పురుషులలో రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వస్తే ఏంటి పరిస్థితి?

You are currently viewing పురుషులలో రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వస్తే ఏంటి పరిస్థితి?

రొమ్ము క్యాన్సర్ సాధారణంగా మహిళల్లో మాత్రమే వస్తుంటుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ పురుషులలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కాకపొతే మహిళలతో పోలిస్తే పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సరును చాలా అరుదుగా చూస్తుంటాము. ఇందులో ముఖ్యంగా ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతూ ఉంటాయి. అందుకే మేల్ బ్రెస్ట్ క్యాన్సరును చాలా అరుదుగా పరిగణిస్తూ   ఉంటారు.

పురుషులలో రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది.?

మగవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ కూడా మహిళల్లో మాదిరిగానే గడ్డలా ఏర్పడి ఆ గడ్డ అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది, కానీ  మగవాళ్ళలో ఏర్పడే క్యాన్సర్ గడ్డలలో మహిళల్లో  మాదిరిగా కాకుండా ఎటువంటి నొప్పి ఉండదు. అందుకే చాలామంది ఈ క్యాన్సర్ గడ్డలను  పట్టించుకోకుండా నిర్లక్ష్యం  చేస్తుంటారు.

వాస్తవానికి పురుషులలో రొమ్ము కణజాలం ఎక్కువగా ఉండదు. కాబట్టి ఈ క్యాన్సర్ గడ్డ చర్మం మీద కానీ చాతీ లోపలి భాగంలో కానీ చేరి ఉంటుంది, కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. మగవారిలో బ్రెస్ట్ భాగంలో  క్యాన్సర్ గడ్డ వచ్చిందంటే ఆడవారిలో ఉండే దానికంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. కాబట్టి మగవారు ఈ రకమైన మేల్ బ్రెస్ట్ క్యాన్సర్లతో మరింత జాగ్రత్తగా ఉండాలి.

మగవాళ్ళ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:

  • రొమ్ములో ముద్ద దాదాపు ఎల్లప్పుడూ నొప్పిలేకుండా ఉంటుంది.
  • చనుమొన నుండి స్రవించడం (ఒక ఉత్సర్గ) రక్తంతో తడిసినది కావచ్చు.
  • రొమ్ములోకి చను మొన లోపలికి లాగబడి ఉండటం.
  • రొమ్ములో వాపు ఉండటం (గైనెకోమాస్టియా).
  • రొమ్ము చర్మంలో పుండు(ulcer) కలిగి ఉండటం.
  • చేయి కింద ముద్ద లేదా వాపు.
  • చనుమొన మీద లేదా చుట్టూ దద్దుర్లు.

వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్థారణ పరీక్షలు:

ఇక బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లోనైనా పురుషుల్లోనైనా ట్రీట్మెంట్ మాత్రం ఒకేవిధంగా ఉంటుది.  వ్యాధి నిర్ధారణ కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. రోగనిర్ధారణ కోసం మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ మరియు బయాప్సీ పరీక్షలే చేస్తారు. ఈ పరీక్షల్లో ఏదో ఒక పరీక్షలో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడే అవకాశముంటుంది.

చికిత్సా  విధానం:

యధావిధిగా సర్జరీ అంటే రెండో ఆలోచన లేకుండా ఆక్సిలరీ లింఫ్ నోడ్స్ (మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ)తో పాటు మొత్తం రొమ్ము కణజాలాన్ని తొలగించడం జరుగుతుంటుంది. హిస్టోపాథాలజీ నివేదిక ఆధారంగా సహాయక రేడియోథెరపీ, కీమోథెరపీ మరియు హార్మోన్ థెరపీలు ఇస్తూ ఉంటారు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఎలాంటి థెరపీలు చేయించుకున్నా ఒక్కటే విషయాన్ని గమనించాల్సిన అవసరముంది. వ్యాధి తగ్గుతుందా… వ్యాధి లక్షణాలు తగ్గుతున్నాయా గమనించాల్సిన అవసరం ఉంది.

వ్యాధి పునరావృతం కాకూడదన్న ఒకే ఒక ఉద్దేశ్యంతోనే ఎక్కువమంది ఆయుర్వేద విధానాన్ని ఆశ్రయిస్తుంటారు.

రసాయన ఆయుర్వేదంతో పురుషులలో రొమ్ము క్యాన్సర్ కి చెక్:

మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో కూడా రసాయన ఆయుర్వేదం దివ్యంగా పనిచేస్తుంది.  వ్యాధి మూలాల నుంచి రసాయన ఆయుర్వేదం సమర్ధవంతంగా క్యాన్సర్ కణాలను తొలగించుతూనే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.  కాబట్టి భయపడాల్సిన అవసరమేమీ లేదు. మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కూడా రసాయన ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇవి మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క పూర్తి వివరాలు.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also read: క్యాన్సర్‌కి రామబాణం – రసాయన ఆయుర్వేదం

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.