ఆర్గానిక్ పండ్లను కూరగాయలను గుర్తుపట్టేదేలా?

You are currently viewing ఆర్గానిక్ పండ్లను కూరగాయలను గుర్తుపట్టేదేలా?

ఆర్గానిక్ అనే పదం వింటే చాలు కొందరికి ఇది చాలా ఆరోగ్యకరమైనది అనే ఫీలింగ్ మనలో చాలా మందికే కలుగుతుంది. నిజమే.. ఆర్గానిక్ గా పండిన పండ్లు కూరగాయలు ఇతర వాటితో పోలిస్తే ఆరోగ్యానికి చాలా మంచివి అలాగే వాటిలో ఎలాంటి ఫెర్టిలైజర్ లేదా పెస్టిసైడ్ రేసిడ్యుస్ ఉండే అవకాశం లేదు.

ఇంకా ఆర్గానిక్ పండ్లకు, కూరగాయలకు మార్కెట్ లో డిమాండ్ చాలా ఉంది. కానీ అవి అన్నీ నిజంగా ఆర్గానిక్ గా పండిన పండ్లు కూరగాయలేనా అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఏమో పెరుగుతున్న డిమాండ్ ని బట్టి, ఆర్గానిక్ సేద్యానికి ఉన్న లిమిటేషన్స్ వల్ల ఆర్గానిక్ లో కూడా కల్తీ జరిగే అవకాశం ఉంది కదా!

మరి అలాంటప్పుడు ఆర్గానిక్ పండ్లు, కూరగాయలను మనం ఎలా గుర్తుపట్టాలి అనేది ఇది పూర్తిగా చదివి తెలుసుకోండి. ఇక ఈ ఆర్గానిక్ పండ్లు మరియు కూరగాయలను కొనడానికి మీరు

మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

మొదటిది ఆర్గానిక్ పండ్లైనా కూరగాయలైనా కంటికి ఇంపుగా ఒకే రంగులో, ఒకే సైజ్ లో ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే మిగతా కెమికల్స్ వేసి పండించిన పంటల్లో అక్కడి అన్ని పండ్లకు ఒకే మోతాదులో ఒకే రకమైన ఫెర్టిలైజర్ అందుతుంది కాబట్టి అన్నీ దాదాపు ఒకే పరిమాణం ఒకే రంగుతో ఉంటాయి. కానీ ఆర్గానిక్ లో ప్రతీ మొక్క తన ఉనికి కోసం పోరాడుతుంది. కీటకాల నుండి, వ్యాధుల నుండి పోరాడి తనను తానూ రక్షిచుకుంటుంది. అందుకే ఆ మొక్క పండు మరో దానిలా ఉండదు. అందుకనే ఆర్గానిక్ వి ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇంకో చిన్న టిప్ ఏంటంటే మీ కంటికి ఏదైతే అందంగా కనిపించట్లేదో అదే ఎక్కువగా రుచికరమైనది అయ్యి ఉండవచ్చు.

ఇక రెండవది, ఇది మీరు సూపర్ మార్కెట్స్ లో ప్యాక్ చేసిన ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకునే తప్పుడు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఆర్గానిక్ ఫుడ్స్ షెల్ఫ్ లైఫ్ మిగతా వాటితో పోలిస్తే తక్కువగా ఉంటుంది, అలాగే ఒక వేళ ఎక్కువగా ఉందంటే గనక అక్కడ ప్రిజర్వేటివ్స్ కలిపే అవకాశం ఉంది. అందుకనే కొనే ముందు వెనకాల లేబుల్ చెక్ చేయండి.

మూడవది మీరు లోకల్ గా బయట ఈ ఆర్గానిక్ కూరగాయలు కానీ పండ్లు గానీ కొంటున్నట్లయితే, ఆర్గానిక్ పండ్లు కూరగాయల చుట్టూ ఈ చిన్న కీటకాలు వంటివి ఎగురుతూ కనిపించవచ్చు.  అదే ఇతర కెమికల్స్ పెస్టిసైడ్స్ ఉపయోగించి పండించిన వాటి చుట్టూ ఎటువంటి ఇన్సేక్త్స్ కనిపించవు. ఎందుకంటే అవి ఎలాంటి పురుగులు కీటకాలు దరిచేరకుండా కెమికల్ గా ట్రీట్ చేయబడి ఉండొచ్చు. లోకల్ మార్కెట్ లో ఎ విషయాన్ని మీరు గమనించవచ్చు.

ఇక నాలుగవది వాసన, ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు ఎప్పుడూ స్ట్రాంగ్ స్మెల్ తో ఉంటాయి. ఇతర వాటితో పోలిస్తే ఇవి ఎక్కువ బలమైన అరోమా కలిగి ఉండటం గమనించవచ్చు. అలాగే ఆర్గానిక్ వి ఎప్పుడూ మెరుస్తూ పాలిష్ చేసినట్టు కనిపించవు, మనం పట్టుకుంటే వీటి టెక్శ్చర్ ని ఫీల్ అవ్వొచ్చు.

ఇక చివరగా టేస్ట్, ఇది మీరు ఇంటికి తీసుకెళ్ళి తిన్నాకే తెలుస్తుంది అనుకోండి. కానీ ఆర్గానిక్ పండ్లు మరియు కూరగాయలు వాటి పోషకాలను ఫైట్ చేసి సాధించుకుంటాయి, అందుకే టేస్టీ గా ఉంటాయి. సో ఈ విధంగా మీరు మార్కెట్ లో ఆర్గానిక్ పండ్లు మరియు కూరగాయలను గుర్తుపట్టొచ్చు. అర్థమైంది కదా..ఈ సారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఇవి గమనించండి మరి ! ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

Also Read: కాస్మెటిక్స్( Cosmetics )తో క్యాన్సర్ వస్తుందా !