మారుతున్న కాలంలో మారుతున్న ఆహార అలవాట్ల వల్ల కావచ్చు, మారుతున్న జీవనశైలి వల్ల కావచ్చు నలభై సంవత్సరాల వయసు వాళ్లకు కూడా హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతూ వస్తుంది. ఇలాంటి సమయంలో గుండె సంబంధిత సమస్యలను నివారించటానికి సరైన ఆహరం ఎంతగానో అవసరం.
హార్ట్ అటాక్ ప్రమాదాన్ని నివారించటంలో సహాయపడే ఐదు సూపర్ ఫుడ్స్
1.ఓట్స్
ఓట్స్ లో అవెనాంత్రమైడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్లను నిరోధించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఓట్స్ సహాయపడుతుంది. అధిక మొత్తం మరియు చెడు కొలెస్ట్రాల్ తో సహా అథెరోస్క్లెరోసిస్ కు ప్రమాద కారకాలను తగ్గించడానికి ఓట్స్ సహాయపడతాయి.
ఓట్స్ లో ఫైబర్ ఉండటంవల్ల రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
గుండె రోగులకు అల్పాహారం ఎంపికగా ఓట్స్ ను వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు.
హార్ట్ అటాక్స్ రిస్క్ తగ్గటానికి ఓట్స్ ఎలా సహాయపడతయంటే,
ముందు కొలెస్ట్రాల్ తగ్గించడం లో సహాయపడతాయి,
- ఓట్స్ లో బీటా-గ్లూకాన్ ఉంది, ఇది మొత్తం మరియు ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగల ఒక రకమైన కరిగే ఫైబర్. రోజుకు కనీసం 3 గ్రాముల ఓట్ బీటా-గ్లూకాన్ తినడం వల్ల ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ 10% వరకు తగ్గుతుందట అలాగే గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 20% వరకు ఇది తగ్గిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది.
- ఓట్స్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి,
ఓట్స్ లో అనావెంటహ్రామైడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి,
ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి మరియు గుండె ధమనులను రిలాక్స్ చేస్తాయి.
- ఓట్స్ వల్ల రక్తపోటు తగ్గుతుంది,
ఓట్స్ లో ఉండే అవెనెథ్రామైడ్లు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతాయి,
ఇది రక్తపోటును తక్కువగా ఉంచడానికి సహాయపడుతుంది.
2.పసుపు,
పసుపులో ఉండే కర్కుమిన్ చాలా ముఖ్యమైన ఔషధం. హార్ట్ ఆటాక్ కు దారి తీసే అథెరోస్క్లెరోసిస్ ను నివారించడానికి పసుపు సహాయపడుతుంది.
అలాగే ఇన్ఫ్లమేషన్ మరియు ఆక్సీకరణను తగ్గించడం,రక్త నాళాలను సడలించి రక్తపోటు తగ్గించడం
ఇంకా వాస్కులర్ కణజాలాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని రాకుండా చేస్తుంది.
పసుపు ఎంత మంచిదైనా అధికంగా తీసుకోకపోవటం మంచిది.
- ప్రతిరోజూ 8 గ్రాముల కర్కుమిన్ అందించే పసుపు ఉత్పత్తులు 2 నెలల వరకు ఉపయోగించవచ్చు.
- ప్రతిరోజూ 3 గ్రాముల పసుపు తీసుకున్నట్లయితే 3 నెలల వరకు ఉపయోగించవచ్చు
. దీర్ఘ కాలం అధిక మోతాదులో పసుపు సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అయ్యే అవకాశం ఉంది.
3.వెల్లుల్లి
వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ తో సహా సల్ఫర్ సమ్మేళనాలు రక్త ప్రవాహాన్ని మరియు రక్తపోటును తగ్గించగలవు. అందువల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.
వెల్లుల్లి అధికంగా తీసుకున్నప్పుడు రక్తపోటును తగ్గించడంపై ప్రభావాన్ని చూపిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. రక్తపోటులో ఈ మార్పు గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 16-40% తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి ఎలా సహాయపడుతుందంటే,
- కొలెస్ట్రాల్ తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది, వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంది, ఇది చెడు కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను ఆపివేస్తుంది. వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినడం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- రక్త గడ్డకట్టడం విషయంలో కూడా వెల్లుల్లి ప్రభావం చూపగలదు,ఇంకా హృదయ స్పందన రేటును నియంత్రిస్తుంది.వెల్లుల్లి యాంటీ రిథమిక్ ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడింది, సక్రమంగా లేని హృదయ స్పందనలను వెల్లుల్లి సరిచేయగలదు.
4.ఫ్లాక్స్ సీడ్స్
అవిసేలు అని పిలవబడే ఫ్లాక్స్ సీడ్, ఫ్లాక్స్ ప్లాంట్ నుండి వచ్చింది మరియు 9000 BC నుండి మానవులు దీనిని వినియోగించినట్లు అంచనా వేయబడింది.ఇవి వగరు రుచితో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ఫ్లాక్స్ సీడ్ మీ గుండెకు చాలా రకాలుగా మంచిది, ఇందులో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, చేపలలో కనిపించే ముఖ్యమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉంటుంది. నిజానికి, ఇది ప్రామాణిక పాశ్చాత్య ఆహారంలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ యొక్క అత్యంత ఉత్తమమైన మూలం. ఇవి తీసుకున్నప్పుడు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఐకోసపెంటెనోయిక్ యాసిడ్ (EPA) మరియు డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్ (DHA) గా మార్చబడుతుంది, ఇవి గుండె జబ్బులతో పోరాడే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని తినటం వల్ల హార్ట్ అటాక్ ప్రమాదం తగ్గుతుందట.
5.పాలకూర
పాలకూర గా పిలుచుకునే స్పినాచ్ గుండె జబ్బులను నివారించడానికి సహాయపడే పోషకాలతో నిండి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం దెబ్బతిన్న హార్ట్ ని రిపేర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందట.
పాలకూర గుండె-ఆరోగ్యకరమైన సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడుతుంది. ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడే పోషకాలతో నిండి ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలపై కూడా మంచి ప్రభావం చూపగలదు.
- పాలకూర కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే రక్తపోటు తగ్గిస్తుంది,
- క్యాన్సర్‌ను కూడా పాలకూర నివారిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- పాలకూరలో కేల్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ మరియు విటమిన్ ఎ కలిగి ఉంటుంది ఇంకా ఎక్కువ కాల్షియం మరియు ఐరన్ కంటెంట్ విటమిన్ K కూడా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
ఈ ఐదు సూపర్ ఫుడ్స్ లో హార్ట్ అటాక్ ప్రమాదం తగ్గించే అవకాశం ఉంది.