ఆయుర్వేదం ప్రకారం, మనల్ని ఆరోగ్యంగా ఉంచే 7 సూపర్‌ఫుడ్స్..

You are currently viewing ఆయుర్వేదం ప్రకారం, మనల్ని ఆరోగ్యంగా ఉంచే  7 సూపర్‌ఫుడ్స్..

మన ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైనది మన ఆహరం. మీకు తెలుసా..! ఆయుర్వేదం ప్రకారం సరైన ఆహారాన్ని ఎంచుకుని వాటిని సరైన మార్గంలో తినడం ద్వారా మనం శారీరికంగా మరియు మానసికంగా  ఆరోగ్యంగా ఉండవచ్చు..ఇలా సరైన ఆహారం సరైన సమయానికి తీసుకోవడం వల్ల, ఇది మన శారీరిక మరియు మానసిక అనారోగ్యాలను నిరోధిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆయుర్వేద ప్రకారం, ముఖ్యమైన సూపర్‌ఫుడ్స్ గురించి  తెలుసుకుందాం.. 

ఈ ఆహరాలు మెండుగా పోషక విలువలు కలిగినవి. అంతేకాకుండా వీటిని మన దినచర్యలో చేర్చకోవడం ద్వారా ఆయుర్వేదం ప్రకారం, బోలెడు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 

నెయ్యి: 

ghee

  • నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ ఆసిడ్స్, మన శరీరంలో గట్ హెల్త్ కి దోహదపడే హెల్తీ బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి.
  • అలాగే నెయ్యి సహజంగా మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా నెయ్యి తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
  • మరియు దీనిని తినడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. తద్వారా యవ్వనంగా కనపడడానికి సహాయపడుతుంది.
  • మరియు నెయ్యిలో విటమిన్  ఏ అధికంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, జీర్ణశక్తిని పెంచడానికి నెయ్యి చక్కగా ఉపయోగపడుతుంది.
  • జుట్టు పెరుగుదలకి కూడా నెయ్యి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే నెయ్యిలో ఉండే ఒమేగా 3,9 మరియు ఫ్యాటీ యాసిడ్స్ అలాగే విటమిన్ A మరియు D వలన స్కాల్ప్ లో సెల్ డెవలప్మెంట్ జరుగుతుంది.
  • ముఖ్యంగా  స్కాల్ప్ లో రక్త  ప్రసారన జరిగి జుట్టు రాలడం తగ్గుతుంది అదే విధంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
  • కాకపోతే రోజుకి ఒక టీస్పూన్ నెయ్యిని తీసుకోవాడం సూరక్షితమేనని నిపుణులు సూచిస్తున్నారు.  

అంజూరపు పండ్లు:

fig fruit

 

  • అంజూరపు పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఫైబర్, కాల్షియం మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరమైనవి. 
  • అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి దీర్ఘకాలీక వ్యాధులను మరియు గుండె సంబందిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.  
  • ఆయుర్వేదం ప్రకారం ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయని భావిస్తారు. 
  • అంజూరపు పండలో ఉండే ప్రీ బయోటిక్స్ , ప్రేగులో ఉండే ప్రోబయోటిక్స్ కి ఉపయోగకరమైనది. తద్వారా IBS (irritable bowel syndrome) తో బాదపడేవారికి ప్రయోజనకరంగా ఉంటాయి.    
  • ముఖ్యంగా ఇవి రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. 
  • అంజూరపు పండ్లు బరువును కంట్రోల్ లో ఉంచడంలో  తోడ్పడవచ్చు.
  • దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఇన్ఫ్లమేషన్ తో బాధపడేవారికి, ఇవి చక్కగా సహాయపడతాయి.

పెసర్లు:

 

 

  • పెసళ్ళు కూరలలో, సలాడ్‌లలో మరియు సూప్‌లలో ఉపయోగిస్తుంటారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి.
  • ఇవి జీర్ణక్రియకు మరియు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో  గొప్పగా పనిచేస్తాయి. 
  • ఆయుర్వేదం ప్రకారం, ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. 
  • మరియు వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది.  
  • పెసళ్ళలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మనం తిన్న తర్వాత మన శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. 
  • మొలకెత్తిన పెసళ్ళు తినడం వల్ల  మన శరీరంలో రక్తాన్ని మెరుగ్గా కదిలేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు కంట్రోల్ లో ఉంచడానికి  సహాయపడతాయి. 
  • ముఖ్యంగా ఈ పెసళ్ళు హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే  జింక్ మరియు యాంటీఆక్సిడెంట్ల వల్ల మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

పసుపు:

turmeric powder

  • పసుపుని దశాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వినియోగిస్తున్నారు. 
  • పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోపర్టీస్ ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం పసుపు జీర్ణక్రియకి తోడ్పడుతుంది. అలాగే రోగ నిరోదక శక్తిని మెరుగుపరుస్తుంది.
  • ముఖ్యంగా చర్మ రక్షణకి పసుపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 
  • క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా క్యాన్సర్ చికిత్సకు కూడా ఉపయోగించబడుతుంది. 
  • ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ వంటి అనేక అనారోగ్యాలను కలిగిస్తుంది, కానీ పసుపు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఉసిరి:

Amla - usiri

 

  • ఉసిరిలో చాలా తక్కువ కేలరీలు మరియు కొవ్వు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫైబర్, కాపర్, మాంగనీస్, పొటాషియం మరియు విటమిన్లు సి, బి5 మరియు బి6  పుష్కలంగా ఉంటాయి. 
  • ఉసిరి ఫైబర్ అధికంగా ఉండే పండు. ఫైబర్ మన శరీరం ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండటానికి సహాయపడే సామర్థ్యం కలిగినది. ఇది అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది. 
  • మరియు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది 
  • అంతేకాకుండా మధుమేహం మరియు క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధులను నివారిస్తుంది.
  • ముఖ్యంగా ఉసిరిలో సిట్రిక్ యాసిడ్, ఫినాల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అల్జీమర్స్ వ్యాధి మరియు స్ట్రోక్ వంటి వయస్సు-సంబంధిత మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు.

అరటిపండు:

banana

  • అరటిపండ్లు కేవలం ఒక ప్రాథమిక పండు మాత్రమే అని మీరు అనుకోవచ్చు, కానీ అరటిపండ్లను నిజానికి ఆయుర్వేదంలో సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు, ఎందుకంటే వాటిలో ఫైబర్, పొటాషియం మరియు విటమిన్లు B6 మరియు C పుష్కలంగా ఉన్నాయి. 
  • ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. 
  • అలాగే  మంచి నిద్రకి ఉపకరిస్తాయి. తద్వారా ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.  
  • రోగనిరోధక వ్యవస్థ నుండి నరాల మరియు కండరాల పనితీరు వరకు ప్రతిదానికీ ఇవి ఉపయోగపడతాయి. 
  • జీర్ణసమస్యలు మరియు మలబద్ధకంతో బాధపడే వారికి అరటిపండ్లు చక్కగా సహయపడతాయి. ఎందుకంటే వీటిలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. 
  • నీరసంగా అనిపించినప్పుడు అరటిపండుని తినడం ద్వారా తక్షిణ మరియు స్థిరమైన ఎనర్జీని అందిస్తుంది. కేవలం రెండు అరటిపండ్లు 90 నిమిషాలకు సరిపడా శక్తిని అందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్వినోవా:

quinoa

 

  • పాశ్చాత్య ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న సూపర్ ఫుడ్ క్వినోవా. క్వినోవాలో ప్రోటీన్ ఫైబర్ మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. 
  • ఆయుర్వేద ప్రకారం క్వినోవాలోని ఇనుము మరియు మెగ్నీషియం మూడు దోషాలను సమతుల్యం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
  • అంతేకాకుండా బియ్యం మరియు గోధుమ వంటి సాంప్రదాయ ధాన్యాలకు గొప్ప ఇది గొప్ప ప్రత్యామ్నాయం. 
  • బరువు తగ్గడానికి కినోవా ఉప్మా చక్కగా ఉపయోగపడుతుంది. 
  • ఎందుకంటే కినోవాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ను మరియు హెల్తీ ఫ్యాట్ ను కలిగి ఉంటుంది. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. మెరుగైన జీవక్రియ బరువు తగ్గటంలో కీలక పాత్రను పోషిస్తుంది.

ఈ అద్భుతమైన ఆయుర్వేద సూపర్‌ఫుడ్స్ ఖచ్చితంగా  వీలైనంత త్వరగా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆధునిక కాలంలో పెరుగుతున్న అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి పొందడంలో ఇవి నిజంగా సహాయపడగలదు. ఈ ఆహారాలను మీ డైట్ ప్లాన్‌లో చేర్చుకోండి మరియు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండడి.  

Also Read: క్యాన్సర్ ను నివారించే క్రుసిఫరస్ కూరగాయలు

Https://Www.Health.Com/Health-Benefits-Of-Figs-7571179#

Https://Bebodywise.Com/Blog/Benefits-Of-Moong-Dal/#:~:Text=Moong%20dal%20contains%20nutrients%20a 

Https://Www.Youtube.Com/Watch?V=RhP3-3g6IbA 

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.