మన దేశంలో ఎవరైనా చుట్టాలు ఇంటికి రాగానే వేడిగా చాయ్ తాగమని ఇస్తుంటాం..
మన అందరి ఉదయం ఒక కప్పు టీ తోనే మొదలవుతుంది. ఇలా టీ తాగడం అనేది తొంభై శాతం భారతీయుల ఇళ్ళలో ఒక సాధారణ అలవాటు.
కానీ మనం పాలు చక్కర మరియు టీ పొడి వేసి చేసుకునే తియ్యటి టీ వెనక మన హెల్త్ కి సంబంధించిన కొన్ని చేదు నిజాలు కూడా ఉన్నాయి.
ఈ ప్రపంచంలో మన దేశం మరియు చైనా దేశంలో మాత్రమే ఇలా పాలతో టీ చేసుకొని తాగడం అలవాటు, మిగతా దేశాలలో పాలను ఉపయోగించరు. అసలు మనకు ఈ పాలతో చేసిన టీ అలవాటు చేసింది కూడా విదేశీయులే. చాలా దేశాలలో కేవలం వేడి నీటితోనే టీ చేసుకుంటుంటారు.
మన టీ అనేది ఒక్క సారి అలవాటైతే వదలడం అంత సులభం కాదని మనందరికీ తెలుసు.
రోజుకు ఒకటో రెండో కప్పులైతే పరవాలేదు కానీ లెక్కలేకుండా టీ తాగడానికి బానిసైన వారు కూడా చాలామందే ఉన్నారు. ఇలా అధికంగా టీ తాగేవారిపై చైనా లో ఒక ఐదువేల మందితో ఒక పరిశోధన చేసారు. ఇక రిజల్ట్ గా టీ లో ఉండే కెఫిన్ వల్ల రోజులో ఎక్కువ సార్లు టీ తాగేవారిలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం, అందువల్ల మానసిక సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉందట. ఈ అలవాటు ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలకు కూడా దారితీస్తుందట. ఈ అధ్యాయనం బీజింగ్ లో జరిగింది.
ఇక అమెరికాలో జరిగిన మరో పరిశోధనలో ఒక టీ కప్పులో నలభై గ్రాముల కెఫిన్ ఉండటం వల్ల అది ప్రశాంతమైన నిద్రను డిస్టర్బ్ చేయటమే కాకుండా హార్ట్ ప్రాబ్లంస్ కూడా వచ్చే అవకాశం ఉందట. ఈ పరిశోధనను బ్రౌన్ యునివర్సిటీ లో చేసారు. ఇక మరో విషయం ఏంటంటే చల్లారిన టీ ని మళ్ళీ వేడి చేసుకుని తాగే వారికి, అలాగే ఉదయం లేవగానే పరగడుపున టీ అధికంగా తాగేవారికీ బ్లడ్ ప్రెజర్, అల్సర్ వంటి సమస్యల రిస్క్ పొంచి ఉందట. టీ ని ఎంత ఎక్కువసేపు మరిగిస్తే అంత ప్రమాదం అనమాట, అందుకనే ఐదు నిమిషాల కంటే ఎక్కువగా మరిగించకపోవడం మంచిది.
ఇక ఈ టీ అలవాటు మన దేశం లో ఎంత ఎక్కువగా ఉందంటే సుమారు గా ప్రతీ సంవత్సరం భారతదేశంలోని ప్రతీ వ్యక్తీ రెండు వందల యాభై ఒక్క టీ లు తాగుతున్నాడట. అంటే నెలకు ఇరవై ఒక్కటి. ఇది అప్రాక్సిమేట్ గా మన దేశ జనాభా అంతా కలిపి చేయబడ్డ ఒక అంచనా. ఇక మీరే అర్థంచేసుకోవచ్చు.. మనం ఎంత టీ ప్రియులమో!
మనలో కొందరికీ టీ ఎక్కువ తాగడం వల్ల మొటిమలు వస్తుంటాయి, అలాంటప్పుడు వారి శరీరానికి ఆ టీ లో వేసే పాలు సెట్ అవ్వకపోవచ్చు. దీనినే ల్యాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. అలాంటి వారు ఈ డైరీ ని దూరం పెడితే మంచిది. అలాగే ఇందులో మనం వేసుకునే రిఫైన్డ్ వైట్ షుగర్ కూడా అంత మంచిది కాదు. ఎంత తక్కువ వేసుకుంటే అంత తక్కువ హెల్త్ రిస్క్.
ఇక ఈ విడియో టీ తాగడం తప్పు అని చెప్పడానికి కాదు, టీ మితంగా తీసుకోండి అని చెప్పడానికి మాత్రమే చేస్తున్నాము. చల్లారిన టీ వేడి చేసుకొని తాగడం మానేయడం మంచిది. ఇంకా ఎక్కువసేపు మరిగించిన టీ మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే పరగడుపునే టీ తాగడం, నిద్ర పోవడానికి ముందు టీ త్రాగడం మానేయండి. మీ ఆరోగ్యాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండండి.
ఈ చిన్న చిన్న టిప్స్ ని మైండ్ ఉంచుకొని మితంగా రోజుకు ఒక కప్ టీ ని హ్యాపీ గా తాగండి. ఏదైనా మితి మీరితే వ్యసనం, వ్యసనమైతే ప్రమాదం. ఈ విషయం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: ఈ కాంక్రీట్ అడవిలో మనం పీల్చే కాలుష్యపు గాలిని నేచర్ క్యూర్ ఎలా చేస్తుంది?