మొదటి దశ క్యాన్సర్ నుండి చివరి దశ క్యాన్సర్ వరకు రసాయన ఆయుర్వేదంలో అద్భుతమైన అనుభూతయోగాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు ఆయా క్యాన్సర్ బాధితుల శరీర స్థితిగతులను క్యాన్సర్ కణాల ప్రవర్తనా తీరు ఆధారంగా ట్రీట్మెంట్‌ను సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే చివరిదశలో క్యాన్సర్ కణాలు సాధారణంగా చాలా యాక్టివ్‌గా ఉంటుంటాయి. అప్పటికే అవి వేరే ప్రధాన అవయవాలకు వ్యాప్తి చెంది ఉంటాయి కాబట్టి అక్కడ వాటి కార్యాచరణ మొదలుపెడుతూ ఉంటాయి. రసాయన ఆయుర్వేదం మొదట వ్యాధిమూలాలపై పనిచేస్తుంది. దీనివలన కొత్త క్యాన్సర్ కణాల పుట్టుక ఆగిపోతుంది. వెనువెంటనే లింఫ్ నాళాల ద్వారా క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందడాన్ని కూడా నియంత్రిస్తుంది.
సాధారణంగా చివరి దశలో ఉన్న క్యాన్సర్ బాధితుడికి ట్రీట్మెంట్ బాధితుడి శారీరక, మానసిక ఆరోగ్య స్థితిగతులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక చివరిదశలో ఉన్న క్యాన్సర్ బాధితులకు అయితే ఈ విషయాల్లో మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అప్పటికే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే శరీర, మానసిక స్థితిగతులు ఎంతో కొంత దెబ్బ తిని ఉంటాయి. అందుకే రసాయన ఆయుర్వేదం మొదట వీటిని యధాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అదీకాక అత్యధికులు క్యాన్సర్ చివరి దశకు చేరుకున్న తర్వాతే ఆయుర్వేదంవైపు చూస్తుంటారు. అయినప్పటికీ రసాయన ఆయుర్వేదం ఎన్నడూ తన విశ్వసనీయత కోల్పోకుండా మలిదశ క్యాన్సర్లతో పాటు చివరి దశ క్యాన్సర్లను కూడా సమర్ధవంతంగా నియంత్రిస్తుంది.
చివరి స్టేజి క్యాన్సర్ అంటే అప్పటికే క్యాన్సర్ కణాలు మరికొన్ని అవయవాలకు వ్యాప్తి చెంది ఉంటుంది. ఒకపక్క క్యాన్సర్ కణాల పుట్టుకను, వ్యాప్తిని నియంత్రిస్తూనే అవయవాలు దెబ్బ తినకుండా చూస్తూ వాటి పనితీరును మెరుగుపరుస్తుంది రసాయన ఆయుర్వేదం. అన్నిటినీ మించి రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రధాన సమస్య అయిన వ్యాధిక్షమత్వ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఓజస్సును పెంచుతుంది. ఫలితంగా క్యాన్సర్ కణాల సంఖ్య గణనీయంగా తగ్గి వ్యాధి తిరోగమనం దిశగా దశలు మార్చుకుంటూ వెళుతుంది. శరీరం కూడా కనీస వ్యవధిలోనే పూర్వస్థితికి చేరుకుంటుంది.
Also Read: ఈ రసాయన ఆయుర్వేద చికిత్స అన్ని రకాల క్యాన్సర్ల పై పని చేస్తుందా?