క్యాన్సర్ లో జీన్ మ్యుటేషన్లు ఎలా సంభవిస్తాయి?

You are currently viewing క్యాన్సర్ లో జీన్ మ్యుటేషన్లు ఎలా సంభవిస్తాయి?

క్యాన్సర్ అనేది ర్యాండం మ్యుట్టేషన్ ద్వారా వచ్చే వ్యాధి అని పరిశోధకులలో ఒక విభాగం విశ్వసిస్తున్నారు. అయితే మ్యుటేషన్లే క్యాన్సర్ కు ఎలా కారణమవుతాయి మరియు దాని మెకానిజం మాత్రం ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.

సోమాటిక్ మ్యుటేషన్ సిద్ధాంతం ప్రకారం, క్యాన్సర్ కు దారితీసేది మన జీన్స్ లో జరిగే మ్యుటేషన్లే అని, ఆ మ్యుటేషన్లు ఎలా జరుగుతాయి అనే దానికి మాత్రం రెండు రకాలుగా చెప్పడం జరుగతుంది.

ఒకటి క్యాన్సర్ రావడానికి రెండు మ్యుటేషన్ల కలయిక అని మరియు మూడు లేదా నాలుగు మ్యుటేషన్లు కలిసి పనిచేయడం ద్వారా క్యాన్సర్ ఒక కణంలో అధికంగా పెరుగతుందని భావన.

క్యాన్సర్ ఎన్ని మ్యుటేషన్ల ద్వారా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకుంటే, ప్రతి క్యాన్సర్ కు సగటున పదకొండు మ్యుటేషన్లు అవసరమని పరిశోధకులు కనుగొన్నారు.

ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ టైప్-1కి పదకొండు మ్యుటేషన్లు, రొమ్ము క్యాన్సర్ టైప్-2కి పదకొండు వేర్వేరు మ్యుటేషన్లను కలిగి ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి ఒకే ప్రాంతంలోని వివిధ ట్యూమర్ల మ్యుటేషన్లు చాలా భిన్నంగా ఉంటాయని చెప్పారు.

క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ (TCGA) డేటా ప్రకారం చాలా క్యాన్సర్లకు యాభై నుండి ఎనభై మ్యుటేషన్లు కలిగి ఉంటాయని తెలుపుతున్నారు.

మ్యుటేషన్లు అనేవి రెండు రకాలు;

  • కార్సినోజెనిసిస్ కు దారితీసే మ్యుటేషన్లను డ్రైవర్ మ్యుటేషన్స్ (driver mutations) అని అంటారు.
  • ఎటువంటి ప్రభావం చూపలేని మ్యుటేషన్లను ప్యాసెంజర్ మ్యుటేషన్స్ (passenger mutations) అని అంటారు.

ఒక పరిశోధన నివేదిక ఆధారంగా, ప్రతి రొమ్ము లేదా పెద్దప్రేగు క్యాన్సర్ కు దాదాపు 13 డ్రైవర్ మ్యుటేషన్లు ఉన్నాయని గుర్తించబడింది, అయితే మెటాస్టాటిక్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు దాదాపు 49 మ్యుటేషన్లు అవసరం అని కూడా తేల్చడం జరిగింది.

మరొక అధ్యయనం ప్రకారం, వివిధ క్యాన్సర్లకు వేర్వేరు మ్యుటేషన్ కలిగి ఉంటాయని, మరి కొన్ని వాటికి అయితే మ్యుటేషన్లే ఉండవు అని కూడా తెలియజేసారు. మ్యుటేషన్లే ఎల్లప్పుడూ క్యాన్సర్ కు కారణమని తెలియచేసే సోమాటిక్ మ్యుటేషన్ సిద్ధాంతానికి ఇది ఒక లోపం.

క్యాన్సర్ కణాలు అసలు మానవ కణం యొక్క ప్రతిరూపాలు అయినప్పటికీ భిన్నంగా ప్రవర్తిస్తాయి. మెటాస్టాటిక్ క్యాన్సర్ కణాలు, అసలైన క్యాన్సర్ కణాలకు జన్యుపరంగా చాలా భిన్నంగా ఉంటాయి. వేరు వేరు ప్రదేశాలలో ఉన్న మెటాస్టాసిస్ క్యాన్సర్ కూడా ఇరవై లేదా అంతకంటే ఎక్కువ మ్యుటేషన్ల ద్వారా ఒకటికి, ఒకటి చాలా భిన్నంగా ఉంటుంది.

మన శరీరంలో సహజంగా జరిగే మ్యుటేషన్ల కన్నా క్యాన్సర్ ను తయారుచేసే మ్యుటేషన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కావున జీన్ మ్యుటేషన్ గల కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమని మనము తెలుసుకోవాలి. ఏ కారణాలు మానవ శరీరాన్ని ప్రభావితం చేసి క్యాన్సర్ ను అభివృద్ధి చేస్తుందో తెలుసుకుంటే అది క్యాన్సర్ కు సంరక్షణ అందించడంలో మంచి విధానం అవుతుంది.

Also read: క్యాన్సర్ పేషెంట్ జీవితకాలాన్ని నాలుగు రెట్లు పెంచగల వేగస్ నర్వ్.. మన శరీరానికి ఇంటర్నెట్ ప్రొవైడర్!

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.