హలో మై డియర్ హెల్త్ లవర్స్,
టైటిల్ చూసి కన్ఫ్యూస్ అవ్వకండి, పూర్తిగా చదివితే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.
కానీ ఈ మిరప మన దేశంలోకి పదహారో శతాబ్దం తరువాత విదేశీయులు తీసుకొచ్చి, మనకు అలవాటు చేసారు. అంతకు ముందు వరకు మన దేశంలో కారం కోసం మిరపకాయలను ఉపయోగించకుండానే కారం రుచి చూసే వాళ్ళు. అల్లం, మిరియాలు, శొంటి వంటివి కారం కోసం ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడేమో ఆసియాలో అతిపెద్ద మిరపకాయల మార్కెట్ మన గుంటూరు లోనే ఉండేంత స్థాయిలో మనం ఆ మిరప కారానికి అలవాటు పడిపోయాం. కానీ అది నిజానికి మన ఆరోగ్యానికి మంచిది కాదు.
అసలు మిరప కారం మన ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు?
అలాగే మిగతా కారాల వల్ల మనకు ఒరిగే లాభాలేంటి? అనే విషయాల గురించి ఈ విడియోలో మనం మాట్లాడదాం.
ఆయుర్వేదం ప్రకారం కారం అంటే శొంటి, చేదు అంటే వేప.
మిరప కారం ఊసేక్కడా లేదు. మనం మిరప మినహా ఇతర వాటితో కారం మితంగా రుచి చూసే సమయంలో ఆ కారం మన ఆరోగ్యానికి మంచి చేసేది. ఇప్పుడు ఈ మిరప కారం వచ్చాక మిగతా రుచులపై కూడా ఇదే ఆధిపత్యం చలాయించెంతలా మన జీవితంలో భాగమైంది. అందుకని ఇప్పుడు మనం తినే కారం వల్ల ఉపకారం కన్నా జరిగే అపకారమే ఎక్కువ.
మనం శొంటి, మిరియాలు వాటి వంటి తో కారం రుచి చూసే కాలంలో మనకు కారం వల్ల కలిగే ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కారపు రుచి మన నోటిలో ఉండే మలినాన్ని శుభ్రం చేయటంతో పాటూ మన జీర్ణ శక్తిని కూడా పెంపొందిస్తుందట. మన ఇంద్రియాలన్నిటి లోని మలినాలను ఈ కారం రుచి బయటకు పంపించేలా చేస్తుందట. అలాగే చెమట ను తగ్గించడం, ప్రేగుల్లో క్రిముల్ని పోగొట్టడంలో కూడా ఈ రకమైన కారం సహాయపడుతుంది. ఇంకా ఈ కారపు రుచి గొంతు వ్యాధులలో మంచి ప్రభావం చూపగలదని అష్టాంగ హృదయంలో రాయబడింది. మిరప రాక ముందు మనం తిన్న కారం మనకు ఇంత మంచిని చేసేది.
అదే ఇప్పుడు మనం తినే కారం పరిస్థితి ఏంటో చూద్దాం.
తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు రుచులకంటే ఎక్కువగా ఆహారంలో మిరపకారం తినడం అలవాటు చేసుకున్నప్పటి నుండి మన ఆరోగ్యానికి కారం చెడు చేయడం మొదలుపెట్టింది. దీని వల్ల కలిగే సమస్యలేంటంటే, ఇది ఎక్కువగా తిన్నప్పుడు శరీరం అంతా మంటగా అనిపించవచ్చు. ఈ కారం ఎక్కువగా తిన్నప్పుడు మన కంటి లోపల ఉండే లిట్రియస్ ద్రవంలో ఉద్రేక పరిస్థితి ఏర్పడుతుందట. దాని వల్ల కళ్ళు చీకట్లు కమ్మడం వంటివి అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ కారం వాత దోషాన్ని, వేడిని సమానంగా మన శరీరంలో పంచుతుంది కాబట్టి, ఇది అధికంగా తినడం వల్ల అన్ని అవయవాల్లోనూ నొప్పి, మంట వంటి లక్షణాలు ఏర్పడే అవకాశం ఉందట. ఇలాంటి చాలా సమస్యలే మిరప కారం ఎక్కువగా తినడం వల్ల కలిగే అవకాశం ఉంది.
మరో విషయం, మిరప కాకుండా ఇతర వాటితో చేసిన కారం వల్ల నష్టాలేవీ లేవా అంటే, మితంగా తింటే నష్టం జరగదు. ఏదైనా మితి మీరనంత వరకే ఔషధం. వీలైనంతవరకు ఈ మిరప కారాన్ని రీప్లేస్ చేయడానికి ప్రయత్నించండి, లేదా తినడం కొంచెం తగ్గించండి. అలాగే ఆరోగ్యం కోసం ఆరు రుచులను మీ రోజు ఆహారంలో సమతుల్యంగా ఉండేలా ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.సెలవు.
Also Read: మెరిసే చర్మం కోసం మెరుగైన చిట్కాలు