మన చరిత్ర
సుమారు 5000 సంవత్సరాల క్రితం నాటి భారతీయ ఇతిహాసాలలోని పాత్రలు, వారు నివసించే సమాజ స్థితి గతులు ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతున్నాయి. మన భారతీయ ఇతిహాసాలలో అత్యంత ప్రాముఖ్యమైనది “మహాభారతం”. దీనినే మనం “పంచమ వేదం” అని పిలుస్తాము. ఇక్కడ ఆయుర్వేదం వివిధ సందర్భాలలో ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది.
ఆయుర్వేదం యొక్క సంప్రదాయ వైద్య విధానం (Traditional Ayurvedic Treatment) మన భారతీయ చరిత్రలో అంతర్లీనమై లోతుగా ముడిపడి ఉంది. అంతే కాక, దాని గొప్ప చరిత్రను ఇప్పటి తరాలకు కూడా ప్రతిబింబించేలా చేస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్య శ్రేయస్సుకు సంబంధించిన విధానాన్ని కలిగి ఉంటుంది. మహాభారతం తరచుగా ఆయుర్వేద సూచనలు, వాటి అభ్యాసాలు సూచిస్తుంది. మూలికలు, సహజ నివారణ చికిత్స యొక్క విశిష్టత చెబుతుంది.
మహాభారతంలో ఆయుర్వేదం పాత్ర
ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం, మన మహాభారతం. ఇందులో ఆయుర్వేద పద్ధతుల ద్వారా చికిత్సను అందించి, ఎన్నో రకాల వ్యాధులకు నివారణ మార్గాన్ని కూడా సూచించే అనేక సందర్భాలు మనము గమనించవచ్చు.
ఉదాహరణకు, కురుక్షేత్ర యుద్ధంలో, గాయపడిన యోధులకు నొప్పిని తగ్గించడానికి, త్వరగా నయం చేయడానికి ఆయుర్వేద విధానాలతో తయారు చేసిన మందులతో చికిత్స చేయడం జరిగింది. ఆయుర్వేద మూలికలు, వాటి ద్వారా చేయబడిన కషాయాలు, తేనీరు వంటి పానీయాల ద్వారా సైనికులు తమ బలాన్ని, శక్తిని తిరిగి పొందడం జరిగింది.
మహాభారతంలోని శ్రీకృష్ణుడు, పాండవుల వంటివారు ఆయుర్వేదంపై విస్తృతమైన జ్ఞానాన్ని కలిగి ఉండేవారు. వారు తమ దైనందిన జీవితంలో యోగా, ధ్యానం వంటి సాధనాల ద్వారా శరీరం, మనస్సుకు ఆధ్యాత్మిక సమతుల్యతను కాపాడుకున్నారు. కాబట్టి, మహాభారతం మనకు ఆయుర్వేద చిత్రణ, దాని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను చెబుతుంది.
ఆయుర్వేదం ఎందుకు విస్మరించబడింది?
అన్ని వైద్య విధానాలతో పోలిస్తే ఆయుర్వేదానికి సంబంధించిన అవగాహనారాహిత్యాన్ని వివిధ అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. కింది ఉదాహరణలు గమనించండి.
- నేటి ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)లో అల్లోపతి విధానం ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. మన దేశంలోనికి వచ్చిన విదేశీయుల ఆక్రమణులు, చొరబాట్ల వల్ల అల్లోపతీ ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందిందని కూడా గమనించాలి.
- నెమ్మదిగా, అల్లోపతికి గణనీయమైన పెట్టుబడులతో అత్యధిక ప్రోత్సాహం పొందడం, ఆయుర్వేదం స్థానికంగా ఉన్న చోట నుండి ముందుకు రాలేకపోయింది.
- అయినప్పటికీ, పురాతన ఆయుర్వేదం యొక్క పరిపూరకరమైన శక్తికి ఇంకా గుర్తింపు ఉంది. ఈరోజుల్లో చాలా మంది వాటిని ఆరోగ్య సంరక్షణలో చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు.
నేటి రోజు ప్రజలు ఆయుర్వేదాన్ని తిరిగి ఎందుకు స్వీకరిస్తున్నారు?
మామూలుగా ఆధునిక వైద్య విధానంతో పాటూ, ఆయుర్వేదాన్ని కూడా మనము లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి గమనించి చూస్తే, ఆధునిక వైద్య విధానం రోగికి తొందరగా ఉపశమనాన్ని అందించే లక్షణాలపై మాత్రమే దృష్టి పెడుతుంది. అందువల్ల వ్యాధి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదు.
ఇలాంటి అనేక కారణాల వల్ల ప్రజలు నేడు ఆయుర్వేద పద్ధతికి తిరిగి రావడం జరుగుతుంది. కావున, ప్రజలు సహజమైన ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై మరింత అవగాహన కలిగి ఉండాలి. అలాగే, కొంతమంది వ్యక్తులు సమకాలీన చికిత్స నుండి అనుకూల ఫలితాలు కాకుండా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ను కూడా ఎదుర్కుని ఉండవచ్చు. ఇలాంటి కారణాల చేత ప్రజలు ఆయుర్వేదం కోసం వెతుకుతూ వస్తున్నారు.
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారికి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ వారి రసాయన ఆయుర్వేద చికిత్సతో(Best Ayurvedic Cancer Treatment) ఎంతో మందికి కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతూ కొత్త జీవితాన్ని ఆస్వాదించడం జరుగుతుంది.
ఆధునిక వైద్య శాస్త్రంతో పోలిస్తే ఆయుర్వేదం ఎందుకు ప్రత్యేకం?
ప్రస్తుత పరిస్థితిలో, ప్రపంచం ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత, దాని విశిష్టత అర్థం చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఆయుర్వేదం సమగ్ర విధానాన్ని కలిగి ఉంది
ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని ఆయుర్వేదం, ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని సమగ్రంగా అందించడం జరుగుతుంది. అలాగే ఆయుర్వేదం శరీరం, మనస్సు, ఆధ్యాత్మికం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది.
వ్యక్తిగతీకరించిన చికిత్స
ఆయుర్వేదం ప్రకారం ప్రతి వ్యక్తి, వారి ఆరోగ్య అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయుర్వేదం వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్యలను శరీర రకాన్ని బట్టి పరిష్కరించడానికి వ్యక్తిగతీకరించిన చికిత్సను అందిస్తుంది. కానీ సాపేక్షంగా చూస్తే, ఆధునిక వైద్యం తరచుగా రోగనిర్ధారణ మరియు చికిత్సకు క్రమబద్ధమైన విధానాన్ని ఉపయోగిస్తుంది..
సహజ చికిత్సలు
శరీరంలో వైద్యంయొక్క సమతుల్యతను ప్రాసెస్(Process) చేయడానికి, ఆయుర్వేదం దాని మొదటి దశలో కొన్ని ఔషధ గుణాలు కలిగిన మూలికలతో పాటు ఆహార సర్దుబాట్లు వంటి సహజ చికిత్సలను ఉపయోగిస్తుంది.
అదనంగా, ఇది యోగా, ధ్యాన పద్ధతుల వంటి అభ్యాసాలను కూడా సూచిస్తుంది. ఇది అటువంటి సహజ నివారణల పద్ధతులను ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది.
సనాతన సంప్రదాయం
ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఆయుర్వేదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సనాతన సంప్రదాయం భారతీయ సమాజంలో లోతుగా కలిసిపోయింది. ఇది తరతరాలుగా అందించబడిన నీతి, జ్ఞాన సమాచారాన్ని పొందుపరుస్తుంది.
అంతేకాక యుగాలుగా, ఎంతో మంది వీటిని అభ్యసించారు. ఇది నిరంతరం ఎప్పటికి అప్పుడు మారుతున్నప్పటికీ, మన దైనందిక జీవితంలో అనునిత్యం ఉపయోగిస్తున్నాము. అలాగే ఆధునిక వైద్యం కూడా ఇప్పటికీ తమ ఆవిష్కరణలలో తులనాత్మకంగా ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన సమ్మేళనాలను ఉపయోగించడం, జీవన ప్రమాణాలను పెంచే పద్ధతులలో కూడా ఆయుర్వేద సారాన్నే అవలంబించడం కొసమెరుపు.
అనారోగ్యాల అసలు మూల కారణాన్ని కనుగొని శరీర సమతుల్యత సాధిస్తే, సంపూర్ణ ఆరోగ్య స్థితిని కాపాడాలని సూచిస్తుంది. ఇదే వ్యాధిని నివారణలో కూడా సహాయం చేస్తుంది. ప్రస్తుత కాలంలో రసాయన ఆయుర్వేదం(Rasayana Ayurveda)దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత ఉపశమనం కలిగిస్తుందని తెలియచేస్తున్నారు.
ఆయుర్వేదం శాశ్వత ఫలితాలను ఇస్తుందా?
ఆయుర్వేదం యొక్క లక్ష్యం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రకృతికి అనుగుణంగా ప్రోత్సహించడం. ఎందుకంటే, ఆయుర్వేదం అనేది ఒక సహజ పద్ధతి కావడం వలన వ్యాధి మూలాన్ని సైతం తొలగిస్తుంది. ఇలా వైద్యం చేయడానికి సాధారణంగా వ్యక్తి ఆరోగ్యం, వ్యాధి యొక్క శరీర స్వభావం, అలాగే వ్యక్తి జీవనశైలిని పరిగణలోకి తీసుకోవాలి. అందువలన, వారి ఆరోగ్యంలో సహజ మెరుగుదలలు నుండి ప్రయోజనం పొందవచ్చు.
“ఆయుర్వేదం సర్వరోగ నివారిణి అని గుర్తుంచుకోండి. మీ జీవనశైలిని సవరించండి. ఆహార నియమాలకు కట్టుబడి ఉండండి. ఆ తరువాత తగిన చికిత్సలు ఉపయోగిస్తే ఆయుర్వేదం ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని మీకు ఇస్తుంది.” -బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ వ్యవస్థాపకులు)
అందుచేత, రోజువారీ జీవితంలో ఆయుర్వేద సూత్రాలు స్థిరంగా పాటించాలి. అప్పుడు మీరు దీర్ఘకాలిక ప్రయోజనాలను అనుభవించవచ్చు. శాశ్వత ఫలితాలను సాధించడం కోసం అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.
ముఖ్య గమనిక :
ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Also read: క్యాన్సర్ రావడంలో జీన్ మ్యుటేషన్ కీలక పాత్ర పోషిస్తుందా?
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.