లాభాపేక్షలేని సంస్థలు అనేవి సామాజిక శ్రేయస్సు, ప్రజా ప్రయోజనం మరియు నిర్దిష్ట సమస్యను పరిష్కరించడం కోసం అంకితభావంతో పని చేసే సంస్థలు. వీటినే ఇంగ్లీష్ లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైసేషన్స్ అని అంటారు. ఈ సంస్థలు తమ సొంత లాభాల కొరకు ఆశ పడవు. దాతల ద్వారా పొందిన నిధులను ఖర్చు చేసిన తరువాత, మిగిలిన వాటిని తమ మిషన్‌లో తిరిగి పెట్టుబడిగా పెడతాయి. ఇవి తరచుగా వైద్య, విద్యా, శాస్త్రీయ, మానవతా కార్యకలాపాల యొక్క రంగాలపై దృష్టి సారిస్తాయి. ఇవి తమ కార్యకలాపాలను కొనసాగించడానికి మరియు వారి లక్ష్యాన్ని చేరుకోడానికి విరాళాలు, గ్రాంట్లు మరియు దాతలు అందించే నిధులపై ఆధారపడతాయి. ముఖ్యంగా సామాజిక అవసరాలను తీర్చడంలో మరియు కమ్యూనిటీలను అభివృద్ధి చేయడంలో చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్ వ్యాధి యొక్క సవాళ్లను పరిష్కరించడంలో లాభాపేక్షలేని (నాన్ ప్రాఫిట్ ఆర్గనైసేషన్) సంస్థలు కీలక పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా వ్యాధి పట్ల అవగాహనను కల్పించడం, పరిశోధనలకు నిధులు సమకూర్చడం మరియు ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులకు మరియు కుటుంబాలకు సహాయాన్ని అందించడం వంటి లక్ష్యంతో నడుపబడతాయి.
క్యాన్సర్ సంక్షేమానికి లాభాపేక్షలేని సంస్థలు (నాన్ ప్రాఫిట్ఆర్గనైసేషన్) ఏ విధంగా సహకరిస్తాయి:
పరిశోధనల కొరకు నిధులు కేటయించడం:
క్యాన్సర్ బాధితుల సంక్షేమం కొరకు లాభాపేక్షలేని సంస్థలు అందించే ప్రాథమిక సహకారాలలో, పరిశోధన కోసం గణనీయమైన నిధులను అందించడం కూడా ఒకటి. ఈ సంస్థలు పొందిన గ్రాంట్లు, విరాళాలు మరియు నిధుల సేకరణ వంటి కార్యక్రమాల ద్వారా పొందిన నిధులను శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులకు ఈ వ్యాధిని అర్థం చేసుకోవడానికి, ఆధునిక సాంకేతిక చికిత్సలను అభివృద్ధి చేయడానికి మరియు నివారణను కనిపెట్టడానికి ఆ నిధులను ఖర్చు చేస్తాయి.
పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్‌లు:
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులు మరియు కుటుంబాలకు సహాయక సేవలను అందించడంలో ఈ సంస్థలు ఎల్లప్పుడూ చురుకుగా పాల్గొంటాయి. ఈ కార్యక్రమాలు బాధితుల యొక్క విభిన్న అవసరాలను తీరుస్తాయి. అనగా మానసిక సహాయం నుండి వైద్య ఖర్చుల యొక్క ఆర్థిక సహాయం వరకు ఇలా రకరకాల అవసరాలను తీరుస్తాయి.
లుకేమియా & లింఫోమా సొసైటీ మరియు లైవ్‌స్ట్రాంగ్ ఫౌండేషన్ వంటి సంస్థలు, కౌన్సెలింగ్, సపోర్ట్ గ్రూప్‌లు మరియు విద్యా వనరులతో సహా అనేక రకాల సేవలను అందిస్తాయి. కమ్యూనిటీ యొక్క భావాన్ని పెంపొందించడం మరియు ఆచరణాత్మక సహాయాన్ని అందించడం ద్వారా, ఈ లాభాపేక్ష రహిత సంస్థలు క్యాన్సర్ బాధితుల యొక్క పూర్తి శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడతాయి, రోగ నిర్ధారణ మరియు చికిత్సకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోడానికి సహయం చేయడంలో కూడా దోహదపడతాయి.
క్యాన్సర్ పట్ల అవగాహన ప్రచారాలు:
చాలా మందికి క్యాన్సర్ పట్ల అవగాహన ఎక్కువ ఉండదు. ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సను ప్రారంభిస్తే, మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. దీని కారణంగా శరీరంలో ఏర్పడే మార్పులని లేదా సంకేతాలను ముందస్తుగా గుర్తించగలిగే అవగాహనను అందరూ కలిగి ఉండటం చాలా అవసరం.
లాభాపేక్షలేని సంస్థలు చేసే ప్రయత్నాలలో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం అనేది మరొక కీలకమైన అంశం. ముందస్తుగా గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు ఎలాంటి మార్పులు చేసుకోవాలి మరియు వారికి అందుబాటులో ఉన్న సహాయక సేవల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సంస్థలు విస్తృతమైన అవగాహన ప్రచారాలను నిర్వహిస్తాయి. ఈ ప్రచారాలు కేవలం నివారణ చర్యలను ప్రోత్సహించడమే కాకుండా, వ్యాధి వల్ల కలిగే ప్రమాద అవకాశాలను కూడా తగ్గిస్తాయి.
విద్య వంతులను చేయడం:
క్యాన్సర్ నివారణ, ముందస్తుగా గుర్తించడం మరియు అందుబాటులో ఉన్న వనరుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సంస్థలు ఔట్ రీచ్ మరియు ఎడ్యుకేషన్ వంటి ప్రోగ్రామ్‌లలో చురుకుగా పాల్గొంటాయి.
అంతేకాకుండా ఇవి వ్యాధి యొక్క ప్రమాద కారకాలు, దాని లక్షణాలు మరియు అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ పద్ధతుల గురించి సమాచారాన్ని అందరికీ తెలియచేయడానికి వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు మరియు ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలను నిర్వహిస్తుంటాయి. ముఖ్యంగా ఇవి వీటిలో విభిన్న కమ్యూనిటీలను చేరుకోవడం ద్వారా అన్ని వర్గాల వారికి సమాచారం అందించబడుతుంది తద్వారా వారి ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు పాటించేలా వారిని సన్నద్ధం చేస్తాయి.
విధాన న్యాయవాదం (పాలసీ అడ్వకసి):
పాలసీ అడ్వకసి అంటే ప్రజా విధానాలకు మద్దతు ఇవ్వడానికి లేదా వ్యతిరేకించడానికి నిర్ణయాధికారులను ప్రభావితం చేసేటువంటి ప్రక్రియ.
భారతదేశంలో క్యాన్సర్ బాధిత సంక్షేమం కొరకు అంకితమైన ఈ సంస్థలు వ్యాధి నివారణ, చికిత్స మరియు వారికి అందించే సహాయంపై ప్రభావం చూపే పబ్లిక్ పాలసీలను ప్రభావితం చేయడంలో చురుకుగా పాల్గొంటాయి.
ఈ సంస్థలు నియంత్రణ చర్యల కోసం వాదించడానికి ప్రభుత్వ సంస్థలు, పాలసీ మేకర్స్ మరియు ఇతర వాటాదారులతో కలిసి పని చేస్తాయి. వారి పాలసీ అడ్వకేసీ ఇనిషియేటివ్‌లలో తరచుగా క్యాన్సర్ పరిశోధన కోసం నిధులను పెంచడం, అవగాహన మరియు ముందస్తుగా గుర్తించే కార్యక్రమాలను ప్రోత్సహించడం మరియు నాణ్యమైన సంరక్షణ సేవలను అందించడాటానికి కృషి చేస్తాయి. ముఖ్యంగా బాధితులు ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సవాళ్లను తగ్గించడం కోసం అలాగే అందుబాటు ధరలో ఉన్న చికిత్స ను ఎన్నుకోడానికి అట్టడుగు వర్గాలకు చెందిన వారికి సహాయపడతాయి. ఈ విధంగా ఇవి పనిచేయడం ద్వారా క్యాన్సర్ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాయి.
అంతర్జాతీయ సహకారం:
క్యాన్సర్ వ్యాధికి సరిహద్దులు ఉండవు. ఎందుకంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రబలుతుంది. ఈ వ్యాధి యొక్క ప్రపంచ భారాన్ని తగ్గించడానికి లాభాపేక్షలేని సంస్థలు అంతర్జాతీయ సహకారాలలో చురుకుగా పాల్గొంటాయి. ఈ సహకారంలో, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పరిశోధన, నివారణ మరియు చికిత్సను మెరుగుపరచడానికి అవసరమయ్యే వనరులు వీటిలో భాగమై ఉంటాయి. ఉదాహరణకు, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో ఉమ్మడి లక్ష్యాల కోసం పని చేయడానికి వివిధ దేశాల నుండి పరిశోధకులు, పాలసీ మేకర్స్ మరియు న్యాయవాదులను, ఈ సంస్థలు అన్నింటిని ఒకచోట చేరుస్తాయి. ఇటువంటి సహకారాల ద్వారా, క్యాన్సర్ యొక్క ప్రపంచ ప్రభావాన్ని విస్తృత స్థాయిలో తగ్గించడానికి సమిష్టి కృషికి ఇవి దోహదం చేస్తాయి.
ఇండియాలో క్యాన్సర్ సంక్షేమం కోసం పనిచేసే లాభాపేక్షలేని సంస్థలు:
భారతదేశంలోని అనేక లాభాపేక్షలేని సంస్థలు క్యాన్సర్ బాధితుల సంక్షేమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. పరిశోధన, బాధితులకి సహకారం, అవగాహన మరియు న్యాయవాదంతో సహా వ్యాధికి సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తాయి.
భారతదేశంలో క్యాన్సర్ సంక్షేమానికి అంకితమైన లాభాపేక్షలేని ప్రముఖ సంస్థలు:
క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ (CPAA):
CPAA అనేది ముంబైకి చెందిన ఒక సంస్థ, ఇది క్యాన్సర్ బాధితులకు సహాయం అందించడం కొరకు 1969 నుండి పని చేస్తోంది. ఇది బాధితులకు ఆర్థిక సహాయం, కౌన్సెలింగ్ సేవలు మరియు అవగాహన శిబిరాలను నిర్వహించడంపై దృష్టి సారిస్తుంది.
ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS):
ICS, అనేది 1951లో స్థాపించబడింది, ఇది దేశవ్యాప్తంగా క్యాన్సర్ నివారణ, ముందస్తుగా గుర్తించడంపై అవగాహన మరియు బాధితులకు సహాయం అందించడం వంటి వాటి కొరకు కృషి చేస్తాయి.
టెర్రీ ఫాక్స్ ఫౌండేషన్ ఇండియా:
టెర్రీ ఫాక్స్ యొక్క మారథాన్ ఆఫ్ హోప్ నుండి ప్రేరణ పొందిన ఈ ఫౌండేషన్ క్యాన్సర్ పరిశోధన కోసం నిధులను సేకరిస్తుంది. ఇవి పరిశోధన కార్యక్రమాలకు, క్యాన్సర్ అవగాహన కల్పించడానికి మరియు సహాయం అందించడానికి దేశ వ్యాప్తంగా వార్షిక “టెర్రీ ఫాక్స్ రన్” ను నిర్వహిస్తుంది.
కాన్ సపోర్ట్ (CanSupport):
ఢిల్లీలో ఉన్న CanSupport, అనే సంస్థ క్యాన్సర్ బాధితులకు మరియు వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించడం కోసం సహాయ సేవలను అందించడంపై దృష్టి సారిస్తుంది. ఇది డొమెస్టిక్ పాలియేటివ్ కేర్, కౌన్సెలింగ్ మరియు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తుంది.
ది మ్యాక్స్ ఫౌండేషన్:
ది మ్యాక్స్ ఫౌండేషన్ ను మాక్స్ యొక్క ఫ్రెండ్స్ స్థాపించారు. ఈ సంస్థ క్రానిక్ మైలోయిడ్ లుకేమియా (CML) వంటి అరుదైన బ్లడ్ క్యాన్సర్ ఉన్న బాధితులకు సహాయాన్ని అందించడం కోసం అంకితం చేయబడింది. ఇది బ్లడ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం మరియు సహాయం అందించడం కొరకు పనిచేస్తుంది.
Cankids…Kidscan:
Cankids అనేది భారతదేశంలో క్యాన్సర్ తో బాధపడే చిన్న పిల్లలో మార్పు కోసం పనిచేస్తున్న జాతీయ సంఘం. ఇది క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు మరియు వారి కుటుంబాలకు సంపూర్ణ సంరక్షణను అందించడానికి, ఆర్థిక సహాయం, భావోద్వేగ మద్దతు మరియు అవగాహన వంటి కార్యక్రమాలను అందించడానికి కృషి చేస్తుంది.
వి కేర్ ఫౌండేషన్:
ముంబైలో ఉన్న V కేర్ ఫౌండేషన్, క్యాన్సర్ పై అవగాహన మరియు బాధితుల సహాయార్థం కొరకు న్యాయవాదంపై దృష్టి పెడుతుంది. ఇది పాఠశాలలు మరియు ఇతర సంఘాలలో, ఆర్థిక సహాయం, కౌన్సెలింగ్ మరియు క్యాన్సర్ అవగాహన కొరకు చేసే ప్రచారాలను నిర్వహిస్తుంది.
రోకో క్యాన్సర్ ఛారిటబుల్ ట్రస్ట్:
హైదరాబాద్‌లో ఉన్న రోకో క్యాన్సర్ ఛారిటబుల్ ట్రస్ట్, క్యాన్సర్ యొక్క నివారణ మరియు అవగాహన అందించే దిశగా పనిచేస్తుంది. ఇది స్క్రీనింగ్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు మరియు బాధితులకు సహాయాన్ని అందించడం కొరకు పనిచేస్తుంది.
కిద్వాయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (KMIO):
KMIO అనేది ఒక ప్రభుత్వ సంస్థ, ఇది క్యాన్సర్ పరిశోధన మరియు చికిత్సలో చురుకుగా పాల్గొంటుంది. ఇది వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్ సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి లాభాపేక్ష లేని సంస్థల యొక్క మద్దతును స్వాగతిస్తుంది.
ఈ సంస్థలు, భారతదేశంలో క్యాన్సర్ సంక్షేమానికి సమగ్ర విధానంలో కీలక పాత్రను పోషిస్తాయి, బాధితుల యొక్క విభిన్న అవసరాలను తీర్చడం మరియు నివారణ మరియు చికిత్స కొరకు విస్తృత ప్రయత్నాలకు దోహదం చేస్తాయి.
ఇక చివరగ, క్యాన్సర్ రహిత సమాజం కోసం కృషి చేయడంలో అలాగే పరిశోధన కొరకు నిధులు సేకరించడం, పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్‌లు, అవగాహన ప్రచారాలు, కమ్యూనిటీ ఔట్రీచ్, పాలసీ అడ్వకేసీ మరియు అంతర్జాతీయ సహకారానికి ముఖ్యంగా క్యాన్సర్‌పై పోరాటంలో ఈ సంస్థలు బహుముఖ పాత్రను పోషిస్తాయి. ప్రపంచంలో ఈ ప్రాణాంతకమైన వ్యాధి యొక్క భారాన్ని తగ్గించి మరియు మరిన్ని జీవితాలను కాపాడతనికి వీటి సహకారం ఎంతో అవసరం.
Also read: బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన