బయో హ్యాకింగ్ అనే పదం ఎక్కడైనా విన్నారా?
ఈ హ్యాకింగ్ అనే పదం మనం ఈ కంప్యుటర్ యుగంలో చాలా సార్లే విని ఉంటాం.
కానీ కొత్తగా ఈ బయో హ్యాకింగ్ ఏంటి అంటారా!ఈ తరంలో మన జీవన శైలి, మన ఆరోగ్యాన్ని మన అదుపులో ఉండనివ్వనంతగా మారిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. మారుతున్న టెక్నాలజీ మరియు ఆహార అలవాట్లు మనను ప్రకృతికి దూరం చేసి స్క్రీన్లకు అతుక్కుపోయి, జంక్ ఫుడ్ తింటూ కూర్చునేలా చేసాయి. ఈ పరిస్థితుల ప్రభావంగా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ప్రతీ ఇంటి గడప దాకా చేరిపోయాయి. ఈ ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుట్టిన కొత్త పదమే బయో హ్యాకింగ్.ఈ చిన్న ఉదాహరణతో ఈ బయో హ్యాకింగ్ మన నూతన జీవనశైలి లో ఎలా పనిచేస్తుందో మనం అర్థంచేసుకోవచ్చు. ఈ జెనరేషన్ లో రాత్రి తొమ్మిదింటికే నిద్రపోయే మనుషులు అస్సలు లేరనే చెప్పాలి. ఇంకా అర్థరాత్రి దాకా కళ్ళను డ్యామేజ్ చేసే బ్లూ లైట్ విడుదలచేసే మొబైల్, టీవీ లేదా ల్యాప్ టాప్ తోనే ఆ అర్ధరాత్రి దాకా గడిపేస్తుంటారు. దీని వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా నిద్రపోవడానికి అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ కూడా విడుదల అవ్వదు. ఈ నిద్రలేమి మరియు కంటి ఆరోగ్యం దెబ్బతినడం అనే సమస్యలను నివారించే బయోహ్యాక్ పేరే బ్లూ లైట్ బ్లాకింగ్ కళ్ళజోడు ఉపయోగించడం. ఈ రకమైన కళ్ళజోడు ఉపయోగించడం వల్ల చుట్టూ పక్కన ఉండే బ్లూలైట్ మన కంటిలోకి వెళ్ళకుండా ఈ కళ్ళజోడు బ్లాక్ చేస్తుంది. తద్వారా ఆ బ్లూలైట్ నుండి వచ్చే సమస్య నివారించబడుతుంది.ఈ విధంగా మారిన జీవన శైలికి ఎక్కువగా ఇబ్బంది కలిగించకుండా ఆరోగ్యాన్ని టెక్నాలజీ మరియు బయో సైన్స్ ని ఉపయోగించి తయారు చేసే ట్రిక్స్ మరియు విధానాలను బయో హ్యాకింగ్ అంటాము. ఈ బయో హ్యాకింగ్ లో న్యూరో సైన్స్, టెక్నాలజీ, బయాలజీ, జేనిటిక్స్ ను ఉపయోగించి ఈ బయో హ్యాకింగ్ ట్రిక్స్ ను కనిపెడుతుంటారు. దీనిని మనకు శారీరకంగా, మానసికంగా వస్తున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి, నివారించడానికి ఉపయోగిస్తుంటారు.
మాడర్న్ బయో హ్యాకింగ్ లో వివిధ రకాలు
జీవన విధానంలో బయో హ్యాకింగ్
ఈ రకమైన బయోహ్యకింగ్ మన జీవనవిధానంలో మన చేసుకునే మార్పులు మరియు మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసి ఆరోగ్యాన్ని సరిచేస్తుంది. ఉదాహరణకు మనం ఆహారం తినే వేళలు మార్చడం, మెడిటేషన్, వ్యాయామం వంటి వాటితో మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం. ఇది సాధారణంగా ఎన్నో ఏళ్ళ నుండి మనం పాటిస్తున్న విషయమే!మాలిక్యులార్ బయో హ్యాకింగ్
ఈ మాలిక్యులార్ బయో హ్యాకింగ్ లో సింథటిక్ మాలిక్యుల్స్ తో తయారు చేసిన సప్లిమెంట్ల ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తారు. ఉదాహరణకు మనలో ఏదైనా ఒక పోషకం లోపించి ఉంటే, ఆ లోపాన్ని ఈ సప్లిమెంట్ ద్వారా బర్తీ చేస్తారు. ఇది పట్టణాలలో ఇప్పుడు చాలా మంది పాటిస్తున్న బయో హ్యాక్.బయోలాజికల్ బయో హ్యాకింగ్
ఈ రకమైన బయో హ్యాకింగ్ లో DNA, RNA ప్రోటీన్స్ మరియు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న కణాల లాంటి కృత్రిమ బయోలాజికల్ ప్రాడక్ట్స్ ని ఉపయోగించి మన శరీరంలోని సమస్యలను సరిచేస్తారు. ఉదాహరణకు స్టెమ్ సెల్స్ ను శరీరంలోకి పంపించడం లాగా, కానీ ఇందులో కొన్ని చేయాలంటే వైద్యుడి పర్యవేక్షణ అవసరం. కొన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల నాన్ మెడికల్ ఐవి థెరపీస్ పేరుతొ చేస్తున్నారు.టెక్నాలాజికల్ బయో హ్యాకింగ్
సింపుల్ గా దీని గురించి చెప్పాలంటే మొదలు పెట్టాల్సింది మనం చేతికి కట్టుకునే స్మార్ట్ వాచ్ దగ్గరనుండే! మనం ఈ టెక్నాలజీని ఉపయోగించి మన శరీరం గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఈ టెక్నాలాజికల్ బయో యాకింగ్ లో మొదటి వైపు అయితే రెండోది ఎలక్ట్రానిక్ సిములేటర్స్, హైపర్ బేరిక్ చాంబర్స్ వంటి అడ్వాన్స్డ్ మెషినరీ ఉపయోగించి ఆరోగ్య సమస్యలను ట్రీట్ చేయడం. ఈ టెక్నాలాజికల్ బయోహ్యాకింగ్ ఇప్పుడు దాదాపు ప్రతీచోట ఉపయోగించబడుతుంది.ఇవి మాత్రమే కాకుండా మన ఆరోగ్య అవసరాలను బట్టి కూడా ఎన్నో బయో హ్యాకింగ్ విధానాలు ఇప్పటి మాడర్న్ సొసైటీ లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు- ఏజ్ బయో హ్యాకింగ్
- ఎనర్జీ బయో హ్యాకింగ్
- డైట్ అండ్ న్యూట్రిషన్ బయో హ్యాకింగ్
- ఫిజికల్ హెల్త్ బయో హ్యాకింగ్
- బ్రెయిన్ బయో హ్యాకింగ్ మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.
- మాడర్న్ బయో హ్యాకింగ్ మనకు మంచినే చేస్తుందా?
- ఆయుర్వేదం : ది మదర్ ఆఫ్ బయో హ్యాకింగ్
ఆయుర్వేదం మన దీర్ఘాయువు కోసం చెప్పిన రెండు ముఖ్యమైన బయో హ్యాక్స్
- దినచర్య మనం ఒక రోజులో సాధారణంగా చేసే ప్రతీ పనీ దినచర్యలో భాగమే. ఈ దినచర్యను ఆయుర్వేదం రెండు విభాగాలు గా చేసింది. ఒకటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, రెండవది సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం వరకు. ఈ రెండు విభాగాల్లోనూ ప్రతీ నాలుగు గంటలకు వాత, పిత్త, కఫ దోషాలు, ఒకటి తరువాత ఒకటి ఆధిపత్యంలో ఉంటాయి. ఆయుర్వేదంలో మన శరీర తత్వాన్ని బట్టి మన దినచర్య ఉంటుంది.
- ఋతుచర్య ఋతుచర్య అంటే కాలానికి అనుగుణంగా జీవించడం. ఆయుర్వేదం ప్రకారం ప్రతీ ఋతువు ప్రత్యెకమైనదే. ఋతువు మారినప్పుడు మన చుట్టూ ఉండే గాలి కూడా మారుతుంది, మనం తినే ఆహారం కూడా మారుతుంది. ఈ మార్పులను మనం గౌరవించి కాలానుగునంగా జీవించడమే ఈ ఋతుచర్య. ఈ మారే కాలాన్ని బట్టి మగ గట్ బ్యాక్టీరియా కూడా మారడం జరుగుతుంది, మనం తినే ఆహారం కూడా కాలాన్ని బట్టి తింటున్నట్లయితే మన గట్ ఆరోగ్యంగా ఉంటుంది.