Breast Cancer Symptoms: బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు

You are currently viewing Breast Cancer Symptoms: బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు

బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer symptoms) సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాం.  పురుషుల్లో కూడా కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది… కానీ ఆడవాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ.

క్యాన్సర్ సోకిన స్త్రీలలో ఇతర క్యాన్సర్ల కంటే బ్రెస్ట్ క్యాన్సర్ తో  బాధపడుతున్నవారే ఎక్కువ. సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ 30 ఏళ్ళు పైబడిన స్త్రీలలో మాత్రమే వస్తుంటుంది. 18 నుండి 30 ఏళ్ల లోపు ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పటికీ మాక్సిమం ఆ క్యాన్సర్ కణాలు ప్రమాదకరమైనవి అయి ఉండవు.వీటిని బినైన్ ట్యూమర్స్ అంటాము. అదే 30 ఏళ్ళు దాటినా తర్వాత గనుక రొమ్ముల్లో/ వక్షోజాల్లో  ఈ గడ్డలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టరుని సంప్రదించడం మంచిది.

బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించిన సమయాన్ని బట్టి నాలుగు దశలుగా విభజించవచ్చు.

4 stages of breast cancer

మొదటి దశలో గడ్డ చిన్నదిగా ఉంటుంది –  దీన్ని ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. వక్షోజాలపైన వేలితో పొడిస్తే ఈ గడ్డలు తగులుతుంటాయి. అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స చేసి గడ్డను పూర్తిగా తొలిగించవచ్చు.

రెండవ దశలో గడ్డ పరిణామం 2 సెం. మీ దాటుతుంది. రొమ్ముల్లో మొదలైన క్యాన్సర్ కణాలు మెల్లిగా దగ్గరలో ఉండే లింఫ్ నాళాలకు, రక్తనాళాల్లోకి  చేరుకుంటాయి.

మూడవ దశనే లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు.   ఈ దశలో క్యాన్సర్ గడ్డ కొంచెం పెద్దదిగా ఉంటుంది… సుమారుగా 2 సెం.మీ నుండి 5 సెం.మీ వరకు ఉంటుంది తడిమితే చేతికి తగులుతుంది. ఈ దశలో వక్షోజాలు గట్టిబడతాయి. చనుమొనల చుట్టూ వాపు రావడం… గరుకుగా తయారవ్వడం జరుగుతుంటుంది.

నాల్గవ దశనే మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఈ దశలో గడ్డ పెద్దదిగా ఉండడమే కాకుండా క్యాన్సర్ కణాలు ప్రక్క భాగాలకు కూడా వ్యాపిస్తుంది. నాలుగో దశలో క్యాన్సర్ కణాలు లింఫ్ నాళాల ద్వారానో రక్త నాళాల ద్వారానో ఇతర భాగాలకు సోకుతుంది. చంకల్లో గడ్డలు రావడం, వక్షోజాలపై నరాలు రంగు మారడం… నిపిల్స్/ చనుమొనల నుంచి డిశ్చార్జి రావటం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది.?

మిగతా క్యాన్సర్ల లాగే బ్రెస్ట్ క్యాన్సర్  రావడానికి ఇవే నిర్దిష్టమైన కారణాలని చెప్పడం సాధ్యపడదు కానీ వ్యాధి సోకినవారిలో ఉన్న (Breast cancer symptoms) లక్షణాలు ఆధారంగా కొన్ని కారణాల వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు.   వాతావరణంలో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు,కాలుష్యం, ధూమపానం, మద్యపానం, లాంటి కారణాలతో పాటు వంశపారంపర్యంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది.

బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకునే స్త్రీలలోనూ, ప్రసవం అయిన తర్వాత రొమ్ము పాలు ఉత్పత్తి కాని స్త్రీలలోనూ కనిపిస్తూ ఉంటుంది. ధూమపానం, మద్యపానం చేసే ఆడవాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. 70, 80 ఏళ్ళు దాటిన  మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఇవే కాకుండా ఊబకాయం వలన కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది.

బ్రెస్ట్ క్యాన్సర్ ను సులువుగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్ముల ఆకారం, పరిణామాల్లో మార్పులు కనిపిస్తుంటాయి. కొంతమందిలో చనుమొనలు గట్టిపడతాయి. మరికొంత మందిలో చనుమొనల చుట్టూ ఉన్న ప్రదేశంలో  వాపు రావడం, గరుకుగా తయారవడం, వక్షోజాల పైన నరాలు నీలిరంగు లోకి మారడం, చంకల్లో గడ్డలు ఏర్పడడం, చనుమొనల నుంచి అనవసర డిశ్చార్జ్ రావడం వంటి లక్షణాలను గమనించవచ్చు.

ఈ లక్షణాలన్నీ క్యాన్సర్ లక్షణాలేనని చెప్పలేము… కొన్ని ఇన్ఫెక్షన్ల వలన కూడా వచ్చినవి కావచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) నిర్థారణ పరీక్షలు:

ఏదేమైనా అనుమానమొచ్చినప్పుడు నిర్లక్షం చేయకుండా లక్షణాల ఆధారంగా బ్రెస్ట్ క్యాన్సర్ను  ప్రారంభదశలోనే గుర్తిస్తే  మంచిది. వెంటనే  ఎవరైనా ఆంకాలజిస్ట్ ను  సంప్రదించి టెస్టులు చేయించుకుంటే వ్యాధి సోకిందీ లేనిదీ తెలిసిపోతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ ను నిర్ధారించేందుకు మామోగ్రఫీ , ఎమ్మారై, అల్ట్రా సౌండ్ స్కాన్ మాత్రమే కాకుండా కొత్త కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ 3డి మామోగ్రఫీ… 3డి స్టీరియోస్టాటిక్  మామోగ్రఫీ వంటి అధునాతన పరీక్షలతో వ్యాధిని సులువుగా డయగ్నైజ్ చేయొచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్ బయోప్సీ పరీక్షలు:

రొమ్ముల్లో గడ్డలు ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత బయోప్సీ చేస్తే అవి క్యాన్సర్ సంబంధిత గడ్డలా కాదా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు  బయాప్సి పరీక్ష కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సులభతరం అయిపోయింది.   కోర్ నీడిల్ బయాప్సీ, ఫైన్ నీడిల్ బయాప్సీ అని కొత్త కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. చిన్న రంధ్రం ద్వారానే   సూదిని లోపలికి పంపి గడ్డ తాలూకు శాంపిల్  సేకరిస్తారు.

పెట్ సిటీ స్కాన్ (PETCT) స్కాన్:

బయాప్సీ పరీక్ష చేస్తేనే అది క్యాన్సర్ గడ్డ అవునో కాదో తెలుస్తోంది.  గడ్డ క్యాన్సరుకు సంబంధించినదే అని నిర్ధారణ అయితే వెంటనే పెట్ సిటీ స్కాన్ (PETCT) స్కాన్ చేయాలి. ఈ స్కాన్ ద్వారా వ్యాధి ఎంత మేరకు విస్తరించిందో, దాని తీవ్రత ఏ స్ధాయిలో ఉందో తెలిసిపోతుంది. తద్వారా వైద్యం సులభమవుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి సత్వర పరిష్కారం కంటే శాశ్వత పరిష్కారం ముఖ్యం.

breast cancer ayurvedic treatment

బ్రెస్ట్ క్యానర్ కి రసాయన ఆయుర్వేద చికిత్స:

మీరు నమ్మితే ఆయుర్వేద  వైద్యాన్ని మించిన శాశ్వత పరిష్కారం మరొకటి లేదు. ఇతరత్రా చికిత్సల ద్వారా తగ్గుతున్న లక్షణాలు చూసి రోగిలో నిర్లక్ష్య ధోరణి కనిపించడం సహజమే. వ్యాధి తగ్గుతున్న గుణం కాలుండా ఫలితం కనిపిస్తేనే ఆ చికిత్స వలన ప్రయోజనమున్నట్లు. లేకుంటే అది వ్యర్ధమే. రసాయన ఆయుర్వేద వైద్యం యొక్క ప్రధాన లక్ష్యమే ఫలితం.  కంప్లీట్ క్యూర్ కోసమే చాలా మంది ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు.

క్యాన్సర్ చికిత్సలో పదేళ్లకు పైగా అనుభవముండి ఎందరికో ఈ మహమ్మారి బారినుండి విముక్తి కల్పించిన పునర్జన్ రసాయన ఆయుర్వేద వైద్యం ద్వారానే అద్భుత చికిత్స అందిస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి పునర్జన్ ఆయుర్వేద, మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్.

మీకు ఎవైనా అనుమానాలుంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 80088 42222 కి కాల్ చేయండి.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also read: రసాయన ఆయుర్వేదం అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?