మనం ఎం ఆలోచిస్తామో అదే మనం, మనం మన ఆలోచనలతో మొదలవుతాం,
మన ఆలోచనలతోనే మన ప్రపంచాన్ని సృష్టించుకుంటాం అని గౌతమ బుద్ధుడు అన్నాడట.
మన ఆలోచనలు మనం ఏం మాట్లాడాలో నిర్ణయిస్తాయి,
మన మాటలు మనం ఎం చేయాలో నిర్ణయిస్తాయి,
మన చేతలే మన అలవాట్లవుతాయి, మన అలవాట్లే మన జీవన విధానాన్ని నిర్ణయిస్తాయి..
ఈ మాటలు భగవద్గీతలోనివి.
మరి మనకు తెలిసింది ఏమిటంటే మన జీవన విధానమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అని.
ఆ జీవన విధానం మన ఆలోచనలతో మొదలయ్యింది అని అర్ధం చేసుకోగలిగితే..
మన ఆరోగ్య సమస్యలను తగ్గించటానికి కూడా ఆలోచనలు ఉపయోగపడతాయట..
వెస్తెర్న్ కంట్రీస్ లో మైండ్ బాడి కనెక్షన్ అని దీనిని పిలుస్తారు, ప్లాసిబో ఎఫెక్ట్ అని కూడా అంటున్నారు.
ఒక చిన్న ఉదాహరణ చూసినట్లైతే ఒక దేశంలో పది మందికి ఆర్థరైటిస్ సమస్య వల్ల మోకాళ్ళ నొప్పులు ఉంటె అందరికీ సర్జరీ చేసారట, కానీ నిజానికి ఆ పది మందిలో ఇద్దరికీ మాత్రమే సర్జరీ చేసి మిగతా ఎనిమిది మందికి సర్జరీ చేయకుండానే చేసినట్లు నమ్మించి కేవలం చిన్నగా కట్ చెసి కట్టు పంపించేసారట. ఆ తరువాత వీరిని కొన్ని నెలలు పరిశీలిస్తే సర్జరీ జరిగిన వారికంటే సర్జరీ జరిగినట్లు నమ్మకంతో ఉన్న వాళ్ళే కీళ్ళ నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారట.
ఇదే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. మన ఆలోచనల బలం మనం అర్థం చేసుకొని, వాటిని సరైన దారిలో పెట్టగలిగితే జీవితాలను అధ్బుతాలను చూడవచ్చు.
అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి?
ఎం జరిగినా అంతా మన మంచికే అని సర్దుకుపోవాలా?
లేక గాయమైన సరే బాధపడకుండా బతకాలా?
ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో సందేహం..వాటి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
పాజిటివ్ థింకింగ్ అంటే ఏ సమస్యనైనా, ఏ పరిస్థితినైనా ముందు యాక్సెప్ట్ చేసి తరువాత ఎం చేయగలమో ఆలోచించి, సానుకూలంగా ఆ సమస్యను డీల్ చేయటం, సింపుల్ గా చెప్పాలంటే ప్రతీ సమస్యకు సమాధానం ఉంటుంది, అయినా కంగారు పడతాం, భయపడతాం, బాధ కూడా అనుభవిస్తాం..
కానీ చివరికి దాని పరిష్కారమైనా కనిపెట్టేది మనమే.. దాని పర్యవసనాలైనా అనుభవించాల్సింది మనమే.. అలాంటప్పుడు మరి ఆ భయం, కంగారు,బాధ దేనికి..
వాటిని దూరం చేసుకోగలిగితే స్ట్రెస్ అనేది మన దరి చేరదు, ఆ స్ట్రెస్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అలాగే ఇప్పటికే ఉన్న సమస్యలు తీవ్రమవుతున్నాయి. పాజిటివ్ గా ఆలోచించటం అలవాటు చేసుకోగలిగితే వీటిని దూరంచేసి ఆనందంగా, ప్రశాంతంగా అలాగే ఆరోగ్యంగా ఉండగలం.
ఈ పాజిటివ్ థింకింగ్ ఎలా అలవాటు చేసుకోవాలి.
- నిద్ర లేచిన తరువాత మీ రోజును ఆనందంగా కృతజ్ఞతతో మొదలు పెట్టండి, ఉదయం లేవగానే మొహం పై ఒక చిన్న చిరునవ్వు ఉంటే అప్పుడే మెదడులో చాల వరకు స్ట్రెస్ లెవల్ తగ్గిపోతుంది. ఉదయం పాటించే దినచర్య మీకు నచ్చేలా ఎంచుకోండి, వ్యాయామమైనా, యోగా అయినా, ధ్యానం అయినా, వాకింగ్ అయినా ఆనందంగా చేయండి. చేసే పనిని బరువు గా ఫీల్ అవ్వకండి.
- ఉదయం లేవగానే నీళ్ళు తాగండి,ఇది కూడా మీ స్ట్రెస్ లెవల్ ని తగ్గిస్తుందట. రోజూ ఒకే రెగ్యులర్ ప్లాన్ కి ఫిక్స్ అవ్వండి అది మెంటల్ హెల్త్ ను మరింత మెరుగు చేస్తుంది. ఒక ఫిట్ నెస్ రొటీన్ అనేది ఫాలో అవ్వండి.
- జీవితంలో జరిగే ప్రతీ చిన్న మంచి విషయానికి కృతజ్ఞత తో ఉండండి, వీలయితే ఒక గ్రాటిట్యుడ్ నోట్స్ పెట్టుకొని అందులో మీరు జీవితంలో జరిగే మంచి విషయాలన్నిటికీ థ్యాంక్ యు లెటర్ రాయండి.
- ఒత్తిడిలో ఉన్నా కూడా ధైర్యంగా మాట్లాడటానికి ప్రయత్నించండి, కాన్ఫిడెన్స్ తో మాట్లాడితే స్ట్రెస్ దూరమైపోతుంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి.
- ఎప్పుడూ నెగిటివ్ విషయాలు మనను ట్రిగ్గర్ చేసి స్ట్రెస్ ను ఇస్తుంటాయి, అలంటి చెడు విషయాలు గతంలో జరిగుంటే వాటిని మళ్ళీ మళ్ళీ తలచుకోకండి, మీరు ఆనందంగా ఉన్న క్షణాలను తలచుకుంటే తెలియకుండానే స్ట్రెస్ తగ్గి జీవితం పాజిటివ్ గా మారుతుంది.
- మీతో మీరు మాట్లాడుకోండి, మిమల్ని మీరు ప్రేమించండి. అప్పుడే మానసికంగా ప్రశాంతంగా ఉండగలరు. అలాగే జరిగిన చెడు అనుభవాలను గాయాలుగా కాకుండా పాఠాలుగా తీసుకోండి.మిమ్మల్ని మీరు నమ్మండి. పాజిటివ్ గా ఆలోచిస్తే ఏదీ మీకు బరువుగా అనిపించదు.
- చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోండి, ఎవరికైనా సహాయం చేయండి, లేదా ఇన్స్పైర్ చేసే పాటలు వినండి,మీ స్నేహితులతో ఆనందంగా గడపండి. ఇవన్నీ మీ పాజిటివ్ లైఫ్ ను మరింత ఆనందంగా ఉండటానికి సహాయపడతాయి.
ఆరోగ్యం విషయంలో పాజిటివ్ థింకింగ్ ఎలా పని చేస్తుందంటే..
ఇప్పటిదాకా చేసిన చాలా పరిశోధనలు పాజిటివ్ థింకింగ్ వల్ల వాళ్ళ ఆరోగ్య సమస్యల్లో మంచి పురోగతి కనిపించిందని చెబుతున్నాయి, క్యాన్సర్ విషయంలో కూడా దిగులుగా భయంగా ఉండి నెగిటివ్ గా ఆలోచించే వారికంటే పాజిటివ్ గా నిజాన్ని యాక్సెప్ట్ చేసి బ్రతుకుతున్న వాళ్ళలో రికవరీ శాతం పెరిగిందట. అలాగే ఈ విధమైన జీవన శైలిని అలవారచుకోవటం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో ఉపశమనం పొందిన వారు కూడా ఉన్నారు.
క్యాన్సర్ నిర్ధారణ అనేది ఎవరికైనా చాలా బాధాకరమైన విషయమే, క్యాన్సర్ తో ప్రయాణం అంత సులువు కాదు కానీ ఆ ప్రయాణంలో బాధలో, డిప్రెషన్ లోకి వెళ్లి నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉండే వాళ్ళలో క్యాన్సర్ మరింత పెరిగిందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యాన్సర్ లాంటి వ్యాధినే పాజిటివ్ మైండ్ ప్రభావితం చేయగలిగిందంటే, మన ఆలోచనలకు ఉన్న శక్తి ఎంత బలమైనదో మీరే అర్థం చేసుకోవాలి.
ఈ పాజిటివ్ మైండ్ కావాలంటే ముందు చేయాల్సింది నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టాలి.
- అది సాధ్యపడటానికి కొన్ని దారులు ఉన్నాయి అందులో ముందుగా చేయాల్సింది ఏమిటంటే మీకు కంగారుగా, ఒత్తిడిగా, భయంగా అనిపించినప్పుడు వెంటనే ఏ నిర్ణయం తీసుకోకుండా కొద్ది సేపు ఏమి చేయకుండా ఆగండి, మీ ఐదు సెన్సెస్ ను ప్రశాంతంగా ఉంచండి.
- తరువాత మీ నెగిటివ్ ఆలోచనలని గుర్తించి యాక్సెప్ట్ చేయండి. వాటిని పాజిటివ్ ఆలోచనలతో రీప్లేస్ చేయండి. ఒక వేళ మేరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నట్లు మీరే ఒప్పుకోకపోతే పాజిటివ్ గా మారటం కష్టం. ముందు నిజాన్ని ఒప్పుకోవాలి,తరువాతే వాటిని రెప్లేస్ చేసి మైండ్ ని పాజిటివ్ గా మార్చుకోగలం.
- మెడిటేషన్ కూడా ప్రశాంతతకు సహాయపడుతుంది, ధ్యానం అలవాటు చేసుకోండి. ఈ విధంగా జీవితంలో పాజిటివిటీ ని భాగం చేసుకోండి.
చివరగా, చెప్పేదేమిటంటే నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి పాజిటివ్ గా ఆలోచిస్తూ ప్రస్తుతం లోనే బ్రతుకుతూ జీవన శైలిని సరైన దారిలో మలచుకుంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలం. మన మనసు మన శరీరాన్ని కూడా క్యూర్ చేయగలదు అనే సంగతి గుర్తుంచుకొని నడచుకొండి.
references
Https://Www.Verywellmind.Com/How-To-Change-Negative-Thinking-3024843
Https://Www.Wikihow.Com/Train-Your-Mind-To-Be-Positive
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.