అర్బుదరాశుల చికిత్స గురించి ఎన్నో ఏళ్ల క్రితమే చరక, సుశ్రుత, వాగ్భటుడు వంటి మహర్షులు వేదగ్రందాల్లో పొందుపరిచారు. గండమాలలు, అర్బుదాలు లేదా రాచపుండ్లుగా వీటిని వర్ణిస్తూ చరక సంహిత, సుశ్రుత సంహిత, వైద్య రత్నావళి వంటి అనేక శాస్త్రాల్లో అర్బుదనాశని అని చెబుతూ మరెన్నో మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రయోగించి ఆనాటి రసవైద్యులు అర్బుదరాశులను హరించే ప్రయత్నం చేసేవారు. అష్టాంగయోగాలలో ఈ రసాయన ఆయుర్వేద వైద్యం ప్రత్యేకించి క్యాన్సర్లను తొలగించడంలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తూ ఉంటుంది.
శరీరంలో వ్యాధులు ప్రబలకుండా ఉంచడమే ఆయుర్వేదం ప్రధాన ఉద్దేశ్యం. రోగనిరోధక శక్తి దెబ్బతినకుండా చూసుకుంటే చాలు వ్యాధులు ప్రబలే అవకాశమే లేదు. అంతకంటే ముందు శరీరంలో ఇమ్యునిటీ ఏ స్థాయిలో ఉందనేది ఓజస్సు ద్వారానే బయలు పరచబడుతుంది. ఆరోగ్యకరమైన ఓజస్సు బలమైన వ్యాధినిరోధకశక్తిని సూచిస్తుంది.
వ్యాధినిరోధక శక్తి దెబ్బతిన్న కణాలను వేరే అవయవానికి వ్యాప్తి చెందకుండా అడ్డుకుని వాటిని పునర్నిర్మిస్తూనే మరోపక్క కొత్త క్యాన్సర్ కణాలు పుట్టకుండా చేస్తుంది. ఇక వెలుపల నుండి శరీరానికి అందించే రసౌషధాలు శరీరంలో ప్రతి ఒక్క కణంలో కొత్త జీవాన్ని నింపుతుంది. దీంతో శరీర ఓజస్సు నిలకడగా ఉంటుంది. దెబ్బతిన్న జీవక్రియ కొత్తగా మొదలై రోగనిరోధక శక్తి కూడా స్థిరంగా ఉంటుంది.
Also Read: కీమోతేరపీతో పాటూ ఈ రసాయన ఆయుర్వేద చికిత్స తీసుకొని క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళెవరైనా ఉన్నారా?