శరీరాన్ని డీటాక్స్ చేసే 5 ఆయుర్వేద మూలికలు

You are currently viewing శరీరాన్ని డీటాక్స్ చేసే 5 ఆయుర్వేద మూలికలు

ఆయుర్వేదం, ఈ సంపూర్ణ వైద్య వ్యవస్థ మన దేశంలో చాలా కాలంగా ఉంది. ఆయుర్వేదం అనేది మన పూర్వీకులు ఆచరించిన సహజ నివారణల నుండి ఉద్భవించింది. ఆయుర్వేద ఔషధాల యొక్క ప్రయోజనాలపై చాలా మందికి సందేహాలు ఉన్నప్పటికీ, రోగాల నుండి మన శరీరాన్ని సులభంగా ఎదుర్కోవటానికి ఆయుర్వేదం సహాయపడుతుందని చాలామందికి తెలియదు.. ఆయుర్వేదం అనేది ఫార్మాసిటికల్ ఔషధాలకి  భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదం మన శరీరానికి అవసరమైన వనరులను అందిస్తుంది.

ఆయుర్వేదం ద్వారా డీటాక్సీఫికేషన్ యొక్క ప్రాముఖ్యత:

ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం, మన శరీరం సహజంగా విష పదార్థాలను మరియు వ్యాధులను తొలగించుకోలేదు. ఎందుకంటే ఈ వ్యర్థ పదార్థాలు అపరిశుభ్రంగా ఉండి బ్లాకేజ్ కు కారణమవుతాయి. అందువలన మన శరీరం నుండి విషపదార్థాలను తొలగించడానికి డీటాక్సీఫికేషన్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరియు మన సాధారణ కార్యకలాపాలను కొనసాగించడాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి సహాయపడే ఆయుర్వేద మూలికల ఆధారంగా వివిధ ఆయుర్వేద డీటాక్సీఫికేషన్ పద్ధతులు ఉన్నాయి. 

ఆయుర్వేదం ప్రకారం, డీటాక్సీఫికేషన్ కి ఉపయోగపడే మూలికలు:

పసుపు: 

Tumeric

పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది నిజంగా ఒక సూపర్ ఫుడ్ అని   అధ్యయనాలు చెబుతున్నాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉత్తమమైన ఆయుర్వేద మూలికలలో ఇది ఒకటి.

ఆహారంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా ఆహారాన్ని రుచికరంగా మార్చడం ద్వారా శరీరాన్ని బలపరుస్తుందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. పసుపు మంచి నిద్రకు ఉపకరిస్తుంది. కొన్ని అధ్యయనాలు ప్రకారం, ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు పొడిని వేసుకుని తాగడం వల్ల శరీరాన్ని డీటాక్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది లివర్ డీటాక్సీఫికేషన్ కి చక్కగా ఉపయోగపడుతుంది. 

అల్లం:

Ginger

అల్లంలో విటమిన్ B6 మరియు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి  ఇదే ప్రధాన కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అల్లం యొక్క మరికొన్ని ప్రయోజనం ఏమిటంటే, ఇది బరువుని  నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని లిపిడ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా బరువు యొక్క  హెచ్చుతగ్గులను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అల్లం శరీరం యొక్క మెటబాలిజంను ప్రాథమిక స్థాయిలో మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.   

అల్లం డీటాక్స్ టీ తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు: 

1/2 అంగుళం అల్లం ముక్క

1 కప్పునర నీళ్ళు 

1/2 టీస్పూన్ తేనే

1/4 సొంపు గింజలు

1/4 వాము గింజలు 

నిమ్మకాయ ముక్కలు.

అల్లం డీటాక్స్ టీ తయారుచేసుకునే విధానం:

ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్ళు పోసి, అల్లం తురుముని వేయాలి. ఆ తరువాత సొంపు మరియు వాము గింజలను వేసి మరిగించాలి.  తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి. ఈ వడకట్టిన నీటిలో తేనె మరియు నిమ్మకాయ ముక్కలను కలుపుకుని త్రాగాలి. 

మంజిష్ట: 

Manjistha roots stem

ఆయుర్వేదం ప్రకారం, మంజిష్ట రక్త శుద్దీకరణకు ఉత్తమమైన మూలికలలో ఒకటిగా వర్ణించబడింది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది, అలాగే ఇది డీటాక్సీఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మంజిష్ట రక్తంలో నుండి హానికరమైన విషపదార్థాలను తొలగించడానికి మరియు రక్తంలోని విషపూరిత పదార్థాల వల్ల కలిగే అనేక వ్యాధులు మరియు రుగ్మతలను నివారించడానికి సహాయపడుతుంది.

మంజిష్ట పొడి, మాత్రలు లేదా ఎండిన వేర్ల రూపంలో లభిస్తుంది. కాకపోతే ఇది శక్తివంతమైన ఆయుర్వేద మూలిక కాబట్టి, మీరు దీనిని వినియోగించే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిడం మరచిపోవద్దు. ఈ మూలిక యొక్క మోతాదు వయస్సు, ఆరోగ్య పరిస్థితి మరియు ఆయుర్వేద నిపుణుడు మాత్రమే అంచనా వేయగల ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కుట్కీ:  

Kutki titks lul kutki

కాలేయాన్ని శుభ్రపరచడానికి మరియు ఆరోగ్యంగా ఉంచడానికి అత్యంత ఉపయోగకరమైన మూలికలలో కుట్కీ ఒకటి. ఆయుర్వేద డీటాక్సిఫికేషన్ లో ఉపయోగించే అనేక ఫార్ములాలో కుట్కీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అనేక మూలికల లాగానే, ఇది కూడా చాలా చేదు రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. 

  • ఆయుర్వేదం ప్రకారం కుట్కీ పిత్త అసమతుల్యతను, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. 
  • అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 
  • అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. 
  •  ముఖ్యంగా అలెర్జీలను నివారిస్తుంది. దాంతోపాటు జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది. 

డీటాక్సీఫికేషన్ కొరకు కుట్కీ యొక్క వేర్ల పొడిని రోజుకి 2 నుండి 3 గ్రాముల చొప్పున రెండు సార్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాకపోతే దీన్ని వినియోగించేముందు, మీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా వైద్యుడి సలహాలు తీసుకుకోవడం మరచిపోవద్దు.   

గుడూచి:

Guduchi tinospora cordifolia

గుడూచి, ఆయుర్వేద వైద్యంలో అత్యంత ప్రాముఖ్యమైన మూలిక. దీని అనేక ప్రయోజనకరమైన లక్షణాల కారణంగా  గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. గుడూచిని “అమృత” అని కూడా పిలుస్తుంటారు.  ఈ మూలిక శరీరాన్ని పునరుజ్జీవింపజేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల విస్తృతంగా వినియోగించబడుతుంది. ఆయుర్వేదం ప్రకారం గుడూచి, రక్తం మరియు కాలేయాన్ని శుభ్రపరిచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. మరియు ఇది ఆరోగ్యా శ్రేయస్సు ను ప్రోత్సహించడంలో శక్తివంతమైన ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఇది అన్ని రకాల దోషాలను సమతుల్యం చేస్తుంది. దీంట్లో ఉండే డీటాక్స్ లక్షణాలు అనేక రకాల వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

గుడూచి యొక్క ప్రయోజనాలు: 

  • గుడూచి పిత్త సమస్యలను నివారిస్తుంది. 
  • అలాగే కాలేయం మరియు రక్తాన్ని డీటాక్స్ చేస్తుంది. 
  • మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
  • దాంతోపాటు బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. 
  • ముఖ్యంగా తామర, సోరియాసిస్, మొటిమలు మరియు దద్దుర్లు వంటి సమస్యలను నివారిస్తుంది.
  • గుడూచి అలెర్జీల లక్షణాలను తగ్గిస్తుంది.  

లివర్ డీటాక్స్ కొరకు గుడూచిని ఉపయోగించే విధానం: 

1/2 కప్పు గోరువెచ్చని నీటిలో 1/4 టీస్పూన్ గుడూచి, చిటికెడు పసుపు వేసి కలపాలి. దీన్ని భోజనానికి ముందు ప్రతిరోజూ 3 సార్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

మన శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడం చాలా కీలకం. ఎందుకంటే మన శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల అనేక రకమైన జబ్బులు సంభవిస్తాయి. తద్వారా ఈ మూలికలను ఉపయోగించి డీటాక్స్ చేసుకోవడం అవసరం. కాకపోతే వీటిని మీ దినచర్యలో చేర్చుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మరచిపోవద్దు.