దక్షిణ భారతదేశంలో అధికంగా కడుపు క్యాన్సర్ రిస్క్! ఇస్రో చైర్మెన్ సోమనాథ్ గారిని కూడా వదలని క్యాన్సర్

You are currently viewing దక్షిణ భారతదేశంలో అధికంగా కడుపు క్యాన్సర్ రిస్క్! ఇస్రో చైర్మెన్ సోమనాథ్ గారిని కూడా వదలని క్యాన్సర్

ఆరోగ్యంగా ఉండాలి అనేది మనందరికీ ఉండే ఒక కామన్ గోల్ లాంటిది. కానీ ఆ గోల్ ని మనం రీచ్ అవ్వాలంటే మన జీవన శైలిని చాలా మార్చుకోవలసి ఉంటుంది. సరైన పోషకాహారం తినాలి, సరైన వ్యాయామం చేయాలి, ఒత్తిడిని నియంత్రించుకోవాలి.. ఇలా చాలా మార్పులే మన జీవితంలో మనం చేసుకోవాలి. కానీ ఎన్ని మార్పులు చేసుకున్నా ఇంకా ఒక్క మార్పు చేసుకొని ఉంటే బావుండేది అని మనం అనుకునే లోపు అనారోగ్యం వచ్చిపడుతుంది. ఈ అనారోగ్యాలలో అన్నిటికంటే పెద్దది “క్యాన్సర్”

ఇస్రో చైర్మెన్ సోమనాథ్ గారిని కూడా వదలని క్యాన్సర్

 ఉదాహరణకు చూసినట్లయితే  ఇప్పుడు ఇస్రో చైర్మెన్ సోమనాథ్ గారికి కూడా కడుపు క్యాన్సర్ వచ్చినట్లు ఆయనే తెలిపారు. ఆయన తన క్యాన్సర్ సమస్యను ముందుగానే అనుమానించి పరీక్షలు చేయించడం వల్ల ప్రాథమిక దశలోనే బయటపడింది. అలా బయటపడినందుకు సరైన చికిత్స తీసుకొని క్యాన్సర్ నుండి పూర్తిగా ఆయన కోలుకున్నారు. 

ఇదంతా సామాన్యులకు కూడా సాధ్యమే!

అక్కడ ఆయనకు ఉన్నది..చాలా మందికి లేనిది..అవగాహన! 

క్యాన్సర్ పట్ల సరైన అవగాహనా కలిగి ఉన్నట్లయితే, క్యాన్సర్ మన శరీరానికి పంపే సంకేతాలను బట్టి మనం అనుమానించవచ్చు, వైద్యుడిని సంప్రదించవచ్చు..అందుకని క్యాన్సర్ పై అవగాహనను పెంచుకోవడం మనకు ఎంతగానో అవసరమైన విషయం. కొన్ని సార్లు ఏ దురలవాట్లు లేని వారికి, జీవన శైలి సరిగ్గా ఉన్న వారికి కూడా క్యాన్సర్ వస్తుంటుంది. క్యాన్సర్ ను నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అరుదుగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే మనకు అవగాహన సహాయపడుతుంది.

“నివారణకైనా..ప్రాథమిక నిర్దారణకైనా..క్యాన్సర్ పై అవగాహన అవసరం!” 

భారతదేశపు మొదటి సోలార్ అబ్జర్వేటరీ అయిన ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ రోజే సోమనాథ్ గారికి క్యాన్సర్ బయటపడిందట. సోమనాథ్ గారిది కేరళ, అంటే దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రం. మరో ఇంటరెస్టింగ్ విషయమేమిటంటే దక్షిణ భారతదేశంలో ప్రజలకు కడుపు క్యాన్సర్ రిస్క్ ఎక్కువట!

దక్షిణ భారతదేశంలో కడుపు క్యాన్సర్ రిస్క్ కు ముఖ్య కారణాలు!

మన ఇండియాలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఎక్కువగా తినేది అన్నం, ఉత్తరభారతదేశంలో అన్నం ఎక్కువగా తినరు. ఇంకా దక్షిణ భారతదేశంలో కారం ఎక్కువగా తింటారు. ఇలా కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు వేరు వేరుగా ఉన్నాయి.

కడుపు క్యాన్సర్ రావడానికి సాధారణంగా ఫ్యామిలీ హిస్టరీ మరియు జన్యుపరమైన కారణాలు పక్కన పెడితే, హెలికో బ్యాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ మరియు జీవనశైలిలో లోపాలు కారణమవుతాయి. తీవ్రమైన గ్యాస్త్రిక్ సమస్యలు కూడా ఈ క్యాన్సర్ కు కారణం అయ్యే అవకాశం ఉంది. 

సాధారణంగా ఆహారంలో అధికంగా ఉప్పు అధికంగా ఉన్న పచ్చళ్ళు , ప్రిజర్వ్ చేసిన ఆహారాలు వంటివి అధికంగా తినడం ఈ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాలు, తాజా పండ్లు మరియు కూరగాయలు తింటే ఈ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. దక్షిణ భారత దేశంలో ఉండే డైట్ లో అధిక ఉప్పు గల పచ్చళ్ళు ఉండటం కూడా ఒక రకంగా కడుపు క్యాన్సర్ రిస్క్ కు కారణం అవుతుంది. అలాగే ఈ అధిక ఉప్పు అనేది కడుపులో హెలికో బ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా కాలనైజేషన్ ను పెంచుతుందట. అది కూడా ఒక రకమైన గ్యాస్త్రిక్ క్యార్సినోజేన్ అంటే కడుపు క్యాన్సర్ రిస్క్ కు కారణం. 

దక్షిణ భారత దేశంలో రైస్ ఎక్కువగా తింటారు, దీని వల్ల ఫైబర్ కావలసినంత గా శరీరానికి అందదు. ఇంకా ఎక్కువగా కారం తింటారు, దీని వల్ల కూడా కడుపులో ఇన్ఫ్లమేషన్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది, ఇక తీర ప్రాంతాల్లో సాల్ట్ తో ప్రిజర్వ్ చేసిన ఫిష్, ఇతర ప్రాంతాలలో అధిక ఉప్పు గల పచ్చళ్ళు ఇలా ఇవన్ని ఆ ప్రాంతంలో కడుపు క్యాన్సర్ రిస్క్ ను పెంచుతున్నాయి  అనుకోవచ్చు. 

చివరిగా చెప్పేదేమిటంటే..

కొన్ని సార్లు మన ఆరోగ్యం కోసం మన జీవనశైలిని కూడా కాస్త మార్చుకోవడం మంచిది. అన్నం మోతాదు కాస్త తగ్గించి, తాజా కూరగాయలను సలాడ్ రూపం లో యాడ్ చేసుకుంటే బెటర్. అలాగే అధికంగా కారం, ఉప్పు తగ్గిస్తే క్యాన్సర్ రిస్క్ తో పాటూ బీపీ షుగర్ కి కూడా దూరం ఉండవచ్చు. 

Also read: Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స