ఈ జనరేషన్ లో మన లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ మంది ఎదుర్కుంటున్న ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే బరువు పెరగడం. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కావచ్చు ఈ బరువు పెరగడం అనే సమస్య చాలా పెరిగింది. ఇక ఈ సమస్య ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఇక ఇలాంటి సమయంలో బరుకు తగ్గడానికి ఈ జెనరేషన్ లో ట్రేండింగ్ లోకి వచ్చిన టాపిక్ ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్.
సాధారణంగా అందరూ బరువు తగ్గడానికి డైట్ చేయాలంటారు, ఒకవేళ ఇది కూడా డైట్ అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు పొరపాటు పడుతున్నట్టే! ఈ ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్ మరియు బరువు తగ్గడానికి అనుసరించే డైట్ కి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. మనం ఆహారంగా ఏది, ఎంత మోతాదులో తినాలి అని చెప్పేది డైట్ అయితే, ఆహారాన్ని రోజులో ఏ సమయంలో తినాలి అనేది ఈ ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్. ఇందులో ఈ రకమైన ఆహారాలే తినాలి వంటి ఆహార నియమాలేమీ ఉండవు.
కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆహారం తిని, మిగతా సమయమంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండటమే ఈ ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్.
ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు !6 : 8 అనే రకమైన ఫాస్టింగ్ లో ఎనిమిది గంటల వ్యవధిలో ఆహారం తిని మిగతా పదహారు గంటలు ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఇక OMAD అనే రకంలో రోజుకు ఒకటే పూట భోజనం చేయాలి. ఇలా వివిధ రకాల ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్ లు ఉన్నాయి. సాధారణంగా తక్కువ సమయం ఫాస్టింగ్ ఉండే విధానం తో మొదలుపెట్టి నెమ్మదిగా OMAD రకాన్ని అనుసరించడానికి బరువు తగ్గాలి అనుకునేవారు ప్రయత్నిస్తుంటారు. ఈ OMAD అంటే వన్ మీల్ ఎ డే అని అర్థం.
ఈ ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్ అనేది కొత్త విషయమేమీ కాదు. మానవాళి మొదలు నుండి మనకు వస్తున్నా అలవాటే ఇది. అలాగే మనం సరిగ్గా గమనిస్తే ఇస్లాం లో రమదాన్ సమయంలో ఫాస్టింగ్ చేస్తారు, అలాగే సనాతన ధర్మంలో చాలా సందర్భాల్లో ఉపవాసం చేయడం అనే పద్ధతి ఉంటుంది. ఇలా మనకు సాంప్రదాయంగా ఈ అలవాటు కొత్తదేమీ కాకున్నా, సైన్స్ దీనిని బరువు తగ్గడంతో పాటూ సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుందని నిరూపించడంతో ప్రపంచమంతా ఈ రకమైన ఫాస్టింగ్ ట్రేండింగ్ గా మారింది.
ఇక అసలు ఈ ఫాస్టింగ్ బరువును ఎలా తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సింపుల్ గా మనం బరువు తగ్గాలి అంటే మన శరీరంలో ఉన్న కొవ్వు కరగాలి, అందుకోసం మనం తినే ఆహారం ఇచ్చే క్యాలరీల కంటే ఎక్కువగా ఖర్చైనా చేయాలి లేదా మనం ఉపయోగించే క్యాలరీల కంటే తక్కువ అయినా తినాలి. ఇలా చేస్తే ఆ సమయంలో మన శరీరంలో జరిగే కీటోసిస్ అనే ప్రక్రియ వల్ల ఈ బరువు తగ్గడం జరుగుతుంది. ఇక ఈ బరువు తగ్గే ప్రక్రియలో మనం ఖర్చు చేసే క్యాలరీల కంటే తక్కువ తినడం ఈ ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్ లో బాగా సాధ్యపడుతుంది. అందువల్ల మనం ఈ రకమైన ఫాస్టింగ్ సరిగ్గా అనుసరించినప్పుడు బరువు తగ్గడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పై మెడిటేరియన్ డైట్ ప్రభావం