రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ కణాలపై ఎలా పోరాడుతుంది?

You are currently viewing రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ కణాలపై ఎలా పోరాడుతుంది?

క్యాన్సర్ కణాల వ్యవహార శైలి సాధారణ కణాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. రసాయన ఆయుర్వేదం మొదటగా శరీరంలో దెబ్బతిన్న రక్షణ వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది. రోగనిరోధక శక్తి బలోపేతమైన తర్వాత ప్రభావవంతమైన రాసౌషధాలు, శక్తివంతమైన పాషాణాలు ప్రయోగించడం ద్వారా క్యాన్సర్ కణాలు మరోచోటకి వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడమే కాకుండా వాటిని నాశనం చేస్తుంది రసాయన ఆయుర్వేదం.

వాస్తవానికి మన శరీరంలోనికి ఎటువంటి కొత్త కణాలు ప్రవేశించినా ఇట్టే పసిగడుతుంది యాంటీ బాడీల రూపంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ. శరీరమంతా కళ్ళు చేసుకుని మరీ రక్షణ కల్పించే, అంతటి బలమైన వ్యవస్థని సైతం అస్తవ్యస్తం చేస్తాయి క్యాన్సర్ కణాలు. ఈ కణాలు సహజంగా తమ జ్ఞాపక శక్తిని కోల్పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటాయి. వాటంతటవే సెల్ఫ్ సిగ్నలింగ్ వ్యవస్థని ఏర్పరచుకుని శరీరం వాటిని నియంత్రించే అవకాశమివ్వకుండా అవే శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. క్యాన్సర్ వ్యాధి ప్రధానంగా శరీర రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి ఆ తర్వాత మ్యుటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. ఒక్క కణంతో మొదలైన ఈ కణాల విభజన అంతకంతకూ పెంచుకుంటూపోయి పెద్ద పెద్ద గడ్డలుగా ఏర్పడుతుంటాయి.

క్యాన్సర్ కణాలను నియంత్రించాలంటే మొదట అవి వేరే చోటకి వ్యాప్తి చెందకుండా చూడాలి. అతలాకతలమైన రోగనిరోధక వ్యవస్థని పునర్నిర్మించాలి. చివరిగా క్యాన్సర్ కణాలను నాశనం చెయ్యాలి. ఇలా శరీరంలోని దెబ్బతిన్న మెటబాలిజాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. రసాయన ఆయుర్వేదం ప్రధానంగా ఇదే శైలిలో పనిచేసి క్యాన్సర్ కణాల పని పడుతుంది.

Also Read: రసాయన ఆయుర్వేద చికిత్సకు సాధారణ ఆయుర్వేద చికిత్సకు వ్యత్యాసం ఏమిటి?