క్యాన్సర్ సంరక్షణలో ముందస్తు స్క్రీనింగ్ ఎంత వరకు సహాయకరంగా ఉంటుంది?

You are currently viewing క్యాన్సర్ సంరక్షణలో ముందస్తు స్క్రీనింగ్ ఎంత వరకు సహాయకరంగా ఉంటుంది?

క్యాన్సర్ నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్ విధానాలను అభివృద్ధి చేసారు, అది మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు లేదా తక్కువగా సోకిన దశలో గుర్తించినప్పుడు మనిషి సర్వైవల్ రేటును పెంచడంలో సహయం చేస్తుంది. ముందస్తు స్క్రీనింగ్ క్యాన్సర్ సోకిన ప్రదేశాన్ని బట్టి, అవయవాన్ని బట్టి, వివిధ క్యాన్సర్ లకు విభిన్న విధానాలను కలిగి ఉంటాయి.

రొమ్ము క్యాన్సర్ కణజాలంలోని క్యాన్సర్ కణాలను గుర్తించడానికి తక్కువ మోతాదులో ఉన్న ఎక్స్-రేయ్స్ ని ఉపయోగిస్తారు. దీనినే మామ్మోగ్రఫి అని అంటారు. ఈ స్క్రీనింగ్ ద్వారా 1969 నుండి 2016 వరకు రొమ్ము క్యాన్సర్ మరణాలను 70% తగ్గించడంలో విజయవంతమయ్యింది.

1940’లో స్త్రీ గైనకాలజీ స్క్రీనింగ్ పరీక్ష అయిన ప్యాప్ స్మియర్ (Pap Smear) ఉపయోగించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించడంలో కూడా విజయవంతమయ్యింది. ఇది గర్భాశయ క్యాన్సర్ మరణాల రేటును గణనీయంగా తగ్గించింది.

ముందస్తు స్క్రీనింగ్ ప్రయోజనాలు

  • సాధారణ ఫలితాలతో మంచి అనుభూతిని పొందుతాము.
  • శరీరంలో లక్షణాలు కనిపించకముందే క్యాన్సర్ ను కనుగొంటాం.
  • క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాపించకముందే మనం కనుగొనవచ్చు.
  • ఒక వేళ క్యాన్సర్ ఉన్నట్లయితే క్యాన్సర్ చికిత్స సమయం మరియు వ్యయాన్ని తగ్గిస్తుంది.
  • మంచి సర్వైవల్ రేటును పొందవచ్చు.

ముందస్తు స్క్రీనింగ్ పరిమితులు

  • పరీక్షలలో క్యాన్సర్ ను చూపిస్తుంది, కానీ క్యాన్సర్ ఉండదు (ఫాల్స్ పాజిటివ్).
  • పరీక్షలలో మనకు క్యాన్సర్ ఉన్నట్లు కూడా గుర్తించకపోవచ్చు (ఫాల్స్ నెగటివ్).
  • క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స విధానాలు.
  • తరువాత చేసే హానికరమైన పరీక్షా విధానాలు.

రొమ్ము క్యాన్సర్ ముందస్తు స్క్రీనింగ్ల విషయంలో, 0.1 % మంది మహిళలు ప్రయోజనం పొందితే, 31% మంది మహిళలు రోగనిర్ధారణకు గురయ్యే ప్రమాదం ఉందని నివేదికలు సూచించాయి. ఇక్కడ మనము మంచి కంటే ఎక్కువ హాని చేస్తున్నామని భావన కలుగుతుంది. కొన్నిసార్లు ఇది తప్పుడు సానుకూల ఫలితాలను (ఫాల్స్ పాజిటివ్) కూడా చూపుతుంది.

ఈ ఫాల్స్ పాజిటివ్ కేసులు రొమ్ము కణజాలంలో ప్రీ క్యాన్సరాస్ లిషన్స్ (precancerous lesions) ఉండటం వల్ల వస్తాయి, ఇవి క్యాన్సర్ కలిగించేవి కావు. సహజంగా ఇవి మన శరీరం లోనే తయారవుతాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థ ద్వారా శరీరం నుండి తొలగించబడతాయి. ఈ ఫాల్స్ పాజిటివ్ వల్ల మాస్టెక్టమీ, కీమోథెరపీ లాంటి చికిత్స విధానంతో స్త్రీలు చాలా ఆందోళనకు గురవుతారు. కీమోథెరపీల వల్ల హార్ట్ ఫైల్యుర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరియు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

మామ్మోగ్రఫిలలో వాడే ఎక్స్-రేయ్స్ లు సున్నితమైన రొమ్ము కణజాలాన్ని నాశనము చేసే అవకాశాలు ఉంటాయి. తప్పుడు సానుకూల ఫలితాలు స్క్రీనింగ్ విధానాలలో చాలా తరచుగా జరుగుతుంటాయి.

మామోగ్రామ్ల తప్పుడు సానుకూల ఫలితాల పరిణామాలు

  • రొమ్ము క్యాన్సర్ ముందస్తు స్క్రీనింగ్లకు వెళ్లే ముందు, ప్రతి స్త్రీలకు ఈ ప్రక్రియ యొక్క లాభ నష్టాలను తెలియచేస్తారు. దీని ఆధారంగా, స్త్రీలు స్క్రీనింగ్ చేయించుకోవాలా వద్దా అనే వారి స్వంత నిర్ణయాన్ని కలిగి ఉండవచ్చు.
  • మామ్మోగ్రఫిలో తప్పుడు సానుకూల ఫలితాల తర్వాత జరిగే బయాప్సీ పరిక్షలు ద్వారా వారు ప్రతికూలమైన మరియు బాధాకరమైన అనుభవాలను అనుభవించడం జరుగుతుంది. ఇది స్త్రీల జీవితాలను ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే వారు ఆందోళనకి లోనై నిద్రను కూడా కోల్పోతారు.
  • బయాప్సీల ప్రక్రియల తర్వాత మానసికమైన ఇబ్బందులు కూడా స్త్రీలకు కలగవచ్చు, దీనిలో అనస్థీషియా ప్రక్రియ కారణంగా వచ్చే నొప్పి చాలా కాలం పాటు కొనసాగుతుంది. భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడుతున్నామనే ఆలోచన వారి మనసులో గందరగోళానికి దారితీయవచ్చు.
  • కొన్ని సందర్భాల్లో, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా తప్పుడు సానుకూల ఫలితాల వల్ల తదుపరి పరీక్షల కోసం మహిళలను రీకాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ తుది ఫలితాల కోసం వేచి ఉండేది చాల కష్టమైనది.

ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో, ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA) యొక్క మెకానిజాన్నీ ఉపయోగించడం ద్వారా FDA 1986 సంవత్సరంలో PSA-ఆధారిత స్క్రీనింగ్ ను ఆమోదించింది. రక్తంలో ఉండే PSA యాంటిజెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ అవకాశాలను గుర్తిస్తుంది,

అయితే కొంతమంది సాధారణ ఆరోగ్యవంతమైన పురుషులలో PSA ప్రోటీన్ అధిక స్థాయిలలో కూడా ఉండే చాన్స్ లూ ఉంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ ఓవర్ డయాగ్నోసిస్ వల్ల కొంతమంది పురుషులలో కార్డియో వాస్క్యులర్ ఫైల్యూర్ వచ్చే ప్రమాదం ఉంది.

కావున US ప్రివెంటివ్ సర్వీసెస్ టాస్క్ ఫోర్స్ (USPSTF) వారు, 55 లేదా అంతకంటే ఎక్కువ మరియు డెబ్బై ఏళ్లలోపు పురుషులకు ముందస్తు PSA స్క్రీనింగ్ పరీక్షించబడకూడదని స్పష్టమైన నియమాలను అందించింది.

USPSTF సూచించినట్టు, 50-74 సంవత్సరాల వయస్సు గల మహిళలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదంలో ఉన్నందున ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మామ్మోగ్రఫిలు చేసుకోవచ్చు. 40-49 సంవత్సరాల వయస్సు గల మహిళలు డాక్టర్ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్ ను సంప్రదించిన తరువాతే ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి అని చెప్పారు.

ముందస్తు స్క్రీనింగ్లకు వెళ్లే ముందు ప్రజలు వాటి లాభ నష్టాల గురించి తెలుసుకొని మరియు ఫాల్స్ పాజిటివ్లను నివారించడానికి మంచి రేడియాలజిస్ట్ నిపుణులైన వారి దగ్గర స్క్రీనింగ్లను చేయించుకోవాలి.

వయస్సు మరియు వారి లైఫ్ స్టైల్ అలవాట్ల వల్ల వచ్చే ప్రత్యేకమైన క్యాన్సర్ల ప్రమాదం ఉన్న వ్యక్తులకు ముందస్తు స్క్రీనింగ్లు చాలా సహాయపడతాయి. అయితే ఎక్కువ స్క్రీనింగ్ ద్వారా వచ్చే హానికరమైన కిరణాలు మరియు వైద్య విధానాలకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుందని మనము గ్రహించాలి.

Also read: క్యాన్సర్ నివారణలో మరియు చికిత్సలో ఉపయోగపడే 5 మూలికలు