ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి BMI గణన సరైనదా?

You are currently viewing ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి BMI గణన సరైనదా?

BMI అనేది ఒకరి ఎత్తుకు, వారి శరీర బరువుకు ఉన్న సంబంధాన్ని తెలియచేసే మార్గం మరియు దీనినే బాడీ మాస్ ఇండెక్స్ అని పిలుస్తారు. ప్రజలలోని ఊబకాయ పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యపరంగా దీనిని ఉపయోగిస్తారు.

ఇది ఒకరి బరువును కిలోగ్రాములలో వారి ఎత్తుని మీటర్ స్క్వేర్ తో విభజించడం ద్వారా వస్తుంది.

BMI = కిలోగ్రాములలో బరువు / ఎత్తు (మీటర్)2

BMIని 1800’లలో బెల్జియన్ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రవేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త అడాల్ఫ్ క్వెట్లెట్ గారు దీనిని తయారు చేశారు. అతను ఆంత్రోపోమెట్రీ (Anthropometry) శాస్త్రాన్ని స్థాపించాడు, ఇది మనిషిని ఎలా కొలవచ్చో నిర్వచిస్తుంది. BMIని మొదట ‘Quetelet Index’ అని పిలిచేవారు, తర్వాత దీనిని BMI గా మార్చారు.

BMI సాధారణంగా ఒక జన సమూహం కోసం ఉపయోగించబడుతుంది. వారి సాధారణ బరువు లేదా అధిక బరువుకు చెందిన రేంజ్ లో ఉన్నారా అని తెలుసుకునే దానికి వాడుతారు. అయినా ఇది కండరాల ఉనికి, ఎముకల సాంద్రత, శరీర కొవ్వు, వ్యక్తి ఆరోగ్యం అనే అంశాలను పరిగణించదు.

సాధారణంగా ఆమోదించబడిన BMI పట్టిక:

Severely underweightBMI < 16
Low weightBMI < 18.5
Normal weightBMI = 18.6 – 24.9
OverweightBMI = 25 – 29.9
ObeseBMI ≥ 30
Obese class IBMI = 30.0-34.9
Obese class IIBMI = 35.0-39.9
Obese class IIIBMI ≥ 40

ఒకరి BMI సాధారణ బరువు పరిధి కంటే ఎక్కువగా ఉంటే, వారికి హృదయ సంబంధ సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు నుంచి ప్రమాదం ఉండవచ్చని ప్రాథమికంగా చెప్పవచ్చు.

BMI పరిధి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నారని చెప్పలేము. BMI అనేది ఒక వ్యక్తి సాధారణ ఆరోగ్య స్తితి, ఎత్తు-బరువు ఆధారంగా సమీప భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయో లేదో అని మాత్రమే ఊహించగలము.

ఎందుకు మనము BMI ని ఉపయోగిస్తాము?

  • ఇది కొలవడానికి సులభం.
  • దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు.
  • ఇది చాలా చౌక మరియు త్వరగా కొలవగలము.

ప్రయోజనాలు ఉన్నప్పటికీ, BMI శరీర కొవ్వు మొత్తాన్ని మరియు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఉపయోగించబడదు.

ఎటువంటి సమాచారాన్ని BMI ఇవ్వలేదు;

  • శరీరంలో కొవ్వు స్థాయి.
  • శరీరంలో శరీర కొవ్వు యొక్క పంపిణీ. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది వ్యక్తికీ వ్యక్తికీ భిన్నంగా ఉంటుంది.
  • శరీరంలో కండర ద్రవ్యరాశి మొత్తం.

సాధారణ కండర ద్రవ్యరాశి మరియు శరీర కొవ్వు ఉన్న వ్యక్తులుకు BMI సరిపోతుంది. కానీ సన్నగా ఉండి, కొవ్వు ఎక్కువగా ఉన్న వ్యక్తుల విషయంలో BMI మెరుగైన అంచనాను ఇవ్వకపోవచ్చు. దీనినే సార్కోపెనిక్ ఒబిసిటి అని అంటారు. అథ్లెట్లలో ఉండే అధిక కండర ద్రవ్యరాశి, తక్కువ కొవ్వు కూడా BMIలో కొన్ని సార్లు ఊబకాయంగా నమోదు చేయబడుతుంది.

మెటబాలిక్ హెల్తి ఒబిసిటి (metabolic healthy obesity)కి చెందిన వ్యక్తులు కూడా BMIలో ఊబకాయం వర్గంలోనే చూపడం జరుగుతుంటుంది. ఎందుకంటే వారి శరీరంలో అధిక కొవ్వు ఉంటుంది. అయిన వారికి అధిక BP, ఇన్సులిన్ నిరోధకత, అధిక HDL (చెడు కొలెస్ట్రాల్), తక్కువ LDL (మంచి కొలెస్ట్రాల్) వంటి వైద్యపరమైన సమస్యలు ఉండవు.

బరువు తగ్గించే పద్ధతుల కోసం కూడా BMI నివేదికలపై ఆధారపడలేము, కావున వైద్యులు మరియు పోషకాహార నిపుణులు BMIని ఆధారం చేసుకుని ఇచ్చిన ఆన్ లైన్ డైట్ ప్లాన్లను ఆలోచించి పాటించాలి. ఈ మధ్య కాలంలో ఇటువంటివి చాలా మంది పాటిస్తునారు.
BMI కి ప్రత్యామ్నాయాలు

BMI కి కొన్ని ప్రత్యామ్నాయాలు వివిధ రంగాలలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.

  • Waist to hip ratio, నడుము చుట్టుకొలతను హిప్ చుట్టుకొలత ద్వారా విభజించడం.
  • Waist to height ratio, నడుము చుట్టుకొలతను ఎత్తుతో విభజించాలి. నడుము చుట్టుకొలత ఒక వ్యక్తి యొక్క ఎత్తులో సగం ఉండాలి.
  • Pinch test, వేళ్లు లేదా కాలిపర్స్ లను ఉపయోగించి పొట్టభాగంలో ఉండే కొవ్వును కొలవడానికి ఉపయోగిస్తారు.

ఈ ప్రత్యామ్నాయాలు పొత్తికడుపు చుట్టూ ఉండే కొవ్వు గురించి మనకు తెలియచేస్తుంది. పొత్తికడుపు చుట్టూ ఉండే కొవ్వు అబ్డామినల్ ఒబిసిటి (abdominal obesity) వర్గంలోకి వస్తుంది, ఎందుకంటే చాలా మంది పురుషులలో పొట్ట చుట్టు కొవ్వు నిల్వ చేయబడడం జరుగుతుంది. దీని వలన గుండె సమస్యలు, మధుమేహం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి కొన్ని వైద్య సమస్యలకు దారితీస్తుంది.

చివరగా

కావున BMI అనేది ఒక జన సమూహంలోని ఎత్తు-బరువు సంబంధాన్ని లెక్కించడానికి ఒక ప్రాథమిక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, ఒక వ్యక్తి శరీరంలోని కొవ్వు పరిమాణం మరియు ఆరోగ్య స్థితిని నిర్ణయించడానికి సరైనది కాదు అని పరిశోధకులు తెలుపుతున్నారు.

Also Read: బూడిద గుమ్మడికాయ … దిష్టికే కాదు… సర్వరోగ నివారిణి !