క్యాన్సర్ రావటానికి కారణాలు.. క్యాన్సర్ కోసం కొన్ని నివారణలు

You are currently viewing క్యాన్సర్ రావటానికి కారణాలు.. క్యాన్సర్ కోసం కొన్ని నివారణలు

ఒక మనిషికి క్యాన్సర్ సోకటానికి ప్రధాన కారణమేంటి

ఈ ప్రశ్న చూడటానికి సర్వ సాధారణంగా కనపడుతున్నా ఇంతే సాధారణంగా దీనికి సమాధానం చెప్పలేము, క్యాన్సర్ రావటానికి ఖచ్చితంగా ఎదో ఒక్కటే  కారణం చెప్పలేం, క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కొందరు వ్యాయామం చేస్తూ, సరైన ఆహారాన్నే తింటూ ఎలాంటి దురలవాట్లు లేకుండా సరైన జీవనశైలిని అనుసరిస్తున్న వారు కూడా ఉన్నారు. అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చినట్లయితే వీరందరికీ ఎందుకు వచ్చినట్లు? ఇలా క్యాన్సర్ చుట్టూ ఎన్నో ప్రశ్నలు.. వాటి సమాధానాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

క్యాన్సర్ ఎందుకు వస్తుంది ?

మన శరీరంలో రోజూ కొన్ని మిలియన్ల సార్లు కణాలు విభజించబడి కొత్త కణాలు సృష్టించబడుతుంటాయి. ఇన్ని సార్లు జరిగే ఈ ప్రక్రియలో సాధారణంగా ఏ కారణం లేకుండా కొన్ని తప్పిదాలు జరగడం సహజమే. అలంటి అకారణంగా జరిగే తప్పిదాలు కూడా క్యాన్సర్ కు కారణంగా మారతాయి. రెండు లో మూడో వంతు క్యాన్సర్లు ఇలాంటి అకారణంగా జరిగే తప్పిదాల వల్లే అవుతున్నాయట. ఇలా క్యాన్సర్ సోకితే దీనిలో జన్యుపరమైన కారణం కాని, మానవ తప్పిదం కాని లేనట్టే.

ఇక మరో కారణం మన జీవన విధానం, మన అలవాట్లు. మద్యపానం ధూమపానం వల్ల కావచ్చు, ఎక్కువగా ఎండలో తిరగటం వల్ల కావచ్చు, క్యార్సినోజేన్స్ ఉన్న కెమికల్ వాతావరణం లో ఉండటం వల్ల కావచ్చు అలాగే ఆహార అలవాట్ల వల్ల కావచ్చు … ఇలా ఏదైనా స్వయంకృత అపరాధాల వల్ల క్యానర్ రావచ్చు.

ఇక మూడో కారణం పుట్టుకతో జన్యుపరమైన కారణాలు అంటే కుటుంబ చరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ కుటుంబంలో ఉన్న తరువాతి తరాలకు ఆ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవ్వటం అలాగే  క్యాన్సర్ సోకటం జరగవచ్చు.

దీనిని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకు ఒక టైప్ రైటర్ కీబోర్డు పై రోజూ కొన్ని వందల అక్షరాలను పదాలుగా,వాక్యాలుగా అర్థం వచ్చేటట్టు టైప్ చేయాలి. ఎంత మంచి టైపిస్ట్ అయినా రోజు మొత్తంలో ఒకటో రెండో చిన్న చిన్న మిస్టేక్స్ రాకుండా అయితే మానవు కదా.. అలాగే అకారణంగా కణాల విభజనలో జరిగే  తప్పిదాల వల్ల క్యాన్సర్ రావచ్చు. ఇక అదే టైప్ రైటర్ తనకు ఉన్న చెడు అలవాట్ల వల్ల మరీ బలహీనంగా ఉండి సరిగ్గా ఫోకస్ చేయలేకపోతే అప్పుడు ఇంకా మరిన్ని  ఎక్కువ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది కదా.. అలా చెడు  అలవాట్ల వల్ల క్యాన్సర్ రిస్క్ మరింత పెరగొచ్చు.ఇక పొరపాటున ఆ కీబోర్డ్ లో ఒక కీ పని చేయలేదు అనుకోండి, ఎంత సరిగ్గా టైప్ చేసినా ఎదో ఒక మిస్టేక్ అవుతుంది కదా. .అలా కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్యాన్క్రియటిక్  క్యాన్సర్ నే తీసుకుందాం,75 శాతం ఈ క్యాన్సర్ రిస్క్ అకారణంగా కణాల విభజనలో జరిగే తప్పిదాల వల్లే అవుతుంది, ఇక చెడు అలవాట్ల వల్ల ఆ రిస్క్ మరో 20 శాతం పెరుగుతుంది, అదే జన్యుపరమైన కారణాలు కూడా తోడైతే మరో 5 శాతం కూడా రిస్క్ పెరిగి త్వరగా క్యాన్సర్ కు దారి తీస్తుంది.

క్యాన్సర్ ఎలా వస్తుంది?

మన శరీరం లో ఎన్నో బిలియన్ల సెల్స్ మన శరీరంలో వాటి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాయి.

 అందులో  కొన్ని కణాలు తమ సాధారణ నియంత్రణ కోల్పోయి, ఎలాంటి నియంత్రణ లేకుండా అధిక సంఖ్యలో పెరగటం మొదలుపెడతాయి. అలా పెరిగిన కణాలు ఒకే దగ్గర ట్యూమర్ గా ఏర్పడతాయి. ఇక ఈ ట్యూమర్ ఎప్పుడైతే పెరుగుతూ ఇతర అవయవాలకు కూడా స్ప్రెడ్ అవుతుందో అది క్యాన్సర్ గా పరిగణించబడుతుంది. ఈ ట్యూమర్ ఒక టిష్యూ నుండి మరో టిష్యూ వరకు స్ప్రెడ్ అవ్వటం, ఒక నాళం నుండి మరో నాళానికి వెళ్ళడం, ఇలా శరీరంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించి మరింత ప్రమాదకరంగా మారుతుంది. క్యాన్సర్ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు ఎందుకంటే కణాలు శరీరంలో ప్రతీ ప్రదేశంలోనూ ఉంటాయి, ఒక మనిషికి వచ్చిన క్యాన్సర్ మరో మనిషికి వచ్చిన క్యాన్సర్ ఒకే చోటున ఉన్నా ఒకేలా స్పందించకపోవచ్చు, అందుకనే క్యాన్సర్ ను అంచనా వేయటం కష్టమవుతుంది. 

క్యాన్సర్ ను పూర్తిగా నివారించగలమా?

ఇదే ప్రశ్న అయితే సమాధానం నివారించలేము అనే పరిశోధకులు చెబుతున్నారు. నిపుణులు చెప్పేదేమిటంటే క్యాన్సర్ల లో30 శాతం క్యాన్సర్ లను నివారించగలం. మరో 30 శాతం క్యాన్సర్ లను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తో నయం చేసుకోగలం. మరో 30 శాతం క్యాన్సర్ లను తీవ్రమైన దశలో గుర్తిస్తే జీవిత కాలాన్ని పోడిగించగలమట . కానీ ఇందులో మన చేతిలో ఉన్నది మనం చేయగలిగినది ఏంటి అంటే నివారణ మాత్రమే! మరి క్యాన్సర్ ను  నివారించాలంటే మనం ఎం చేయాలి?

దీనికి సమాధానం ఏంటంటే మద్యపానం,ధూమపానం పూర్తిగా మానేయాలి, అలాగే సరైన ఆహార అలవాట్లను అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అలాంటి  జీవన విధానాన్ని అలవరచుకోవాలి.

ఒకవేళ ఏ కారణంగా అయిన క్యాన్సర్ సోకితే ఎం చేయాలి?

క్యాన్సర్ నిర్ధారణ అయింది అంటే ముందు వదిలి పెట్టాల్సినవి భయాలు,అపోహలు. ఇవి మనిషిని మానసికంగా మరింత బలహీనంగా చేస్తాయి. అందుకని ప్రతీ ఒక్కారికి క్యాన్సర్ పై అవగాహన అవసరం. అవగాహన లేనిపోని భయాలను తొలగించి ఒక స్పష్టత ను ఇస్తుంది.

క్యాన్సర్ నిర్ధారణ తరువాత ఆ క్యాన్సర్ తీవ్రత మరియు వ్యక్తీ రోగనిరోధక శక్తి చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయి, చికిత్స ఎంత బాగా పనిచేస్తున్నా క్యాన్సర్ ను నయం చేసుకోగాలమనే మానసిక ధృడత్వం చాలా అవసరం. ఎందుకంటే క్యాన్సర్ తో ప్రయాణం అంత సులువుగా ఉండకపోవచ్చు. అయినా ధైర్యంగా ఉన్న వాళ్ళే క్యాన్సర్ ను జయించగలరు.

ఇక క్యాన్సర్ కు అల్లోపతిలో చికిత్సలు ఎన్నో ఉన్నాయి, వాటికి కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి మరి ఎలాంటి దుష్ప్రభావాలు లేని చికిత్స ఏదైనా ఉందా అంటే అదే ఆయుర్వేద చికిత్స.

ఈ ఆయుర్వేద చికిత్సను క్యాన్సర్ ను తగ్గించుకోవటానికి లేదా ఒక వేల అల్లోపతి చికిత్స తీసుకుంటున్నా సరే ఆ దుష్ప్రభావాలను తగ్గించి మరింత త్వరగా ఫలితం పొందడానికి సహాయపడుతుంది.క్యాన్సర్ కు రసాయన ఆయుర్వేదం సహాయంతో చికిత్స అందిస్తూ 

పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఇప్పటికే ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు క్యాన్సర్ ఉపసమానాన్ని అందించి, మరెందరికో క్యాన్సర్‌ను జయించగలమని అనే ధైర్యాన్ని అందిస్తూ ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. సరైన సమయానికి సరైన చికిత్స అనేది క్యాన్సర్‌ను నయం చేయగలదన్న విషయాన్ని మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలినే ఎప్పుడూ ఎంచుకోండి.

Also read: ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్సా విధానాలు

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.