ఈ రసాయన ఆయుర్వేద చికిత్స అన్ని రకాల క్యాన్సర్ల పై పని చేస్తుందా?

You are currently viewing ఈ రసాయన ఆయుర్వేద చికిత్స అన్ని రకాల క్యాన్సర్ల పై పని చేస్తుందా?

ఆయుర్వేదంలోని అష్టాంగయోగాలలో ఒకటైన రసాయన ఆయుర్వేదం అన్నిరకాల అర్భుదరాశులను హరించడంలో నిర్దిష్టమైన విధానాన్ని ఆచరిస్తూ ఉంటుంది. అర్బుదాలు ఎలాగైతే దశలు మార్చుకుంటూ పరిపక్వత చెందుతూ ఉంటాయో రసాయన ఆయుర్వేదం కూడా అదే విధంగా అర్బుదాలను దశలవారీగా వెనక్కు పంపుతూ ఉంటాయి. జీవక్రియ దెబ్బతినడం వలన పెరిగిన అసంబద్ధమైన కణాలు ఇతర కణాలను ప్రభావితం చేయకుండా అడ్డుకుంటూ వీటి సంఖ్య పెరగకుండా నియంత్రిస్తుంది. వ్యాధిక్షమత్వ గుణానికి ఊతంగా నిలిచి క్యాన్సర్లను తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.

క్యాన్సర్లలో ప్రస్తుతానికైతే శతాధిక సంఖ్యలో క్యాన్సర్లు మనుగడలో ఉన్నాయి. అవయవాలను ఆధారం చేసుకుని వీటిని వర్గీకరించడం జరిగింది. సులువుగా గుర్తించడానికి మాత్రమే క్యాన్సర్లకు పేర్లు పెట్టడం జరిగింది కానీ ఆయుర్వేద పరిభాషలో వీటిని అర్బుదాలు, గండమాలలు, రాచపుండ్లు అని గుర్తిస్తుంటారు. ఎలాంటి క్యాన్సర్ అయినా వాటిని ఆయుర్వేదం అసంబద్ధమైన కణాల సమూహమన్న దృష్టితోనే చూస్తుంది. కార్యాచరణ దృష్ట్యా ఆయుర్వేదం క్యాన్సర్లను ఒక్కటే దృక్కోణంలో చూస్తూ ఉంటుంది. ఏ అవయవంలో పుట్టినా క్యాన్సర్ కణాల స్వభావం ఒక్కటే రేటిగా ఉంటున్నది కాబట్టి స్వభావసిద్ధంగా చికిత్స అందిస్తుంది రసాయన ఆయుర్వేదం. అన్ని రకాల క్యాన్సర్లకు ఇదే పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తుంది.

పేరు మోసిన క్యాన్సర్ ట్రీట్మెంట్లలో సక్సెస్ రేటు చూస్తే కనీస స్థాయిలో ఉంది. కాబట్టే అత్యధిక క్యాన్సర్ బాధితులు ప్రత్మామ్నయ ట్రీట్మెంట్ల వైపు మళ్ళుతున్నారు. ట్రీట్మెంట్ సంగతి ఎలా ఉన్నా వాటి వలన కలిగే దుష్ప్రభావాలను నియంత్రించడంలో అవి దారుణంగా విఫలమయ్యాయి. కానీ క్యాన్సర్ కణాలను నియంత్రిస్తూనే వాటి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా అరికట్టడంలో రసాయన ఆయుర్వేదం కంటే అత్యుత్తమ వైద్యం మరొకటి లేదని తరాలుగా నిరూపితమవుతూనే ఉంది. కేవలం వ్యాధి తగ్గడమే కాదు అది పునరావృతం కాకుండా చూడటంలో కూడా రసాయన ఆయుర్వేదానికి ఉన్న విశ్వసనీత అనితరసాధ్యమైనది.

ఇది కూడా చదవండి: క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంటే రసాయన ఆయుర్వేదం ఫలితం చూపిస్తుందా?

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.