అందం అనేది చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది, కేవలం శరీరం, ముఖం అందంగా ఉండటమే అందం కాదు. అలా అని మన శరీరాన్ని పట్టించుకోకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఆయుర్వేదం ప్రకారం శరీరం మరియు మనసు రెండు అందంగా ఉండటానికి ఎన్నో విధానాలున్నాయి.
అందంగా కనిపించాలంటే ముందు పాజిటివ్ గా ఆనందంగా ఉండటం చాలా అవసరం. నవ్వుతున్న ముఖానికి మించిన అందం లేదు. ఇక చర్మాన్ని సరిగ్గా కేర్ చేయటం కూడా ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. బయట చర్మం అందంగా కనపడటానికి రకరకాల కృత్రిమ ప్రాడక్ట్స్ ఉపయోగిస్తుంటాం, అందులో ఏది సరైన ఫలితన్నిస్తుందో అర్తంచేసుకునేలోపే ఉపయోగించే ప్రాడక్ట్ మార్చేస్తుంటాం. ఎల్లప్ప్పుడు అందంగా మెరిసే చర్మం కోసం మనకు ప్రకృతి ఎన్నో అధ్బుతమైన పరిష్కారాలను అందించింది,
అవి సరిగ్గా తెలుసుకొని ఉపయోగించగలిగితే ఇక వేరే ఏ ప్రాడక్ట్స్ ని ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు.
చర్మసౌందర్యం కోసం ప్రకృతి ఇచ్చిన అధ్బుతమైన చిట్కాలు
అవి తెలుసుకునే ముందు అర్తంచేసుకోవాల్సింది ఏంటంటే చర్మం ఆరోగ్యంగా మరియు అందంగా ఉండటానికి ఏ అలవాట్లు మానుకోవాలి అని.. ఒకవేళ ఇదే ప్రశ్న అయితే మద్యపానం,ధూమపానం అలాగే అధిక సూర్య రష్మిలో బయట ఎక్కువసేపు ఉండటం వంటివి మానితే మంచిది.
ఇక ఈ రెండు చిట్కాలు మెరిసే చర్మానికి సహాయపడతాయి.
- ఇక ప్రకృతి ఇచ్చిన మ్యజికల్ సొల్యుషన్స్ లో మొదటిది తయారుచేసుకోవటానికి పసుపు,శనగపిండి మరియు రోజ్ వాటర్ ఉపయోగిస్తాం. అరా చంచా పసుపు,అర చంచా శనగపిండి లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి చిక్కగా అయ్యేలా బాగా మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేయాలి,తరువాత దీనిని ఇరవై నిముషాలు అలాగే ఉంచేసి గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి. ఇందులో ఉపయోగించే పసుపు యాంటి బయోటిక్ లా పనిచేస్తుంది, ఇది చర్మాన్ని ఇంఫేక్షన్స్ నుండి కాపాడుతుంది. ఇక ఇందులో ఉపయోగించే శనగపిల్లి చర్మం పైన గరుకుతనాన్ని తొలగించి,చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
- ఇక రెండో చిట్కా కోసం శాండల్ వుడ్ పౌడర్, బియ్యం పిండి ఉపయోగించాలి. శాండల్ వుడ్ పౌడర్ UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది, ఇక బియ్యం పిండి డేడ్ స్కిన్ సెల్స్ ను తొలగించటానికి సహాయపడుతుంది.ఇది తాయారు చేసుకోవటానికి ఒక చంచా బియ్యం పిండి, అరచంచా మంచి శాండల్ వుడ్ పౌడర్ కలిపి ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా కోవాలి. ఆ తరువాత దీనిని ముఖానికి మసాజ్ చేయాలి. ఇది పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
చర్మ సౌందర్యానికి యోగా
ఇవి మాత్రమే కాకుండా మంచి చర్మం కోసం యోగా లో మత్స్యాసనం,సర్వాంగాసనం చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి, వీటితో పాటు కపాల్ భాటి ప్రక్రియ కూడా మంచి ఫలితాన్నిస్తుంది.
ఇవన్ని చర్మం మెరిసేలా కనపడటానికి సహాయపడినా, అందంగా ఉండటానికి ప్రశాంతంగా ఆనందంగా ఉండటం చాల ముఖ్యం,దీనికోసం ధ్యానం సహాయపడగలదు .
చివరగా
మన ఆరోగ్యానికి ప్రకృతి మనకు ఎన్నో దివ్త్యమైన సహజ ఔషధాలను ఇచ్చింది, వాటిని ఉపయోగించి ఆరోగ్యంగా ఉండటం మన బాధ్యత. మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Also Read: ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతామా?
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.