మనం తినే ఆహారం మన వంటింట్లో మంచిగా వండితే మంచి ఆహారం అయిపోదు..
పోనీ అందులో ఉపయోగించిన కూరగాయలు మంచి షాప్ లో కొన్నంత మాత్రాన అది మంచి ఫుడ్ అయిపోదు.
అది ఎప్పుడు మంచి ఆహారం అవుతుంది అంటే.. సరైన విధానంలో పండించినప్పుడు మాత్రమే..
ఎప్పుడైనా మన ఆహారం ప్రకృతికి ఎం చేస్తుందో ఆలోచించారా..
మనం తినే అన్నం కోసం ఒక ఎకరం వరి పండించడానికి ఆరు మిలియన్ల లీటర్ల నీళ్ళు అవసరమవుతాయి..మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం తినే ఒక కిలో అన్నం పండించడానికి ఒక ట్యాంకర్ నీళ్ళు కావాలి. ఆ నీరు మన ప్రకృతికి ఆహారం పండించడానికి అయ్యే ఖర్చు.. అదే జస్ట్ ఒక ఊరంతా ఒక రోజు తినే అన్నం పండించడానికి ఎంత నీరు అవసరం అవుతుందో ఆలోచించండి..ఊహించలేరు!
అది మన నేచర్ పై ఎంత భారం ఆలోచించారా..
దీనిని మనం అవాయిడ్ కూడా చేయలేం..
పక్క ఊరి నుండో, లేక పక్క జిల్లా నుండో వచ్చే బియ్యమే ప్రకృతికి ఇంత భారమవుతుంటే మరి మనం సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకునే ప్యాకేజ్ చేసిన ఫుడ్స్ ఇంకెంత బరువు అవుతుంటాయి. అవి కొన్ని వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఎన్నో ప్రాసెసింగ్ లు చేయబడి మనం కొనే షాప్ లో ల్యాండ్ అవుతాయి. అవి మనం ఎక్కువగా తినడం మొదలు పెడితే మన ఆరోగ్యాలు పాడవుతాయి అలాగే మన నేచర్ ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఎందుకంటే అన్ని వేల మైళ్ళ ప్రయాణం లో ఈ ప్యాకేజ్ చేసిన ప్రాసెస్ చేసిన ఫుడ్ యొక్క కార్బన్ ఫూట్ ప్రింట్ మన నేచర్ పై పోల్యుషన్ రూపంలో పడే ఉంటుంది.
కార్బన్ ఫూట్ ప్రింట్ అంటే మనం చేసే పనుల వల్ల ప్రకృతి లో రిలీజ్ అయ్యే కాలుష్యాన్ని కలిగించే కార్బన్ మోనో ఆక్సైడ్ వంటి గ్యాసేస్ అని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ రోజు సూపర్ మార్కెట్ లో కొన్న ఒక ఫుడ్ ప్రాడక్ట్ ఒక వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక పొలం లో పండించింది అనుకుందాం. అది మన దగ్గరికి రావడానికి ఆ పొలం నుండి గోడౌన్ కి వెళ్లి అక్కడ కొంచెం ప్రాసెసింగ్ జరిగి, అక్కడి నుండి ఫ్యాక్టరీ కి వెళ్లి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ జరిగి అక్కడి నుండి మరో స్టోరేజ్ కి వెళ్లి ఆ ప్లేస్ నుండి నువ్వు కొనే షాప్ కి వచ్చింది, అంటే ఈ మధ్యలో ఎంత కాలుష్యం విడుదల అయి ఉంటుంది. అదే ఆ ఫుడ్ ప్రాడక్ట్ ఆ పొలం పక్కనే ఉన్న ఊర్లో ఎవరో కొని ఉంటే ఇది జరిగేది కాదు కదా !
ప్రకృతి పై ఇంత భారం పడేది కాదు.
మరి నేచర్ పై భారం పడొద్దు అంటే ఎం చేయాలి అంటే..
సింపుల్ గా మన లోకల్ లో పండించిన ఫుడ్స్ ని మనం తినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేయటం వల్ల మనం కూడా ఫ్రెష్ గా ఉన్న మంచి ఆహారాలు తిని ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మన నేచర్ కూడా ఈ కార్బన్ ఫూట్ ప్రింట్ నుండి తప్పించుకుంటుంది. లోకల్ లో పండిన పండ్లను కూరగాయలను తిని, కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాకేజ్ చేసిన ఫుడ్స్ ని అవాయిడ్ చేసి మన ఆరోగ్యం తో పాటు నేచర్ ని కూడా కాపాడదాం ! ఇది మనందరి బాధ్యత. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: ఆర్గానిక్ పండ్లను కూరగాయలను గుర్తుపట్టేదేలా?