మనం ప్రకృతి నియమాలను పాటించినప్పుడే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం అనేది అందరూ ఒప్పుకోదగ్గ సత్యం. మన ఆహారం సహజంగా పండ్లు, కూరగాయలతో నిండి ఉన్నప్పుడు మన ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వారానికి ముప్పై రకాల కూరగాయలు తినడం మన ఆరోగ్యానికి మంచిదని ఇప్పుడు పరిశోధనలు కూడా తేల్చి చెబుతున్నాయి.
ఇక ఇప్పుడు చూస్తే మనం మన కూరగాయలు, పండ్లు వారానికి ఒక సారి కొనేసి మనకు సౌకర్యం ఉంది కదా అని ఇంట్లో ఉండే ఫ్రిజ్ లో పెట్టి వారం పాటూ తింటున్నాం, ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ రోజులే నిలువ చేసుకుంటున్నాం.
కానీ ఇది ఎంత వరకు మనకు మంచిది అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా?
ఇక దీని గురించి ఆలోచించడం మొదలు పెడితే అందరికీ భిన్నమైన అభిప్రాయాలు రావచ్చు. కొందరికి ఇలా ఫ్రిజ్ ఉండటం వల్లే ఇన్ని రోజులు ఈ కూరగాయలు, పండ్లు ఉంచుకోగాలుగుతున్నాం అనిపించవచ్చు. మరి కొందరికి సైంటిఫిక్ గా ఫ్రిజ్ లో పెడితే అక్కడ మైక్రో బియల్ గ్రోత్ ఆగిపోతుంది కాబట్టి మంచివి అనిపించవచ్చు. కానీ నిజానికి అలా ఫ్రిజ్ లో పెట్టిన కూరగాయలు, పండ్ల వల్ల జరిగే మేలు కంటే నష్టాల సంఖ్య చాలా ఎక్కువ.
ముందు మనం మన మూలాల నుండి మొదలుపెడదాం, ఒకప్పుడు ఇలా దాచుకొని కూరగాయలు పండ్లు తినడం అనే అలవాటు మనకు లేదు. ఏ రోజుది ఆరోజే తినడం అలవాటు. అది ఇప్పుడు అందరికీ సాధ్యపడకపోయినా, కొందరికి అవకాశం ఉన్నా కూడా ఫ్రిజ్ ఉంది కదా అని ఆ పద్ధతిని పాటించట్లేదు. మన ఆయుర్వేదం చెప్పిన దాని ప్రకారం మనం తినే ప్రతీ పండు, కూరగాయలో ప్రాణశక్తి ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో పెట్టిన వాటిలో ఆ శక్తి తగ్గిపోతుందట. అదొక డెడ్ ఫుడ్ లాంటిది అంటుంటారు. అంతెందుకు మన శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు కదా ! కూరగాయ కానీ పండు కానీ తెంపిన వెంటనే చనిపోయినట్లు కాదని, అందులో జీవక్రియ జరుగుతూనే ఉంటుందని.. ఆ పండ్లు, కూరగాయలు మన ఇంటికి వచ్చేదాకా కూడా ఊపిరి తీసుకుంటూనే ఉంటాయి. అంటే ప్రాణం ఉన్నట్లే కదా!
ఇదీ ఒక కారణమా! నమ్మేలా లేదు అని మీకు అనిపిస్తే మీకు అర్థమయ్యేలా సైంటిఫిక్ గా చూద్దాం.
మనకు పగలు రాత్రి తేడా అనేది ఎలా తెలుసో ఆ కోయబడిన పండ్లకు కూరగాయలకు కూడా పగలు రాత్రి తెలుసు అంటే మీరు నమ్మగలరా ! కానీ ఇది నిజం.
బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన జానెట్ బ్రాం చెప్పింది ఏమిటంటే పండ్లు, కూరగాయలు కూడా వెలుగు చీకటిని గుర్తించగలవట. ఆ వెలుగూ చీకటిని బట్టి తమలో కెమికల్ రియాక్షన్స్ మారతాయట. కానీ మనం వాటిని ఫ్రిజ్ లో పెట్టినప్పుడు కేవలం చీకట్లో మాత్రమే ఉండే ఆ పండ్లు కూరగాయలు వాటిలో జరగాల్సిన రసాయన ప్రక్రియ జరపవట. ఉదాహరణకు చెప్పాలంటే గ్లూకోసినోలేట్స్ అనే కాంపౌండ్స్ క్యాబేజ్, కాలీ ఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు వంటి వాటిలో అధికంగా ఉంటాయి. ఈ కాంపౌండ్స్ ఆ కూరగాయలు పగలు వెలుతురులో ఉన్నప్పుడు ఎక్కువగా విడుదల అయ్యి చీకట్లో విడుదల అవ్వకుండా ఆగిపోతున్నాయట. ఇక ఈ గ్లూకోసినోలేట్స్ మన ఆరోగ్యంలో ఏంతో ముఖ్య పాత్ర పోషిస్తూ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా మనను కాపాడతాయట. ఈ సైన్స్ విన్నాక మీకు నమ్మకం వచ్చే ఉంటుంది!
ఇక అది మాత్రమే కాదు ఇలా ఫ్రిజ్ లో పెట్టిన కూరగాయలు విటమిన్ బి, విటమిన్ సి కొన్ని రకాల వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ని కోల్పోతాయి, ఈ విషయాన్ని సైంటిస్ట్ లు కూడా చెబుతున్నారు.
ఇంకా ఉదాహరణకు మీరు ఈరోజు సూపర్ మార్కెట్ లో కొన్న కూరగాయలు ఎప్పుడు కోత కోసి ఉండవచ్చో ఊహించగలరా ! ఒక వారం నుండి పది రోజుల ముందే అవి కోత కోసి ఉండవచ్చు అనుకుందాం, ఇక్కడ సూపర్ మార్కెట్ కి ట్రక్ లో వచ్చి ఇక్కడ ఫ్రిజ్ లో అవి స్టోర్ చేయబడ్డాయి . అవి మీరు తీసుకెళ్ళి మీ ఫ్రిజ్ లో పెట్టుకొని ఇంకో వారం పాటూ తింటారు. ఇన్ని రోజులలో అవి ఎన్ని పోషకాలు కోల్పోయి ఉండవచ్చో మీరే ఆలోచించాలి మరి!
అదే ఫ్రెష్ గా తెచ్చుకొని వండుకొని తింటే ఆ సమస్య ఉండదు అనుకోండి, కానీ ఇది అందరికీ సాధ్యపడదు అనేది కూడా మనం ఒప్పుకోవాలి.
ఇవన్నీ పక్కన పెట్టినా సరే, మీరే ఒక సారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
నిజంగా ఈ ఫ్రిజ్ లో పెట్టి తీసి తిన్న పండ్లు కూరగాయలు ఫ్రెష్ వాటిలా టేస్టీ గా ఉంటున్నాయా? ఆ ప్రాసెస్ లో వీటి రుచి కూడా తగ్గిపోతుంది. అవునా!
మరి అలాంటప్పుడు ఈ కూరగాయలు, పండ్లు విషయం లో మనం ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు ఉంచడం కాకుండా ఎం చేయవచ్చో ఆలోచించడం మంచిది.
ఈ మధ్య క్లే ఫ్రిజ్ అని మార్కెట్ లో అందుబాటులో ఉంది, దానిని మీరు కొన్ని రోజులు కూరగాయలు పండ్లు ఉంచడానికి ఉపయోగించవచ్చు. కానీ వీలయితే మాత్రం తాజా కూరగాయలు పండ్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. కుదిరితే ఆర్గానిక్ వైపు వెళ్ళండి. తెలిసిన వాళ్ళ దగ్గర కొనడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. సీజనల్ గా వచ్చే కూరగాయలను, పండ్లను మార్కెట్ లో కొనడానికి ప్రిఫెరెన్స్ ఇవ్వండి.
ఇంకా ఫ్రిజ్ లో కాకుండా కూరగాయలు వంటివి స్టోర్ చేసుకోవడానికి కొన్ని ఈ చిన్న టిప్స్ పాటించండి.
- టమాటాలు, ఆలుగడ్డలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఫ్రిజ్ లో పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే వాటి న్యాచురల్ ఫ్లేవర్ ను ఇవి కోల్పోతాయి.
- ఇక సిట్రస్ పండ్లు అంత త్వరగా పాడవ్వవు, వాటిని ఇంట్లోనే ఎక్కడైనా చల్లని డార్క్ ప్లేస్ లో పెట్టడం మంచిది.
- మరో విషయం ఏంటంటే తినే ముందే కూరగాయలను, పండ్లను నీటితో కడగండి ,ముందే కడిగేస్తే ఆ తడి వల్ల మోల్డ్ వంటిది ఏర్పడవచ్చు.
- ఇంకా అరటి పండ్లు, మామిడి పండ్లు, కివీ వంటివి పండేకొద్దీ ఇథిలీన్ కెమికల్ ను విడుదల చేస్తాయి, వీటి పక్కన యాపిల్, క్యారెట్, ఆకు కూరలు వంటి ఇథిలీన్ సెన్సిటివ్ పండ్లు, కూరగాయలు పెట్టకండి. అలా చేస్తే త్వరగా పాడవుతాయి.
ఇక ఇవన్నీ మీకు తెలియనివి కాదు, మేము జస్ట్ గుర్తుచేస్తున్నాం అంతే!
ఇవన్నీ ఆచరించడం కొంచెం కష్టమే అయినా మన ఆరోగ్యం కోసం మనం ఈ అలవాటు చేసుకోవడం లో తప్పు లేదు కదా! మీరే ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: ప్రకృతి ఒడిలో కాసేపు గడిపితే చాలు.. మన గట్ బ్యాక్టీరియాకి ఎంతో మేలు..