అశ్వగంధ గురించి మీరు వినే ఉంటారు. ఇది ప్రధానంగా ఆయుర్వేదంలో ఉపయోగించబడుతుంది.
అశ్వగంధను “ఆయుర్వేదానికి రాజు” అని పిలుస్తారు. అశ్వగంధ శాస్త్రీయ నామం వితనియా సోమ్నిఫెరా. ఈ మొక్కను వివిధ రకాల ఔషధాలలో ఉపయోగిస్తారు. దీనిని తెలుగులో పెన్నేరుగడ్డ, పన్నీరు, పులివేంద్రం, వాజిగాంధీ అని పిలుస్తారు. కోల్పోయిన జ్ఞాపకశక్తిని కూడా తిరిగి పొందే అవకాశాన్ని అశ్వగంధ ఇవ్వగలదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అశ్వగంధ, ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పాలి. ఇది అనేక రకాల శారీరక మరియు మానసిక రుగ్మతలను తగ్గిస్తుంది. అశ్వగంధ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్వగంధతో అశ్వగంధ చూర్ణం, అశ్వగంధ లేహ్యం, అశ్వగంధారిష్టాలని మూడు విధాలుగా తయారుజేస్తారు. అశ్వగంధను ఎవరైన వాడవచ్చు, ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి నరాలకు, కండరాలకు బలాన్నిస్తుంది. వాత, కఫ లోపాన్ని సరిచేస్తుంది. అలాగే శరీరంలో రకరకాల కణాల అభివృద్ధికి సహాయపడుతుంది.
ఆరోగ్య సమస్యలకు అశ్వగంధ ను ఎలా ఉపయోగించాలంటే..
కీళ్ల నొప్పుల కోసం,
అశ్వగంధను ముక్కలుగా చేసి, పాలు సగం అయ్యేవరకు వరకు మరిగించి, ఆ మిశ్రమాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే వాత సంబంధిత కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
మంచి నిద్ర కోసం
మానసిక ఒత్తిడి వల్ల రాత్రి నిద్రకు ఇబ్బంది ఉన్నవారు అశ్వగంధ పొడిని నెయ్యి, పంచదార పాలలో కలుపుకుని పడుకునే ముందు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది.
గాయాలు మానటం కోసం
అశ్వగంధ పొడిని పాలలో కలిపి గాయమైన చోట రాస్తే చిన్న చిన్న గాయాలు త్వరగా మానిపోతాయి.
గుండె సమస్యలకు
ఇది రక్తపోటును నియంత్రించే మరియు హార్ట్ రేట్ నియంత్రించే లక్షణాలను కలిగి ఉంది, కాబట్టి గుండె జబ్బులతో బాధపడేవారు అశ్వగంధ పొడిని పాలలో కలపడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
చర్మ సౌందర్యం కోసం
అశ్వగంధ పొడిని పాలలో కలిపి ముఖానికి పట్టించి కొంత సమయం తర్వాత నీళ్లతో కడిగేస్తే ముఖం అందంగా అవుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని హెర్బల్ బాత్ పౌడర్ తో కలిపి తలస్నానం చేసి శరీరానికి వాడితే శరీరంపై ముడతలు తగ్గి శరీరం మెరుస్తుంది.
బలం కోసం
ఆశ్వగంధను పాలతో తీసుకోవాలి. పిల్లలకైతే ఆవునెయ్యి, అశ్వగంధ చూర్ణం. పాలలో కలిపి తీసుకోవలెను. ప్రతిరోజుశక్తికి అశ్వగంధ చూర్ణం, పిప్పలి, ద్రాక్ష తేనెతో కలిపి తీసుకోవలెను.
యవ్వనంగా ఉండటం కోసం
ఆవునెయ్యి, అశ్వగంధ చూర్ణం పాలలో కలిపి తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, మనోవ్యాకులత ఉన్నవారు అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలిపి రెండు పూటలా తీసుకొంటే మంచిది.
జ్ఞాపకశక్తికి
అశ్వగంధ చూర్ణాన్ని శంఖపుష్పి, శతావరితో కలిపి పిల్లలకిస్తే మెదడుకు పోషణ కలిగించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
చివరగా
అశ్వగంధ ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది, సంతాన ప్రాప్తికి పురుషులకు అశ్వగంధ ఉపయోగపడుతుంది. అందుకనే అశ్వగంధ ఆయుర్వేదానికి రాజు అయింది.
మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Also Read: స్పైరులీనా – మెరుగైన ఆరొగ్యానికి ఔషధం
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.