ఈ ప్రపంచంలో చాలా వరకు మన సమస్యలను నేచర్ క్యూర్ చేస్తుంది.
దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే పదిహేడో శతాబ్దంలో ముఘల్ సైన్యం పైన అహోం సైన్యం యుద్ధం చేస్తున్నారు. ఈ సంఘటన మన ప్రస్తుత అస్సాం లో జరుగుతుంది.
ఆ యుద్ధంలో పాల్గొనే అహోం సైనికులకు యుద్ధంలో పోరాడెంత శక్తినిచ్చే ఆహరం తయారుచేసుకునే సౌలభ్యం లేదు. అలంటి సమయంలో ఆ ప్రాంతంలో పండే బొకా చౌల్ అనే ఒక వారి ధాన్యాన్ని ఆహారంగా తినే వారు. కానీ ఆ ధాన్యాన్ని వారు వండుకునే వారు కాదు. ఎందుకంటే అది వండాల్సిన అవసరం లేకుండానే అన్నం గా మారిపోయే ఒక మ్యాజిక్ రైస్. ఇది వాళ్ళ సమస్యలకు నేచర్ చేసిన క్యూర్ అనుకోవాలేమో !
ఇక ఈ ధాన్యం ఇప్పుడు మన తెలంగాణ లోని కరీంనగర్ లో కూడా పండిస్తున్నారు. ఈ ధాన్యం ప్రత్యేకత ఏంటి? అసలు వండకుండా అన్నం ఎలా అవుతుంది ? ఇందులో ఉండే పోషకాలేంటి ? అనేది ఇది పూర్తిగా చదివి తెలుసుకోండి.
ఈ బొకా చౌల్ అనేది మన భారతీయ ప్రాచీన వరి రకం. ఇది అస్సాం లో పండుతుంది. మనం తినే బియ్యం రకాలలో శాలీ రకమైన ధాన్యం మనకు మంచిది అంటారు. ఈ బొకా చౌల్ కూడా ఆ రకమైనదే. కానీ ఈ బియ్యం ప్రత్యేకత ఏంటంటే ఇది నీటిలో నానబెడితే చాలు అన్నం అవుతుంది, వండాల్సిన పని లేదు !
వినడానికీ కొత్తగా ఉన్నా అదే నిజం. ఈ బియ్యం అన్నం లా మారడానికి కొద్ది సేపు నీటిలో నానబెట్టాలంతే ! ఒక వేళ ఆ నీరు కొంచెం వేడిగా ఉన్నట్లయితే అన్నం కొన్ని నిమిషాల్లోనే తయారవుతుంది. అదే చల్ల నీరైతే కొన్ని గంటలు పడుతుంది. ఇలా వండాల్సిన పని లేదు కాబట్టే దీనిని మ్యాజిక్ రైస్ అంటారు. బాగా సాఫ్ట్ గా ఉండటం వల్ల దీనిని కోమల్ రైస్ అని కూడా అంటారు.
ఈ రైస్ లో ఉండే పోషక విలువల గురించి మనం ఇప్పుడు చూద్దాం.
అసలు ఈ మ్యాజిక్ రైస్ ఇలా వండాల్సిన అవసరం లేకుండానే తినగలిగేలా తయారవ్వడానికి కారణం ఈ ధాన్యం లో అమైలోస్ అనే కాంపౌండ్ తక్కువగా ఉండటమే. మామూలు రైస్ లో ఇది 25 శాతం ఉంటే, ఈ మ్యాజిక్ రైస్ లో అమైలోస్ 4 నుండి 12 శాతం ఉంటుందట. ఈ కాంపౌండ్ ఎంత ఎక్కువ ఉంటే రైస్ అంత హార్డ్ గా ఉంటుంది.
ఇక ఈ రకమైన ధాన్యంలో పది శాతానికి పైగా ఫైబర్ మరియు దాదాపు ఏడు శాతం ప్రోటీన్ ఉంటుంది. ఒక పరిశోధన చెప్పిందేమిటంటే ఈ రైస్ మన శరీరంలోని వేడిని తగ్గిస్తుందట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రైస్ ని కెమికల్స్ వేసి పండించలేరు, ఇదొక డీఫాల్ట్ ఆర్గానిక్ రైస్. ఈ వరి పంట పై కెమికల్స్ వాడితే పంట నాశనం అవుతున్నదట.ఈ రకమైన అన్నాన్ని వేసవి కాలం లో తినడం ఆరోగ్యానికి చాలా మంచిదట.
రెండు లక్షల రకాల వారి ధాన్యం పండించిన మన దేశం లో, ఇప్పుడు మిగిలిన ఆరు వేల రకాలలో ఈ మ్యాజిక్ రైస్ కూడా ఒకటి. ఇన్ని పోషక విలువలుండి, మన ఆరోగ్యానికి మంచి చేసే ఈ రైస్ వరైటీ మీకు అందుబాటులో ఉండి ఉంటే ఒక సారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రైస్ ని నానబెట్టి అన్నం అయ్యాక బెల్లం తో తిన్నా, పెరుగు తో తింటే రుచిగా ఉంటుందట. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: శరీరాన్ని డీటాక్స్ చేసే 5 ఆయుర్వేద మూలికలు