ఈ కాంక్రీట్ అడవిలో మనం పీల్చే కాలుష్యపు గాలిని నేచర్ క్యూర్ ఎలా చేస్తుంది?

You are currently viewing ఈ కాంక్రీట్ అడవిలో మనం పీల్చే కాలుష్యపు గాలిని నేచర్ క్యూర్ ఎలా చేస్తుంది?

మనలో చాలా మంది ఈ కాంక్రీట్ అడవిలో స్వచ్చమైన గాలి లేని చోట బతికేస్తున్నారు. 

తినడానికి జంక్ ఫుడ్, పీల్చడానికి కాలుష్యమయిన గాలి, చివరికి హాస్పిటల్ లో ఒక మూలన బెడ్ ఇవే మన సొంతమన్నట్టు మన జీవితాలు మారిపోయాయి. మరి ఈ కాంక్రీట్ అడవిలో మనం ఉండే చోట కాస్తైన గాలిని స్వచ్చంగా మార్చే అవకాశం మనకు ఉంటె అది మంచిదే కదా!

మన సమస్యను నేచర్ క్యూర్ చేస్తుంది. 

అవును, అలంటి అవకాశం మనకు చెట్లే ఇస్తాయి. ఇక మనం ఉండే ఇరుకు గదుల్లో వనాలు ఎక్కడ్నుండి వస్తాయి అనేదే మీ సందేహమైతే ఇది పూర్తిగా చూడండి.

ఇప్పుడు మనం గాలిని శుద్ధిచేసే ఇంటి వద్ద పెంచుకునే మొక్కల గురించి ఇది పూర్తిగా చదివి తెలుసుకోండి.

మన సిటీ లైఫ్ లో మనం వాడే ప్రతీదీ కెమికల్ మయం. 

మన ఇళ్ళలో చాలా గాలి తెలియకుండానే కలుషితం అయిపోతూ ఉంటుంది. 

1989 లో నాసా వాళ్ళు ఒక పరిశోధన జరిపారు, దాని ఫలితమేంటంటే ఇంట్లో గాలిలో ఉండే టాక్సిన్స్ ను కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల తగ్గించావచ్చట. మనం పెంచుకునే కొన్ని మొక్కలు  పూర్తిగా ఆ టాక్సిన్స్ ను తొలగించకపోయినా చాలా వరకు అయితే తగ్గిస్తాయి. ఇంకా మొక్కలను పెంచుకోవడం వల్ల మనకు మానసికంగా కూడా కొంత ప్రశాంతత లభిస్తుంది. 

మన ఒత్తిడి తగ్గిపోయి మన ఫోకస్ కూడా పెరుగుతుందట.

మన ఇళ్ళలో ఉండే గాలి లో ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోఇథిలీన్, కార్బన్ మోనో ఆక్సైడ్ వంటి టాక్సిన్స్ ఉండే అవకాశం ఉంది. 

వీటిలో ఫార్మాల్డిహైడ్ అనేది టిష్యూ పేపర్స్, ఫర్నిచర్, బ్యాగ్స్ , సిగరెట్ పొగ వంటి వాటి నుండి వస్తుంది. ఇక బెంజీన్ అనేది పెయింట్లు, నూనెలు, ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్స్ నుండి రావచ్చు. ఇంకా ట్రైక్లోరోఇథిలీన్ అనేది పెయింటింగ్ ఇంకుల నుండి, వార్నిష్ లేదా ఏదైనా అధేసివ్ నుండి రావచ్చు. ఇక గ్యాస్ స్టవ్ వంటి వాటి నుండి కార్బన్ మోనో ఆక్సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ టాక్సిన్స్ అన్ని మన ఆరోగ్యానికి తలనొప్పి నుండి బ్రెయిన్ డ్యామేజ్ దాకాచాలా  సమస్యలు  కలిగించేవే! 

అందుకని వీటిని కొంచెమైనా తగ్గించడానికి మనం ఈ గాలిని శుద్ధి చేసే మొక్కలను ఉపయోగించడం మంచి కారణమే అవుతుంది.

సరే ఇంతకూ ఆ గాలిని శుద్ధి చేసే మొక్కల వివరాలేంటి అనేది మీ ప్రశ్నైతే..

అక్కడికే వద్దాం.

 ఈ రకంలో చాలా మొక్కలున్నా మనం ఇప్పుడొక అయిదు రకాల మొక్కల గురించి చూద్దాం.

  • స్పైడర్ ప్లాంట్స్ 

spider plant

ఈ మొక్కలలో రెండు వందల రకాలు ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ గా పెరుగుతాయి,గాలిని ప్యురిఫై చేయడమే కాకుండా మంచి అలంకరణ గా కూడా ఉంటాయి. వీటికి వారానికి రెండు మూడు సార్లు నీళ్ళు పోస్తే చాలు. ఇంకా ఈ మొక్కలలో ఎలాంటి టాక్సిన్ ఉండదు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, పెట్స్ ఉన్నా ఈ మొక్కల వల్ల హాని జరగదు.

  • డ్రాకెనాస్ 

Dracaena

సింపుల్ గా చెప్పాలంటే ఇదొక ఎయిర్ ప్యురిఫయర్. ఇది వివిధ రంగుల్లో లభిస్తుంది.ఈ మొక్కకు కూడా కొంచెం తడి ఉంటె చాలు మరీ ఎక్కువ నీరు అవసరం లేదు, ఒక్కోసారి ఎక్కువ నీరు ఇస్తే ఈ మొక్కకే ప్రమాదం. ఇంకా ఇది మనుషులకు టాక్సిక్ కాదు కానీ పిల్లి లేదా కుక్క వంటి పెట్స్ కి ఇది టాక్సిక్ గా అనిపిస్తుంది. ఇది పెట్స్ లేని ఇంట్లో ఒక మంచి ఎంపిక.

  • రబ్బర్ ప్లాంట్

rubber plant

దీని అసలు పేరు ఫైకస్ ఎలాస్టికా, ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది అలాగే ఇది గాలిలో ఉన్న కెమికల్స్ ని అబ్జర్వ్ చేసుకొని గాలిని శుద్ధి చేయగలదు. ఇది పెరిగే దాకా కేర్ అవసరం, కొంత పెరుగుదల అయ్యాక ఈ మొక్కను మెయింటెయిన్ చేయటం సులభమే..

  • పీస్ లిల్లీ 

peace lily

ఈ మొక్కను అన్నీ గాలిని శుద్ధి చేసే మొక్కలలో ముఖ్యమైనదిగా చెబుతారు. ఇది గాలిని చాలా బాగా శుద్ధి చేయగలదు. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది, ఇంట్లో ఒక మంచి అలంకరణగా కూడా ఉంటుంది. ఈ మొక్కను కాపాడటానికి మట్టి కొంచెం తడి గా ఉండాలి. ఇది కూడా పెట్స్ కి టాక్సిక్ గా ఉంటుంది. అందుకే పెట్స్ లేని ఇంట్లో ఇదొక మంచి ఎంపిక.

  • ఆలోవేరా

aloe vera plant

ఈ ఆలోవేరా మనందరికీ తెలిసిందే. మనం మన స్కిన్ కోసం వాడె ఈ అలోవేరా మన గాలిని శుద్ధి చేయడంలో కూడా బాగా సహాయం చేస్తుంది. ఈ అలోవేరా మొక్క వేసవి కాలంలో వాతావరణాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుందట. ఎక్కువ ఎండా తగిలే చోట ఈ మొక్కను పెడితే బాగా పెరుగుతుంది.

ఈ ఐదు మాత్రమే కాకుండా ఇలా చాలానే మొక్కలు గాలిని శుద్ధి చేసేవి ఉన్నాయి. మీరు వీటి గురించి ఇంకా తెలుసు కోవాలంటే తెలుసుకోవడానికి, నచ్చింది సులభంగా కొనడానికి అందరికీ ఇంటర్నెట్ ఇప్పుడు అందుబాటులోనే ఉంది. అందుకని ఈ కొత్త సంవత్సరం మొదలు లో ఓ కొత్త అలవాటు గా దీన్ని మొదలు పెట్టేయండి ! ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి  పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

Also Read: ఆరోగ్యమైన జీవితం కోసం మీరు E-Time తగ్గించండి !