రసాయన ఆయుర్వేదం క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించగలదా?

You are currently viewing రసాయన ఆయుర్వేదం క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించగలదా?

నిర్దిష్టమైన చికిత్సా విధానాన్ని అనుసరిస్తే క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందనే వైద్యులు చెప్తారు. కానీ అంతటి కచ్చితమైన వైద్యం ఏమిటని ఎంచుకునే విషయంలో మాత్రం అందరూ పొరపాట్లు చేస్తూ ఉంటారు. రసాయన ఆయుర్వేదంలో ఔషధాలు కేవలం వ్యాధిని తగ్గించడం మాత్రమే కాదు అది పునరావృతం కాకుండా కూడా చేయగలదు. మరే ఇతర వైద్యవిధానాల్లో చూసినా వ్యాధి పునరావృతం కావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ కణాల స్వభావమే అది. ఒక చోట తగ్గినట్టే తగ్గుతుంటాయి. కానీ మరొక చోట ఉద్భవిస్తూ ఉంటాయి. ఎప్పట్లాగే మళ్ళీ అక్కడ కూడా తమ సంఖ్యను పెంచుకుంటూ పోయి మళ్ళీ గడ్డలుగా ఏర్పడుతుంటాయి.

కానీ రసాయన ఆయుర్వేదంలో ఔషధం ప్రధానంగా మూలకణాల మీద పనిచేస్తుంది కాబట్టి మొదటగా అక్కడున్న క్యాన్సర్ కణాలను నిర్జీవం చేసి వాటిని మరో చోటకు వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తుంది. ఒకసారి ఈ కణాలు వ్యాప్తి చెందడం ఆగిపోయిన తర్వాత ఒక్కొక్క క్యాన్సర్ కణాన్ని శక్తివంతమైన ఔషధాల సాయంతో నాశనం చేస్తూ రసాయన ఆయుర్వేదం క్యాన్సర్‌ని సమూలంగా నిర్మూలిస్తుంది

సహజంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే అత్యధిక చికిత్సా విధానాల్లో కొనసాగింపు ధోరణే కనిపిస్తూ ఉంటుంది. చికిత్సలో భాగంగా క్యాన్సర్ గడ్డను పాక్షికంగా తొలగించి, మిగిలిన క్యాన్సర్ కణాలను తొలగించేందుకు మరో రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం… ఆ తర్వాత కూడా ఇంకా క్యాన్సర్ కణాలు మిగిలిపోయాయని వేరేదో ట్రీట్మెంట్… ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరు చెబితేనే పేషెంట్లు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ రసాయన ఆయుర్వేదంలో అలా కాకుండా రామబాణంలా నేరుగా లక్ష్యాన్ని చేదించి క్యాన్సర్‌ పునరావృతం కాకుండా చేస్తుంది.

Also read: అన్ని వయసుల వారికీ ఈ రసాయన ఆయుర్వేద చికిత్స పనిచేస్తుందా?