Punarjan Ayurveda Hospitals

పసుపు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

తెలుగింటి సాంప్రదాయం  వెలుగంటి ఔషదం ఈ పసుపు

చర్మ సౌందర్యానికి 

పసుపులో మెడికల్ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. దాని వల్ల చర్మకాంతికి, చర్మ సౌందర్యానికి, పాదాల రక్షణకు, ఇతరత్రా శుభాకార్యాలన్నిటికీ పసుపునే వాడతారు.  

ఇమ్యూనిటీ

పసుపులో వున్నా కుర్కుమిన్ ఒక సహజ రోగనిరోధక సమ్మేళనం. ప్రతిరోజూ వంటల్లో పసుపు వాడితే ఎన్నో ప్రయోజనాలుంటాయి.  

జలుబు

జలుబు చేసినప్పుడు వేడివేడి పాలలో పసుపు వేసుకుని తాగితే జలుబు ఇట్టే పోతుంది. నీరు మరగబెట్టి ఆవిరిపడితే ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం మొత్తం బయటకు వచ్చేస్తుంది. 

సెప్టిక్ కాకుండా  

రక్తాన్ని గడ్డ కట్టడానికి కూడా పసుపు ఉపయోగపడతుంది. అందుకే ఎవరికైనా దెబ్బ తగిలితే ముందు గుప్పెడు పసుపుని తీసుకుని దెబ్బ తగిలిన చోట పెడుతుంటారు.  

క్యాన్సర్ నిరోధకంగా

ముఖ్యంగా పసుపులోని కుర్కుమిన్ క్యాన్సర్ వ్యాధిపై అద్భుతంగా పోరాడుతుంది. శరీరంలో వున్న కాన్సర్ కణాలను చంపి క్యాన్సర్ కణాలు వృద్ధికాకుండా సమర్ధవంతంగా అడ్డుకుంటుంది. 

గుండె సమస్యలు

మీరు గాని గుండె జబ్బులతో బాధపడుతుంటే పసుపు మీకు మంచి పరిష్కారం. పసుపు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  

బరువు తగ్గడం

పసుపులోని కర్కుమిన్ మన బాడీకి చాలా మంచిది. ఇది మన బాడీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా బరువు పెరగకుండా ఉంటాం. 

పసుపు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్ కణాల నుండి రక్షిస్తుంది. కచ్చితంగా పసుపు వాడడం అలవాటు చేసుకోండి.  ముత్యమంటి పసుపు వలన ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి. 

More Stories

జలుబు మరియు దగ్గు సమస్యల నివారణకు ఏడు ఇంటి చిట్కాలు