క్యాన్సర్ వ్యాధి చికిత్సలో తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రోజున ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటికీ అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నంలోనే అనేక వైద్యవిధానాలు విఫలమయ్యాయి కూడా. క్యాన్సర్ చికిత్సలో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే వైద్యం ఏదైనా ఉందంటే అది ఒక్క రసాయన ఆయుర్వేదం మాత్రమే… ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పునర్జన్ ఆయుర్వేద కచ్చితమైన రసాయన ఆయుర్వేద వైద్యంతో క్యాన్సర్ల చికిత్సలో తనదైన పాత్రను పోషిస్తోంది. అంతకంటే ముఖ్యంగా క్యాన్సర్ కారకాలపై అవగాహన కల్పిస్తూ వ్యాధిని నిర్మూలించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతోంది ఈరోజున.
సాధారణంగా బ్లాడర్ క్యాన్సర్ వయసు పైబడిన వారిలో మాత్రమే ఎక్కువగా వస్తుంటుంది. ఈ బ్లాడర్ క్యాన్సర్ వచ్చిన వారిలో సగటు వయసు చూస్తే మాత్రం 60-65 గా చెప్పవచ్చు. అలాగే బ్లాడర్ క్యాన్సర్ స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువగా వస్తుంటుంది.
అసలు శరీరంలో ఈ యూరినరీ బ్లాడర్ పనేంటి? మూత్రాన్ని విసర్జించక ముందు మూత్రం ఈ మూత్రాశయంలోనే స్టోర్ అయి ఉంటుంది. జన్యుమార్పు కారణంగానే… సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారుతుంటాయి. ఈ విధంగా మూత్రాశయం లోపలి భాగంలో ఎక్కడైనా అసాధారణ కణాలు పుడితే అవి వాటంతటవే వృద్ధి చెంది గడ్డల్లా ఏర్పడతాయి. శరీరంలో ఈ మూత్రాశయం నిర్మాణాన్ని గమనించినట్లైతే… ఇది కిడ్నీలకు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మూత్రాశయ క్యాన్సర్ వలన కిడ్నీలకు ప్రమాదం ఉంది. మూత్రాశయ క్యాన్సరును ముందుగానే గుర్తిస్తే ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటపడే అవకాశముంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం మిగతా క్యాన్సర్ల తీరుగానే బ్లాడర్ క్యాన్సర్లో కూడా తీవ్ర పరిణామాలుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు
- మూత్రం అతికష్టంగా రావడం
- విపరీతంగా వెన్నునొప్పి రావడం
- రోజులో ఎక్కువ సార్లు మూత్రం పోయడం
- ఒక్కోసారి మూత్రంలో రక్తం పడుతుండటం.
- మూత్రం రంగు మారుతుండటం.
బ్లాడర్ క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు
బ్లాడర్ క్యాన్సర్ నిర్దారించడానికి ప్రధానంగా కొన్ని పరిక్షలు చేయాల్సి ఉంటుంది.
సాధారణ మూత్ర పరీక్ష చేస్తే బ్లాడర్ క్యాన్సర్ ఉన్నవారికి మూత్రంలో ఈ క్యాన్సర్ కారకాలు కనిపించే అవకాశముంది. ఇంకా సైటో స్కోపీ… వంటి అధునాతన పద్ధతుల్లో క్యాన్సర్ నిర్ధారణ అయ్యే అవకాశాలున్నాయి.
క్యాన్సర్ కణాలున్నాయని నిర్ధారణ చేయడానికి చేసే మరో కీలక పరీక్ష బయాప్సీ.
సాధారణ మూత్ర పరీక్ష చేసి మూత్రాశయంలో ఎక్కడైనా అసాధారణ కణాలున్నాయేమో తెలుసుకుంటుంటారు.
యూరిన్ టెస్టు చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ మూత్ర పరీక్ష ఒక్కటే చేసి బ్లాడర్ క్యాన్సర్ నిర్ధారణ చేయడం కంటే తదనంతర పరీక్షలు కూడా చేస్తే మంచిది.
మూత్ర పరీక్షలో కొంత మూత్రాన్ని సేకరించి క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మూత్రంలో విటమిన్- సి సప్లిమెంట్లు, రైబోఫ్లావిన్ మోతాదు, ఆంత్రాక్వినొన్ పాళ్ళు, మేతోకార్బామోల్ స్థాయి ఎలా ఉందొ తెలుసుకుంటారు. ఒకవేళ ఎక్కడైనా అసాధారణంగా ఎక్కడైనా అసాధారణ కణాలు ఉన్నట్లు అనిపిస్తే అది మూత్రాశయం లోపలి భాగంలో సమస్యా లేక మూత్రనాళంలో సమస్యా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.
దానికోసం మళ్ళీ సైటోస్కోపీ పరిక్ష నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో ఒక చిన్న గొట్టాన్ని మూత్రనాళం గుండా లోపలి పంపిస్తారు. ఈ గొట్టానికి చివర ఒక లైటు, కెమెరా అమర్చబడి ఉంటాయి. ఈ సన్నని గొట్టాన్ని మూత్రనాళం లోపలి పంపినప్పుడు లోపలి భాగాన్ని కెమెరా స్పష్టంగా చిత్రిస్తుంది. ఈ చిత్రాల ఆధారంగా మూత్రనాళంలో గాని మూత్రాశయంలో గాని ఎక్కడైనా అసాధారణ కణాలున్నాయేమో గుర్తిస్తారు. చివరిగా ఈ కణాలు క్యాన్సరుకు సంబంధించినవా కాదా తెలుసుకోవడానికి మాత్రం బయాప్సీ పరీక్ష చేయాల్సిందే.
బయాప్సీ అంటే ఒక ప్రత్యేకమైన సూదిని బ్లాడర్ ద్వారా మూత్రాశయం లోపలికి పంపించి కణాల్లో చిన్న భాగాన్ని తిసుకుని అవి బ్లాడర్ కాన్సరుకు సంబంధించిన కణాలా కాదా అన్నది తెలుసుకుంటారు.
బ్లాడర్ క్యాన్సర్ కారణాలు
మరి ఈ బ్లాడర్ క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి…?
కచ్చితంగా ఇదే కారణమని చెప్పలేము కానీ… చాలాకాలంగా చూస్తున్న క్యాన్సర్ కేసుల ఆధారంగా కొన్ని కారణాల వలన క్యాన్సర్ వచ్చే అవకాశముందని మాత్రం చెప్పవచ్చు.
మొదటిది ఇందాక చెప్పుకున్నట్లు ర్యాండమ్ జెనెటిక్ మ్యుటేషన్… అంటే కణాల్లోపల కణాల నిర్మాణంలో భాగమైన జన్యువుల్లో మార్పు అన్నమాట.
రెండోది కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వారికి కూడా క్యాన్సర్ ఉండే అవకాశాలు లేకపోలేదు. అయితే కుటుంబ చరిత్ర ఆధారంగా ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం 5 శాతం లోపే…
మూడోది… అస్తవ్యస్తమైన జీవన విధానం కూడా క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణమనే చెప్పాలి…
ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త పాటించకపోవడం…
నిల్వ ఆహారాలు తినడం, రంగులు పూసిన ఆహారం తినడం, పోషకాలు లేని జంక్ ఫుడ్, మాంసాహారం, ధూమపానం, మద్యపానం ఇలా అనేక కారణాలున్నాయి.
తక్కువ నీళ్ళు తీసుకోవడం, కాలుష్యం బారిన పడటం ఇతరత్రా కారణాల వలన కూడా బ్లాడర్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ముఖ్య గమనిక :
ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Also read: Mouth Cancer : నోటి క్యాన్సర్ లక్షణాలు, నిర్థారణ పరీక్షలు, చికిత్స