కీమోతేరపీతో పాటూ ఈ రసాయన ఆయుర్వేద చికిత్స తీసుకొని క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళెవరైనా ఉన్నారా?

You are currently viewing కీమోతేరపీతో పాటూ ఈ రసాయన ఆయుర్వేద చికిత్స తీసుకొని క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళెవరైనా ఉన్నారా?

రసాయన ఆయుర్వేద ట్రీట్మెంట్ విషయంలో చాలా మంది అలసత్వాని ప్రదర్శిస్తుంటారు కానీ చాలా వరకు మొండి క్యాన్సర్లకు ఇదే బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ముఖ్యంగా జటిలమైన అనేక క్యాన్సర్లు ఈ ట్రీట్మెంటుకు లొంగినంత సులువుగా మరే ఇతర ట్రీట్మెంట్లకు లొంగలేదు. కాబట్టి ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్లు తీసుకుంటున్నా కూడా వాటికి అనుపానంగానో సహపానంగానో రసాయన ఆయుర్వేదాన్ని వాడాలని సూచిస్తుంటారు వైద్యులు. కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎదురయ్యే దుష్ప్రభావాల నుండి కూడా రసాయన ఆయుర్వేదం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. అన్నిటినీ మించి బలహీనమవుతున్న వ్యాధినిరోధక శక్తికి ఊతమిచ్చి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది రసాయన ఆయుర్వేదం.

కీమోథెరపీలో భాగంగా శరీరంలో గడ్డలా ఏర్పడ్డ క్యాన్సర్ కణాలను చంపేందుకు ఒక డ్రగ్ కాంబినేషన్ తయారుచేసి శరీరంలోకి పంపుతారు. ఈ డ్రగ్ కాంబినేషన్ శరీరంలో అసాధారణంగా పెరిగే కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని చంపేస్తుంది. ఈ క్రమంలో ఈ మిశ్రమం యొక్క ప్రభావం ఆరోగ్యకరమైన కణాల మీద కూడా పడుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో క్యాన్సర్ కణాలకు కొత్త ఉత్సాహం వస్తుంది. రెట్టించిన వేగంతో అవి మళ్ళీ హెచ్చించుకుంటూ పోతాయి. ఇవన్నీ మళ్ళీ ఒకచోట చేరడంతో క్యాన్సర్ గడ్డల పరిమాణం పెరుగుతుంది. కీమోథెరపీ ప్రధాన కర్తవ్యమే క్యాన్సర్ కణాలపై నేరుగా పనిచేసి వాటిని నాశనం చెయ్యడం. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని అవి మళ్ళీ పెరుగుతుండడమే క్యాన్సర్లు పునరావృతం కావడానికి ప్రధాన కారణం.

కీమోథెరపీలో ఉన్న ప్రధాన డ్రాబ్యాక్ ఏమిటంటే అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవడమే. వీటిలో అన్నిటి కంటే ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు మూలమైన ఇమ్యునిటీ దెబ్బతినడం లేదా తెల్లరక్త కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ప్రధానమైనది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు పెరగడం లేదా కొత్త క్యాన్సర్ కణాలు పుట్టడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో వికారంగా ఉండడం, వాంతులు కావడం, తీవ్ర అలసట, స్వల్ప జ్వరం, నోటిపూత, జుట్టు రాలిపోవడం, చర్మం మరియు గోళ్ళలో మార్పులు, రుతుక్రమం ఆగిపోవడం వంటివి జరుగుతాయి. కీమోథెరపీ సమయంలో కలిగే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుండి ఉపశమనం కలిగిస్తూనే క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకుంటుంది రసాయన ఆయుర్వేదం.

Also read: రసాయన ఆయుర్వేదంలో క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పబడిందా?