వ్యాధులను దూరంగా ఉంచే అద్బుతమైన పండ్లు

You are currently viewing వ్యాధులను దూరంగా ఉంచే అద్బుతమైన పండ్లు

ఆరోగ్యకరమైన ఆహరపు అలవాట్లను కలిగి ఉండటానికి, మన ఆహరంలో  పండ్లను చేర్చుకోమని వైద్యలు ఎల్లప్పుడూ సూచిస్తుంటారు. జబ్బులను దూరంగా ఉంచి ఆరోగ్యంగా జీవించడానికి పండ్లు మనకి చాలా అవసరం. పండ్లు రక్తపోటును తగ్గిస్తాయి. గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ముఖ్యంగా  కంటి మరియు జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మరియు రక్తంలో చక్కెరపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇలా ఒక్కో రకమైన పండు మన శరీరానికి ఒక్క రకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. ఏయే పండుతో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

యాపిల్:

Apple

  • అత్యంత గుర్తింపు పొందిన పండ్లలో యాపిల్ కూడా ఒకటి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి వింటున్నాం కదా..! “An apple a day keeps the doctor away”  అని. కేవలం ఈ నానుడితో చెప్పవచ్చు యాపిల్ ఎంతటి గొప్ప పోషకాలతో నిండి ఉందో చెప్పడానికి..   
  • యాపిల్ లో పెక్టిన్, హెమిసెల్యులోజ్ మరియు సెల్యులోజ్ వంటి సాల్యుబుల్ మరియు ఇన్ సాల్యుబుల్ వంటి ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో, మంచి జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అలాగే గట్ మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
  • యాపిల్ విటమిన్ సి మరియు ప్లాంట్ పాలీఫెనాల్స్ యొక్క అద్భుతమైన మూలం. వాస్తవానికి, యాపిల్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, అధిక బరువు, ఊబకాయం మరియు నరాల సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గుస్తుందంని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

బ్లూబెర్రీస్:

Blueberries

  • బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకించి, వీటిలో ఆంథోసైనిన్ ఫ్లేవనాయిడ్‌ అధికంగా ఉంటాయి. ఇది బ్లూబెర్రీస్‌కు వాటి లక్షణమైన బ్లూ-పర్పుల్ రంగును ఇస్తుంది. ఈ సమ్మేళనం అనేక రకమైన వ్యాధులకి దారితీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
  • కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆంథోసైనిన్ అధికంగా ఉండే ఆహారాలు టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, అధిక బరువు, ఊబకాయం, అధిక రక్తపోటు మరియు కొన్ని రకాల క్యాన్సర్ వంటి సమస్యలకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. 
  • రెండు వేల మందిపై ఒక అధ్యయనం జరిగింది. రోజుకు 17 గ్రాముల ఆంథోసైనిన్ అధికంగా ఉండే బెర్రీలు తినే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 5% తగ్గిందని వారు కనుగొన్నారు.
  • ఆంథోసైనిన్‌లు అధికంగా ఉండే ఇతర బెర్రీస్ బ్లాక్‌బెర్రీస్ మరియు చెర్రీస్.

అరటిపండు:

bananas

  • అరటిపండులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థ నుండి నరాల మరియు కండరాల పనితీరు వరకు ప్రతిదానికీ ఇవి ఉపయోగపడతాయి. 
  • ముఖ్యంగా  క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా జీర్ణసమస్యలు మరియు మలబద్ధకంతో బాధపడే వారికి అరటిపండ్లు చక్కగా సహయపడతాయి.
  • అరటిపండల్లో ఉండే ఫైబర్ గట్ లో మంచి బ్యాక్టీరియాను పెంపొందించడం ద్వారా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీరసంగా అనిపించినప్పుడు అరటిపండుని తినడం ద్వారా తక్షిణ మరియు స్థిరమైన ఎనర్జీని అందిస్తుంది. 
  • ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి, అనవసర ఫుడ్ క్రేవింగ్స్ ను తగ్గిస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. 
  • అరటిపండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటుని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతోపాటు ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మరియు మానసిక స్థితిని మెరుగుపరచడంలో అరటిపండ్లు మంచి ఫలితాన్ని అందిస్తాయి.

కమలాపండు:

Orange fruits

విటమిన్ సి తో నిండి ఉండే పండ్లలో కమలాపండు కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ పండ్లు మన రోజువారీ పోషక అవసరాలలో 91% అందిస్తాయి. కమలాపండ్లలో పొటాషియం, ఫోలిక్ యాసిడ్, థయామిన్ (విటమిన్ బి1), ఫైబర్ మరియు ప్లాంట్ పాలీఫెనాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. 

  • కమలాపండు తినడం వల్ల ఇన్ఫ్లమేషన్, రక్తపోటు మరియు  కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
  • అలాగే ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
  • మరియు రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ను సమతుల్యం చేస్తాయి.  
  • ముఖ్యంగా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ప్రమాదాలని తగ్గిస్తాయి. 
  • అంతేకాదండోయ్..! కమలా పండ్లు కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
  • వాటితో పాటు మధుమేహం, రక్తహీనత మరియు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ చికిత్సలో సహాయపడుతాయి. 
  • ముఖ్యంగా కిడ్నీ స్టోన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్‌:

Dragon fruit

  • డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  బ్యాలెన్స్ చేయడానికి మరియు గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు మరియు కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాలని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 
  • అలాగే డ్రాగన్ ఫ్రూట్‌లో కెరోటినాయిడ్స్ మరియు బీటాలైన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్, డయాబెటిస్, గుండె సమస్యలు మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
  • ముఖ్యంగా వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది మీ రోగనిరోధక వ్యవస్థకు మంచిది.
  • ఐరన్ లోపంతో బాధపడే వారికి డ్రాగన్ ఫ్రూట్ చక్కగా సహయపడుతుంది. ఎందుకంటే ఇవి ఇనుముకి గొప్ప మూలం.  
  • రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి గొప్పగా ఉపయోగపడతాయి. 
  • ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి సెల్ డ్యామేజ్ తో పోరాడటంలో సహయపడతాయి. 
  • అలాగే కాలేయ ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి. 
  • డ్రాగన్ ఫ్రూట్స్ నాడీ వ్యవస్థను రక్షించడంతో పాటు ఎముకలను కూడా ధృడంగా ఉంచుతాయి.

కివి:

kiwi

  • కివి మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని చైనీస్ గూస్ బెర్రీస్ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ ఇ కి కూడా మంచి మూలం. దీంట్లో కెరోటినాయిడ్స్‌, లుటీన్, జియాక్సంతిన్ మరియు బీటా కెరోటిన్‌లు వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడతాయి.
  • సాంప్రదాయ చైనీస్ వైద్యంలో కివి ని గట్ హెల్త్  మరియు జీర్ణక్రియకు సంబందించిన చికిత్సలో వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తుంటారట.
  • మూడు రోజుల పాటు రోజూ రెండు కివీలు తినడం వల్ల ప్రేగు కదలికలు పెరుగుతాయని, మలం మృదువుగా మారవచ్చని మరియు తేలికపాటి మలబద్ధకం చికిత్సలో సహాయపడుతుందని ఒక చిన్న అధ్యయనం సూచిస్తుంది. 

పుచ్చకాయ: 

Watermelon

  • పుచ్చకాయలో విటమిన్లు A మరియు C, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు
  • బీటా కెరోటిన్ మరియు లైకోపీన్ లకి కూడా ఇవి మంచి మూలం. అంతేకాకుండా దీంట్లో పొటాషియం మరియు మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
  • లైకోపీన్ అధికంగా ఉండే ఆహారాలు తక్కువ ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపుతో ముడిపడి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు టైప్ 2 డయాబెటిస్ ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • పుచ్చకాయలో ఉండే లైకోపీన్ మరియు బీటా-కెరోటిన్ చర్మాన్ని అతినీలలోహిత (UV) కిరణాల నుండి రక్షించడంలో కొద్ది పాటి సహాయాన్ని అందించగలవు. అలాగే సన్‌బర్న్ యొక్క  ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహయడతాయి.

ఆరోగ్యంగా జీవించడానికి పండ్లు గొప్పగా సహాయపడతాయి. ఇవి సహజంగా వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. ఇక్కడ ప్రస్తావించిన పండ్లతోనే ఆగిపోకుండా, రోజు రకరకాల పండ్లను తీసుకుని ఆరోగ్యమైన జీవితాన్ని జీవిద్దాం. మన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వీటిని వినియోగించేముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మరచిపోవద్దు.

Also Read: వర్క్ ఫ్రం హోం లో ఆరోగ్యంగా ఉండటానికి హెల్త్ టిప్స్