మనకు డ్రై ఫ్రూట్స్ అంటే చాలు గుర్తొచ్చేది హెల్త్.
డ్రైఫ్రూట్స్ హేల్తీ అని తెలిసాక, ఎంత ఖర్చు పెట్టైనా సరే వాటిని కొని తింటుంటాం.
చూడటానికి చిన్నగా ఉండి ఎక్కువగా ఎనర్జీ ని ఇవ్వగలిగే డ్రై ఫ్రూట్ అనేది ఒక మంచి హేల్తీ స్నాక్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ..
కానీ మీరు కొనే డ్రై ఫ్రూట్స్ మంచివా.. కాదా అనేదే సందేహం?
ఈ డ్రైఫ్రూట్స్ అనేవి మీ చుట్టు పక్క ఊళ్లలో నుండి వచ్చినవి కాదు, డైరెక్ట్ గా చెట్టు మీద నుండి వచ్చినవి కూడా కాదు. వేరే రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేయబడి ప్యాకేజ్ లో మన చేతికి వస్తున్న ఈ డ్రై ఫ్రూట్స్ లో కల్తీ జరిగే అవకాశం లేదంటారా?
మీరు ఎన్ని సార్లు డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ పై ఎక్స్పైరీ డేట్ చూస్తున్నారు?
అసలు చాలా వరకు ఎక్స్పైరీ డేట్ ప్రింట్ అవ్వని డ్రైఫ్రూట్స్ మార్కెట్ లో కొంటున్నారా?
చాలా సార్లు మనందరికీ డ్రై ఫ్రూట్ అనగానే హెల్త్ గుర్తొచ్చి వేరే ఏదీ ఆలోచించకుండా కోనేస్తున్నాం..
కానీ ఈ సారి నుండి మీరు ఆ తప్పు చేయకండి !
డ్రై ఫ్రూట్స్ కొనే ముందు అవి మంచివా లేక ఏదైనా కల్తీ జరిగిందా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
డ్రై ఫ్రూట్స్ కొన్ని వందల నుండి వేల మైళ్ళు ప్రయాణం చేసి మనం కొనే షాప్ లోకి వస్తాయి.
ఈ వందల వేళ మైళ్ళ ప్రయాణం లో కానీ, లేదా ఈ ఫ్రూట్స్ ని డ్రై చేసే విధానంలో కానీ, లేదా వీటిని స్టోరేజ్ చేసే విధానం లో కానీ ఎక్కడ తప్పు జరిగినా అది ఈ డ్రై ఫ్రూట్ క్వాలిటీ ని తగ్గిస్తుంది..ఒక్కోసారి వీటిని మనకు హానికరంగా మార్చే అవకాశం కూడా ఉంది.
మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే గనక ఒకసారి వాటిని బయటికి తీసి చూడండి. మీరు కొన్నప్పుడు ఉన్న కలర్ లోనే ఇప్పుడు ఉన్నాయా అని..ఒక వేళ అవి డార్క్ కలర్ లోకి మారుతున్నయంటే అక్కడ కల్తీ చాన్స్ ఉన్నట్టే!
అలాగే వాటి టేస్ట్.. కొన్ని సార్లు డ్రై ఫ్రూట్స్ కూడా కృత్రిమ విధానాల్లో పండేలా చేస్తారు. అలంటివి దానిలో ఉండే స్వీట్ టేస్ట్ ను కోల్పోయి చేదుగా ఉంటాయి. ఒకవేళ అలా ఉంటె గనక అవి కృత్రిమంగా కెమికల్స్ ఉపయోగించి పక్వానికి వచ్చేలా చేసినవి అయ్యి ఉండొచ్చు.
అలాగే మనకు డ్రైఫ్రూట్స్ డైరెక్ట్ గా కొనటం కంటే కొన్ని సార్లు మిక్స్ చేసినవి, బాక్స్ లో ఉన్నవి మార్కెట్ లో కొంటుంటాం.. అలాంటివి కొనేటప్పుడు వెనకాల లేబుల్ చదవండి. అందులో కృత్రిమ షుగర్స్ కానీ, ప్రేజర్వేటివ్స్ కానీ ఏమైనా ఉంటే అవి అంత మంచిది కాదు. అలాగే చాలా మందో ప్లాస్టిక్ కవర్స్ లో ఎలాంటి లేబుల్ లేని డ్రై ఫ్రూట్స్ కొంటుంటారు, ఒక్కోసారి అవి కల్తీ అయి ఉండొచ్చు లేదా ఎక్స్పైర్ అయ్యి కూడా ఉండొచ్చు. అందుకనే ఎక్స్పైరీ డేట్ ఉన్నవి చూసి కొనండి.
ఉదాహరణకు మార్కెట్ లో ఒక వేళ మీరు ఎండుద్రాక్ష కొంటున్నారు అనుకుకోండి. ఒక్కోసారి దాంట్లో తీయదనాన్ని పెంచడానికి కృత్రిమ షుగర్స్ కలిపి ఉండవచ్చు. ఒక వేళ ఆ ఎండుద్రాక్ష పైన తడిగా అనిపించింది అంటే అవి మంచివి కాదు అని అర్థం, అలాగే వాటిని మీ చేతికి రబ్ చేసినప్పుడు మీ చేతికి పసుపు రంగు ఏమైనా అంటనట్టు ఉంటే అవి కల్తీ అని అర్థం. ఇది మీరు బాదం లో కూడా ట్రే చేయొచ్చు. తాజాగా కనిపించడానికి కృత్రిమ కలర్స్ ఉపయోగిస్తుంటారు.మనం మన చేతి పై రబ్ చేస్తే తెలిసిపోతుంది.
అదే ఆప్రికాట్స్ లాంటివి అయితే ఒకవేళ నమలడానికి మరీ కష్టంగా ఉండేంత హార్డ్ గా ఉన్నట్లయితే అవి కూడా కల్తీ అయి ఉండవచ్చు. ఇంకా వాల్ నట్స్ రియల్ వి అయితే లైట్ బ్రౌన్ లేదా బంగారు రంగులో ఉంటాయి, అదే కల్తీ అయితే అవి డార్క్ బ్రౌన్ రంగులో కనిపిస్తాయి. ఒకవేళ స్టోరేజ్ విషయం లో తప్పులు జరిగినట్లయితే ఈ డ్రై ఫ్రూట్స్ చెడు వాసన తో ఉంటాయి. మీరు అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ పైన సన్నని రంధ్రాలు చూసి ఉండొచ్చు. అవి కూడా పాడయినట్టే..
ఈ సారి డ్రై ఫ్రూట్స్ కొనే ముందు రంగు, రుచి, వాసన అలాగే వాటి ఎక్స్పైరీ డేట్ కూడా చూసి తీసుకోండి. కల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ వల్ల జీర్ణ క్రియ కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశముంది.
ఈ సారి మీ డ్రై ఫ్రూట్ ప్యాకెట్ వెనక లేబుల్ చూడటం మర్చిపోవద్దు!
ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: మొబైల్ అడిక్షన్ చేసే నష్టమేంటి? దాని పరిష్కారమేంటి?