రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ చికిత్స సమయంలో ప్రత్యేకమైన డైట్ ఉంటుందా?

You are currently viewing రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ చికిత్స సమయంలో ప్రత్యేకమైన డైట్ ఉంటుందా?

క్యాన్సర్ ట్రీట్మెంట్లో రసాయన ఆయుర్వేదాన్ని ఆశ్రయించినప్పుడు నిర్దిష్టమైన ఆహార నియమాలంటూ ఏమీ లేవు. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చు. కానీ క్యాన్సర్ కారకాలను ప్రేరేపించే ఆహారానికి.. అంటే జంక్ ఫుడ్, రెడ్ మీట్, నిల్వ ఆహారాలు, కూల్ డ్రింక్స్, మైదా పదార్ధాల వంటి విషతుల్యమైన ఆహారానికి మాత్రం వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు ఎటువంటి కార్సినోజెన్ ప్రేరేపిత ఆహారం జోలికి పోకుండా ఉంటే మంచిది. రసాయన ఆయుర్వేదం ఒకపక్క క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంటే ఈ కార్సినోజెన్ ప్రేరకాలు క్యాన్సర్ కణాలకు మళ్ళీ శక్తినిస్తూ ఉంటాయి.

కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నంత సేపు క్యాన్సర్లపై పోరాడే తత్వమున్న ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటేనే మంచిది. వైద్యంతో పాటు ఆహార వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే ఔషధానికి అవి ఊతంగా నిలుస్తూ ఉంటాయి. కడుపుకు చాలినంత ఆహారం… కంటికి చాలినంత నిద్ర… క్యాన్సర్ కణాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటాయి. వ్యాయామం, ప్రాణాయామం కూడా చేస్తూ, ఆహార జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ నుండి మరింత తొందరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

Also read: ఈ క్యాన్సర్ ను ఎన్నో కొత్త టెక్నాలజీలు ఏమీ చేయలేకపోతున్నాయి కదా, ఈ రసాయన ఆయుర్వేదం ఎలా తగ్గించగలుగుతుంది?