేదనుకోవడం పొరపాటు. తొలిదశలోనే దీన్ని గుర్తిస్తే నయం చేసే అవకాశాలు లేకపోలేదు. ఆయుర్వేదంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు మంచి వైద్యం ఉంది. మేము గత కొన్నేళ్ళుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు మా సంస్థ ద్వారా చికిత్స అందిస్తున్నాము. పునర్జన్ ఆయుర్వేద గర్వంగా చెబుతుoది వ్యాధి ఏ దశలో ఉన్నా మూలాల నుంచి చికిత్స చేస్తూ ఎంతోమందికి ఉపశమనం కలిగించాము.
ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే అవగాహన ఉంటే వ్యాధి నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది.
లంగ్ క్యాన్సర్ కారణాలు
అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ కేసుల్లో సగం ఊపిరితిత్తులకు సంబంధించినవే. ఎందుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇంత ఉధృతంగా ఉంది… అంటే…? దానికి కనిపిస్తున్న కారణం ఒక్కటే.
కాలుష్యం
అవునండి మనం పీలుస్తున్న శ్వాస ద్వారా ఈ కాలుష్యం లోపలికి ప్రవేశించి ఊపిరితిత్తులను పాడుచేసేస్తోంది. ఈ కాలుష్యాల కారణంగా ఏటా 20 లక్షల మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకితే అందులో 85 శాతం మంది అంటే 17 లక్షల మంది చనిపోతున్నారు. ఇది కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయమే.
నేను స్పష్టంగా చెప్పగలను ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే. ఈ కాలుష్యానికి కారణం కూడా మనుషులే. ఎక్కడ పడితే అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు… వాటి నుంచి వెలువడే కాలుష్యం గాలిలోనూ, నీటిలోనూ, భూమిలోనూ కలిసిపోతుంది.
- ఆస్బెస్టాస్, టొబాకో, అల్యూమినియం పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధాలు
- పెట్రోల్, డీజిల్, బొగ్గు కాలిస్తే వచ్చే కాలుష్యం
- రబ్బర్, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే విషవాయువులు
ఇవన్ని స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తాయి. ఈ గాలిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఏ ఒక్క కణంలో జన్యుమార్పు చోటుచేసుకున్నా ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకే అవకాశముంది. అందుకే పట్టణాల్లో ఉండేవారిలోనే ఈ వ్యాధిని ఎక్కువగా చూస్తుంటాము. వారెప్పుడూ కాలుష్యానికి దగ్గరగా ఉంటారు కాబట్టి.
పొగ త్రాగడం, కైనీ, గుట్కాలు నమలడం వలన కూడా ఊపిరితిత్తులకు, గొంతుకి కూడా క్యాన్సర్ వస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం పురుషులలో 90% మందికి పొగాకు వల్లనే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ తాగేటప్పుడు.. ఒక్కసారి పొగ లోపలికి లాగితే 500కీ పైగా టొబాకో ఇంగ్రేడియంట్స్ ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళిపోతాయి. వీటిలో 70కి పైగా క్యాన్సర్ కారకాలు లేదా కార్సినోజెన్స్ ఉంటాయి… ఇవి క్యాన్సర్ కణాలను వృద్ధి చేస్తాయి. తద్వారా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశముంది.
వాహనాల నుండి వచ్చే కాలుష్యం కూడా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణమే. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. దీనికి డెత్ రేటు ఎక్కువ… ఇందాక మనం చెప్పుకున్నాం… వందమందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే అందులో 85 మంది చనిపోతున్నారు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ను తొందరగా గుర్తిస్తే మంచిది
లంగ్ క్యాన్సర్ లక్షణాలు
లంగ్ క్యాన్సర్ ప్రధానంగా దగ్గు ఎక్కువగా వస్తుంటుంది. అది పొడి దగ్గు కావచ్చు కళ్లి/కఫంతో కూడిన దగ్గు కావచ్చు. ఒక్కోసారి కళ్లిలో రక్తం కూడా పడుతుంటుంది. ఇలా తరచుగా దగ్గు వస్తూ… ఇరవై ముప్పై రోజులైనా తగ్గకపోతే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యే అవకాశాలున్నాయి. కొంతమందికి ఛాతీలో నొప్పిగా ఉంటుంటుంది…
- కొంచెం దూరం నడిచినా ఆయాసం రావడం…
- గొంతు మారిపోవడం…
- ఆకలి చచ్చిపోతుంది… దాంతోబరువు తగ్గడం
- ఎముకల్లో నొప్పులు పుట్టడం… ఒక్కోసారి ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు గానీ ఇది బయట పడదు. సర్జరీ చేసే సమయంలో టిష్యూ పరీక్ష చేస్తే అప్పటికే ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చి ఉంటుంది. అదే ఎముకల వరకు వ్యాపిస్తుంది. ఇలా ఎముకల బలహీనపడి ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ అయిన సందర్భాలు అనేకమున్నాయి…
- కొంతమందికి జ్వరం వస్తుంది. మూడు నాలుగు వారాలైనా తగ్గదు. యాంటీబయాటిక్స్ వాడినా జ్వరం తగ్గకపోతే వెంటనే అనుమానించాలి.
వెంటనే డాక్టరును సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
వైద్య పరిక్షల ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సరును నిర్దారించవచ్చు.
మొదటగా సీటి స్కాన్ చేయించాలి. దీని ద్వారా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణాలు ఉంటే గుర్తించవచ్చు. అవి క్యాన్సర్ కణాలేనని గుర్తించిన తర్వాత అక్కడి నుండి టిష్యులు సేకరించి బయాప్సీ చేయాలి. బయాప్సీ చేస్తేనే శరీరంలో గుర్తించిన గడ్డ క్యాన్సర్ కు సంబంధించినదో కాదో నిర్ధారణ అవుతుంది. చివరగా ఈ వ్యాధి ఏ మేరకు వ్యాపించిందనేది తెలుసుకోవడం కోసం మరొక పరీక్ష చేయాల్సి ఉంటుంది. దీన్ని PET సీటి స్కాన్ అంటారు. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ – PET సీటీ స్కాన్ ద్వారా క్యాన్సర్ కణాల యొక్క మెటబాలిక్(వ్యాప్తి చెందే) స్వభావం ఏ స్థాయిలో ఉందో లేదా ఏ మేరకు విస్తరించిందో తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన క్యాన్సర్ అనేది కూడా తెలిసిపోతుంది.
లంగ్ క్యాన్సర్ రకాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్లో కొన్ని రకాలు ఉంటాయి
- స్క్వామస్ సెల్ కార్సినోమా
- అడినో కార్సినోమా
- స్మాల్ సెల్ కార్సినోమా
లార్జ్ సెల్ కార్సినోమా అని కొన్నిరకాలు ఉంటాయి. అదేంటో గుర్తిస్తే చికిత్స చేయడం సులువవుతుంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో ఈ గడ్డలు ఏర్పడ్డ ప్రాంతాన్ని గుర్తించి వైద్యం చేయడం జరుగుతుంటుంది. ఊపిరితిత్తుల్లో ఎక్కడెక్కడ ఈ గడ్డలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి? ఊపిరితిత్తులపై ప్లూరా అనే పలుచటి పొర ఉంటుంది. ఈ పొర మీద ఒక్కోసారి క్యాన్సర్ గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది…
ఊపిరితిత్తుల మొదలు బ్రాంకై దగ్గర క్యాన్సర్ కణాలు ఏర్పడుతుంటాయి. బ్రాంకై దగ్గర గడ్డలు వస్తే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. దాని వల్ల మొహం, మెడ భాగం ఉబ్బుతుంటాయి. ఊపిరితిత్తుల లోపల ఎడమ పక్కన రెండు కుడిపక్కన మూడు లోబ్స్ ఉంటాయి. వీటిలో కూడా గడ్డలు ఏర్పడుతుంటాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సా విధానాలు
మరి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు అందుబాటులో ఉన్న చికిత్సా విదానాలేంటి?
యధాతధంగానే క్యాన్సర్ అనగానే వెంటనే తగ్గిపోవాలి అనుకుంటారు. నేరుగా ఇంగ్లిష్ మెడిసిన్ వాడాలని డిసైడ్ అవుతూ ఉంటారు. అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్లగానే వాళ్లు సర్జరీ చేయాల్సిందే అంటారు… కానీ మొదటి స్టేజిలోనో రెండో స్టేజీలోనో ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తేనే సర్జరీ అయినా సాధ్యపడుతుందని చెబుతారు.
లంగ్ క్యాన్సర్ కు సర్జరీ లేకుండానే ఆయుర్వేదంలో చికిత్స
రసాయన ఆయుర్వేదంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు అద్భుతమైన చికిత్స ఉంది. మా వైద్యబృందం ఎటువంటి సర్జరీ లేకుండానే ఊపిరితిత్తుల క్యాన్సర్ కు చక్కటి పరిష్కారాన్ని సూచిస్తున్నారు. ఆయుర్వేదంలో వ్యాధి మూలాలను గుర్తించి అక్కడి నుండి చికిత్స ప్రారంభించడం జరుగుతుంది. అద్భుత శక్తి కలిగిన రసభస్మాలతో తయారు చేసిన రసాయన ఔషధాలకు ఎలాంటి మొండి వ్యాదులనైనా నయం చేసే శక్తి ఉంది. క్యాన్సర్ వ్యాధి చికిత్సకు అశ్వగంధ, శతావరి, శిలాజిత్తు, తిప్పతీగ, దిరిసెన, పునర్నవ, నేలఉసిరి ఇలా ఆయుర్వేదంలో 200కు పైగా మూలికలు అందుబాటులో ఉన్నాయి.
నిజం చెప్పాలంటే క్యాన్సర్ నివారణకు ఆయుర్వేదాన్ని మించిన చికిత్స లేదు. ఎంతోమంది నమ్మకంతో వాడుతున్నారు, ధైర్యంగా ఈ మహమ్మారిపై పోరాడుతున్నారు.
గతంలో పునర్జన్ ఆయుర్వేద ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్కు వైద్యం చేయించుకున్న వారిని సంప్రదించండి లేదా ఎవరైనా డాక్టర్ను కలిసి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. నమ్మకం కుదిరితేనే ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించండి. క్యాన్సర్ చికిత్సలో ఆయుర్వేదం అత్యుత్తమం.
ముఖ్య గమనిక :
ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Also read: పొగ త్రాగడం వలన క్యాన్సర్ వస్తుందా?