మన తాతలు ముత్తాతలు మట్టిలో నే ఆడుకునే వాళ్ళు, మట్టిలో నడుస్తూనే వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతికే వాళ్ళు .ఈ జెనరేషన్ లో మనకు మట్టి అంటే అదేదో చెడ్డ విషయంలా చూడటం అలవాటైంది, మట్టిలో ఆడుకునే వాళ్ళను డర్టీ అనే స్థాయికి మన నాగరికత దిగజారింది.
మన ప్రపంచమంతా సూక్ష్మ జీవులతో నిండి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మన ఆరోగ్యానికి మన గట్ మైక్రో బయోమ్ ఎలా సహాయపడుతుందో, మన మట్టికి కూడా ఒక మైక్రో బయోమ్ ఉంది. ఆ మట్టికి ఉన్న మైక్రో బయోమ్ అనే సూక్ష్మ జీవుల సమూహం మొక్కలను కాపాడుతూ, తనను తానూ రక్షించుకుంటుంది. ఆ మట్టిని ఇప్పుడు డర్టీ అంటున్నాం, కానీ మన శరీరం లో ఉండే గట్ బ్యాక్టీరియా కి మరియు మట్టిలో ఉండే బ్యాక్టీరియా కి మధ్యలో సంబంధం ఉందని మీలో చాలా వరకు తెలిసి ఉండదు.
ప్రకృతి మనకు ఇచ్చింది ఏది చెడ్డది కాదు. పిల్లలు మట్టిలో ఆడుకోవడమే మంచిది, ఎందుకంటే అప్పుడే వాళ్ళు మట్టిలోని వివిధ సూక్ష్మ జీవులకు ఎక్స్పోజ్ అవుతారు, అలా అయినప్పుడే వారి శరీరాలలో ఆ చెడు మైక్రో ఆర్గానిజమ్స్ ను తట్టుకునే ఇమ్మ్యూనిటి పెరుగుతుంది అలాగే వాళ్ళ గట్ లో బ్యాక్టీరియా వైవిధ్యం కూడా పెరుగుతుంది. మనలో ఉండే బ్యాక్టీరియా మరియు మట్టిలో ఉండే బ్యాక్టీరియా కొంతవరకు ఒకే రకానికి చెందినది ఉదాహరణకు ఫేర్మిక్యూట్స్, యాక్టినో బ్యాక్టీరియా, బ్యాక్తీరియోడేట్స్ అనేవి మనలో మరియు మట్టిలో ముఖ్యమైన బ్యాక్టీరియా రకాలు. మనం మట్టిలో నడవడం వల్ల కూడా మన గట్ బ్యాక్టీరియా వైవిధ్యం పెరుగుతుంది. ప్రకృతి మనకు అన్నిటికంటే పెద్ద ప్రోబయోటిక్ సప్లిమెంట్. ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరి వేలు ముద్ర వేరుగా ఉన్నట్టు ప్రతీ మనిషి గట్ మైక్రోబయోం కూడా వేరుగా ఉంటుంది. అది వారు పుట్టిన పరిస్థితులు, వారు పెరిగిన వాతావరణం, వారు తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.
అసలు మట్టిలో ఉండే బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అనటానికి ఒక చిన్న ఉదాహరణ చూస్తే గనక 2004 లో లండన్ లో ఒక డాక్టర్ తన లంగ్ క్యాన్సర్ పేషెంట్లకు, మట్టిలో ఉండే మైకోబ్యాక్తీరియం వ్యాకే అనే ఒక బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసారు, ఫలితంగా ఆ వ్యక్తి ఇమ్యూనిటీ పెరిగి క్వాలిటీ లైఫ్ పొందారని ఆ డాక్టర్ తమ రీసర్చ్ పేపర్ లో రాసారు. ఈ మట్టిలో ఉండే బ్యాసిల్లాస్ కోవాగులస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల డయేరియా మరియు మలబద్దకం వంటి గట్ సమస్యలు తగ్గుతాయని తొమ్మిది క్లినికల్ ట్రయల్స్ నిరూపించాయి. దీనితో పాటే మట్టిలో ఉండే ఎన్నో బ్యాసిల్లాస్ రకానికి చెందిన ప్రోబయోటిక్ బ్యాక్టీరియా వల్ల గట్ మైక్రోబయోం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా లీకీ గట్, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు తగ్గడానికి అవకాశం ఉందని ఎన్నో పరిశోధనలు చెబుతూ ఉన్నాయి.
ఇప్పుడు మనం మట్టి నుండి ప్రోబయోటిక్స్ వస్తున్నాయని మాట్లాడుతున్నాం కదా..మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు! ఆ మట్టి నుండి ఫ్రీ గా వచ్చే ప్రోబయోటిక్స్ ని కూడా సాయిల్ బేస్డ్ ప్రోబయోటిక్స్ అని మార్కెట్ లో అమ్ముతున్నారు. మళ్ళీ వీటిని మన గట్ మైక్రో బయోం వైవిధ్యం పెంచడానికి, మన ఇమ్మ్యునిటీ పెంచడానికి ఎంతగానో సహాయపడతాయని చెప్పి మరీ సేల్ చేస్తున్నారు. మనం మట్టిలో నడిస్తే ఫ్రీగా వచ్చే బెనిఫిట్స్ ని కూడా కొనుక్కునే రోజులు వచ్చేసాయ్. మనిషి ప్రకృతికి దగ్గరగా ఉన్నంత వరకు ఇమ్మ్యునిటీ పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడైతే ఈ కాంక్రీట్ గోడల మధ్యలో కృత్రిమమైన వెస్టర్న్ జీవన విధానానికి అలవాటు పడ్డామో సమస్యలు అక్కడే మొదలయ్యాయి.
మనం ఈ మాడర్న్ జెనరేషన్ లో, చేతికి అంటిన మట్టిని కడుక్కోవడానికి కెమికల్స్ ఉన్న హ్యాండ్ వాష్ ఉపయోగిస్తున్నాం. ప్రతీ విషయంలోనూ మన శరీరం పైన కానీ లోపలికి కానీ ఎలాంటి మైక్రోబ్స్ రాని విధంగా మనం కెమికల్స్ పైన ఆధారపడి ఉన్నాం. ఈ న్యాచురల్ గట్ మైక్రోబయోం మన లోకి వెళ్ళడానికి మనం కనీసం న్యాచురల్ కూరగాయలను పండ్లను తింటున్నామా అంటే అదీ లేదు. అన్ని కెమికల్స్ మయమే ! ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి సేంద్రియ వ్యవసాయం వైపు, ఆర్గానిక్ ఫుడ్స్ వైపు అలాగే న్యాచురల్ లైఫ్ స్టైల్ వైపు మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు మన గట్ బ్యాక్టీరియా ట్రెండ్ మొదలయ్యాక ఈ గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్ మరియు ప్రీబయోటిక్ ఫుడ్ నుండి వస్తుంది అని తెలిసాక కూడా, చాలా మంది మంచి ఫైబర్ ఉన్న పండ్లు తిందాం, ప్రీబయోటిక్ అందుతుంది అని ఆలోచించట్లేదు. అలాగే ఇంట్లో పెరుగు చేసుకొని, పెరుగన్నం తిందాం ప్రోబయోటిక్ అందుతుంది అని కూడా అనుకోవట్లేదు. ఈ రెండు కాదని ఆన్లైన్ లో ప్రీబయోటిక్ సప్లిమెంట్ కొనేసి మళ్ళీ అవే కిమికల్స్ ను తింటున్నారు. ఇక సూపర్ మార్కెట్ కి వెళ్లి ఫ్రిజ్ లో ప్రీబయోటిక్ డ్రింక్స్ తెచ్చుకుంటున్నారు. అక్కడ ఆ డ్రింక్స్ లో ఉన్న పాలు ప్యాస్చారైజ్ చేసారని, అల చేసే ప్రాసెస్ లో ఆ ప్రీబయోటిక్స్ చనిపోతాయని కూడా వాళ్లకు అవగాహన ఉండి ఉండదు. ఇలా మనకు న్యాచురల్ గా దొరికే వాటిని పక్కన పెట్టి మరీ మనం ఈ కెమికల్స్ లో మునిగి తెలుతున్నాం.
మన గట్ హెల్త్ కోసం ప్రకృతి మనకు కావలసినన్ని ఆహారాలను ఇచ్చింది. మంచి కూరగాయలు, పండ్లు చాలు మన గట్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంచేస్తాయి, మంచి పెరుగన్నం చాలు మన గట్ బ్యాక్టీరియా వైవిధ్యాన్ని పెంచుతుంది, మట్టిలో కాసేపు నడక చాలు మన గట్ మైక్రో బయోమ్ వైవిధ్యంగా ఆరోగ్యంగా ఉంటూ మనకు ఇమ్యునిటీ పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: ఆయుర్వేదం : ది మదర్ ఆఫ్ బయో హ్యాకింగ్