వ్యాధులను నయం చేయగలిగే లక్షణాలను కలిగిన అధ్బుతమైన భస్మాలు

You are currently viewing వ్యాధులను నయం చేయగలిగే లక్షణాలను కలిగిన అధ్బుతమైన భస్మాలు

వ్యాధులను నయం చేసే భస్మాల గురించి తెలుసుకునే ముందు భస్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. లోహాల భస్మీకరణం ద్వారా వచ్చిన బూడిదను “భస్మం” అంటారు. ఇది లోహాలు మరియు మూలికల సారాల యొక్క మిశ్రమంతో తయారు చేయబడుతుంది, లోహాన్ని ఆక్సీకరణం చేసినప్పుడు ఇంకా అధ్భుతంగా పనిచేస్తుంది. లోహం పూర్తిగా కాలిపోయిన తర్వాత, దాన్ని శుద్దికరిస్తారు. తరువాతి ప్రతిచర్య దశలో ఇతర మూలికా లేదా ఖనిజ పదార్ధాలను కలుపుతారు. 

భస్మాన్ని తయారుచేసే ప్రక్రియలో, లోహాన్ని ఆవు పేడతో పాటు ఒకే డబ్బాలో ఉంచుతారు. భస్మాలు బయోలాజికల్ నానోపార్టికల్స్ నుండి తయారవుతాయి. వీటిని తేనె, వెన్న, పాలు లేదా నెయ్యితో వినియోగిస్తుంటారు. ఇది వాటి అనుకూలతను మెరుగుపరిచి హానికరమైన ప్రభావాలను నివారిస్తుంది.

భస్మం యొక్క రకాలు:  

భస్మాలాని, వాటి యొక్క రూపం మరియు రంగును బట్టి వర్గీకరించారు. శాస్త్రీయంగా, వీటిని మూలికా, ఖనిజ మరియు లోహ భస్మాలుగా   వర్గీకరించారు. అవి:

  • లోహ భస్మం
  •  స్వర్ణ భస్మం
  •  రజత భస్మం
  • ప్రవాళ భస్మం 
  • తామ్ర భస్మం
  • గోదాంతి భస్మం
  •  హీరక్ భస్మం
  •  త్రివంగ భస్మం
  •  వారతిక భస్మం 
  • శంఖ భస్మం
  • వంగ భస్మం
  • మండూర్ భస్మం
  • తామ్ర భస్మం
  • జసద్ భస్మం
  • శుద్ధ భస్మం
  • టంకన్ భస్మం
  • ముక్త భస్మం 
  • శుక్తి భస్మం 
  • మాణిక్య భస్మం
  •  కపర్దిక భస్మం 
  • అభ్రక్  భస్మం.

స్వర్ణ భస్మం:

ప్రకృతి మనకి తాజా పండ్లు మరియు కూరగాయలకు మించి కొన్ని అద్భుతమైన బహుమతులను అందించింది. అవే ఖనిజాలు మరియు లోహాలు. ఇవి వ్యాధులను నయం చేయగల గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి. 

పురాతన కాలంలో, ఋషులు మరియు వైద్యులు ఆయుర్వేదం ద్వారా విలువైన లోహాలు, ఖనిజాలు మరియు మూలికలను ఉపయోగించి అద్భుతమైన సమ్మేళనాలు తయారుచేసేవారు. వీటిని శరీరంలోని వివిధ రుగ్మతలు మరియు సమస్యలకు చికిత్సను అందించడానికి  ఉపయోగించేవారు. వీటిలో ఒకటైన స్వర్ణ భస్మం వ్యాధులను నయం చేయడానికి గొప్పగా పనిచేస్తుంది. 

స్వచ్ఛమైన బంగారం నుండి స్వర్ణ భస్మాన్ని, సంప్రదాయమైన ఆయుర్వేద పద్దతులు మరియు భస్మీకరణ పద్దతి ద్వారా తయారు చేస్తారు. అలాగే ఈ పద్దతిలో ఇతర మూలికలను మరియు ముడిపదార్థాలను కూడా వినియోగిస్తారు. 

బంగారాన్ని ఔషధ రూపంలోకి మార్చే ప్రక్రియలో, వాటిలో ఉండే ప్రతికూల ప్రభావాన్ని తొలగిస్తారు. 

అనేక ఆయుర్వేద రసాయనాలలో స్వర్ణ భస్మం కీలక పాత్ర పోసిస్తుంది. ఎందుకంటే ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో పోషకాలు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది శరీరాన్ని సూర్యుని నుండి వెలువడే UV కిరణాల నుండి రక్షిస్తాయి.  

ఆయుర్వేదం ప్రకారం, ఇది నరాలను బలపరుస్తుంది, జ్ఞాపకశక్తి మరియు తెలివితేటలను మెరుగుపరుస్తుంది, చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది, మరియు అనేక వ్యాధులను నివారిస్తుంది. అంతేకాకుండ  కండరాల బలాన్ని పెంచుతుంది. ముఖ్యంగా  శారీరక మరియు మానసిక పనితీరును మెరుగుపరుస్తుంది.

రజత భస్మం:

ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే రజత భస్మం, అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వెండి భస్మీకరనలో నిర్దిష్ట మూలికలను, ముఖ్యంగా నిమ్మరసాన్ని వినియోగిస్తారు. తద్వారా ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన రజత భస్మంగా తయారవుతుంది. రజత భస్మం యొక్క  రుచి, తీపి మరియు పుల్లగా ఉంటుంది.

రజత భస్మం శరీరానికి బలాన్ని అందించడమే కాకుండా శుభ్రపరిచే గుణాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రశాంతమైన మనస్సును ప్రోత్సహిస్తుంది. దీని యొక్క చలువ చేసే గుణాలు శరీర  వ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం, వాత మరియు పిత్త దోషాలను కూడా సమతుల్యం చేస్తుంది.

తామ్ర భస్మం:

తామ్ర భస్మంలో ఉండే శక్తివంతమైన ఖనిజాల వల్ల ఇది అనేక రకాల వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. దీని అసాధారణ ప్రయోజనాల కారణంగా గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలు, చర్మ వ్యాధులు, ఆస్తమా మరియు గుండె జబ్బులతో సహా అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. అంతేకాకుండా ఇది చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును అందించడంలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. 

తామ్ర భస్మం యొక్క ప్రధాన భాగంలోని రాగి రేణువులు అలాగే కలబంద మరియు నిమ్మకాయల యొక్క మిశ్రమంతో సూక్ష్మంగా ప్రాసెస్ చేయబడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ప్రాముఖ్యంగా కఫా దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే పిత్త దోష సమస్యలను నయం చేస్తుంది. 

తామ్ర భస్మం అసిడీటీ సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా  ఇది శ్వాసనాళాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. మరియు దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 

అదనంగా, దీంట్లో ఉండే తేలికపాటి భేదిమందు ప్రభావం ప్రేగు యొక్క కదలికలను ప్రోత్సహిస్తుంది. తద్వారా మలబద్ధకం మరియు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనాన్ని అందిస్తుంది. 

తామ్ర భస్మం, శరీరంలోని మొత్తం లిపిడ్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకించి  కణితులు, క్యాన్సర్, కాలేయ సమస్యలు, రక్త హీనత , అధిక బరువు వంటి సమస్యలకు చికిత్స  చేయడానికి ఈ ఔషధంగా ఉపయోగిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. 

వజ్ర భస్మం:

వజ్ర భస్మం, దీన్నే హీరక్ భస్మ అని కూడా పిలుస్తారు. ఇది వజ్రం తో తయారుచేయబడిన ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధం. ఈ ప్రత్యేకమైన తయారీలో, రత్నం పొడిగా ప్రాసెస్ చేయబడుతుంది. సంస్కృతంలో వజ్రానికి విదుర, వజ్ర, స్వరిచక్ర మరియు తారకం వంటి వివిధ పేర్లు ఉన్నాయి. ఇది భూమిపై అత్యంత విలువైన రత్నం. 

కొన్ని అధ్యయనాల ప్రకారం, తెల్ల వజ్రాలు కొన్ని సమస్యల చికిత్సకు ఔషధంగా వినియోగిస్తుంటారు. ఎరుపు వజ్రాలు వివిధ వ్యాధులను నయం చేయడంలో మరియు అకాల మరణాన్ని నివారించడంలో సహాయపడతాయి. 

వజ్ర భస్మం యొక్క ప్రత్యేకమైన గుణాలు ధమనులను శుభ్రపరచడానికి మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

ముఖ్యంగా ఆంజినా పెక్టోరిస్ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే గుండె యొక్క పనితీరును ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. మరియు గుండె సంబందిత సమస్యలను నివారిస్తుంది. 

వాస్తవానికి వజ్ర భస్మం ఒక అద్బుతమైన టానిక్‌గా పనిచేస్తుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాన్ని అందిస్తుంది. అలాగే శరీరాన్ని బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వివిధ రుగ్మతలను తొలగించడంలో సహాయపడుతుంది. వజ్ర భస్మం అద్భుతమైన గుణాలు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

వంగ భస్మం:

ఆయుర్వేదంలో, వంగ భస్మం అనేది లోహం మరియు మూలికల మిశ్రమంతో తయారు చేయబడిన ఒక ప్రత్యేక ఔషధం. పురాతన కాలంలో, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి చికిత్స కొరకు వైద్యులు వివిధ లోహాలను ఉపయోగించేవారు. 

ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు హానికరమైన ఆసిడ్స్ ను  బ్యాలెన్స్ చేయడంలో వంగ భస్మం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదంలోని శక్తివంతమైన భస్మాలలో, వంగ భస్మం ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది మర్దానా మరియు మర్నా వంటి భస్మీకరణ పద్ధతులను ఉపయోగించి టిన్ మెటల్ నుండి తయారు చేయబడింది. 

మానసిక అలసట, పునరుత్పత్తి లోపాలు మరియు అడ్రినల్ అసమతుల్యత వంటి సమస్యలను చికిత్స చేయడంలో ఇది అధ్బుతంగా  ఉపయోగపడుతుంది. 

వంగ భస్మని సరిగ్గా సమీకరణం చేయడం చాలా ప్రాముక్యం. ఎందుకంటే దీని వల్ల విపరీతమైన దుష్ప్రభావాలను కలిగే అవకాశం ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా సమీకరించిన తరువాతే, ఔషధంగా ఉపయోగించడానికి అర్హత కలిగినది.  

ఆయుర్వేదంలో, ప్రకృతి నుండి సహజంగా వచ్చే పదార్థాలను ఉపయోగించి అధ్బుతమైన ఔషధాలను తయారుచేస్తారు. వీటిని వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సల కొరకు వీటిని ఉపయోగిస్తారు. వీటిని వినియోగంచే ముందు, నైపుణ్యం కలిగిన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.