కుక్క పొగాకు..ఈ పేరు వినగానే ఇదేదో ధూమపానానికి దగ్గరగా ఉన్నట్టుందేంటి..అని సందేహించకండి. ఇదొక ఆయుర్వేద మూలిక. ఈ కుక్క పొగాకును ఆయుర్వేదంలో కుకుందర అని పిలుస్తారు. ఈ మొక్క ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పని చేయగలదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఔషధ మొక్క ఎక్కువగా ప్రాచుర్యం పొందకపోయినా ‘జర్నల్ ఆఫ్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్’ విడుదల చేసిన ఒక అధ్యయనంలో మెడిసినల్ ప్లాంట్స్ లిస్టు లో ఈ మొక్క కూడా ఉంది. ఈ మొక్కను పల్లెటూళ్ళలో పిచ్చి పొగాకు అని కూడా అంటారట.ఈ ఔషధ మూలిక ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన మనకు అవసరం.
కుకుందర మొక్క ఆరోగ్యం పై ప్రభావం
ఈ కుకుందర ఆకుల కషాయాన్ని తీసుకున్నట్లయితే మలబద్దకం నివారించవచ్చట. ఎందుకంటే ఈ ఆకుల కాషాయం మన జీర్ణ క్రియకు ఎంతగానో సహాయపడుతుంది.
పొట్టలో నులిపురుగులను చంపడానికి కూడా ఈ కుక్క పొగాకు పనిచేస్తుంది. ఇంకా లివర్ ఆరోగ్యంగా ఉండటంలో సహాయం చేస్తూ లివర్ సంబంధిత సమస్యలపై కూడా ఈ కాషాయం మంచి ప్రభావం చూపుతుంది.చర్మ వ్యాధులపై ఈ కుకుందర ఆకుల పేస్ట్ బాగా పనిచేస్తుందట, మరీ ముఖ్యంగా సోరియాసిస్ పై మంచి ప్రభావం చూపుతుందట.
ఇంకా ఈ కుక్క పోగాకు ఆకులలో జలుబు దగ్గు తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కుకుందర ఆకులు మన శరీరంలో వాత పిత్త కఫా దోషాలను నివారించడానికి సహాయపడలవు. ఈ కుక్క పొగాకు ఆకుల రసంలో కొద్దిగా పసుపు కలిపి తలకు పట్టించి కొద్ది సేపటి తరువాత తలస్నానం చేస్తే తలలో పెళ్ళు అన్ని చనిపోతాయట. అలాగే ఈ ఆకులను పేస్ట్ గా చేసి గాయాల పై రాస్తే మానని మొండి గాయాలు కూడా మనిపోతయట. అంటే కాదు పైల్స్ విషయంలో కూడా ఇది మంచి ప్రభావాన్నే చూపుతుందట.
కుకుందర పై కొన్ని అధ్యయనాల వివరణ
ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ కుక్క పొగాకు అని పలవబడే కుకుందర పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- కర్ణాటకలో కుకుందర పైన జరిగిన ఒక అధ్యయనంలో దీనిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని తేలింది. అలాగే ఈ మొక్కలో ఉన్న యాంటీ మైగ్రెటరీ ఎఫెక్ట్ మేలనోమా అనే స్కిన్ క్యాన్సర్ పై మంచి ప్రభావం చూపగలదట.
- ‘జర్నల్ ఆఫ్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్’ విడుదల చేసిన మెడిసినల్ ప్లాంట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అనే ఆర్టికల్ లో ఈ కుకుందర మొక్క యాంటీ హెల్మిన్థిక్ లక్షణాలను కలిగి ఉందని రాయబడింది, అంటే నులిపురుగులను చంపే లక్షణాలు దీంట్లో ఉన్నాయని అర్థం.
- ఒక అధ్యాయనం ప్రకారం ఈ కుక్క పొగాకు ను డయాబెటిస్ పై ప్రభావం చూపగలదని తెలిపింది.
చివరగా
కుక్క పొగాకు లేదా పిచ్చి పొగాకు అని పిలుచుకునే మన మధ్యనే పెరిగే ఒక మొక్కకు ఇన్ని ఔషధగుణాలు ఉన్నాయి. ఒకవేళ దీనిని ఉపయోగించాలంటే సరైన ఆయుర్వేద వైద్యుడిని వైద్యుడిని సంప్రదించటం మర్చిపోకండి. మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.