మిరాకిల్స్ చేసే మునగాకు మీ ఇంటి ధన్వంతరి మునగాకు

You are currently viewing మిరాకిల్స్ చేసే మునగాకు మీ ఇంటి ధన్వంతరి మునగాకు

ఎవరినైనా  పొగిడితే  మునగచెట్టు ఎక్కించకు అంటారు అంటే అంత ఎత్తుకు  లేదా అంత ఉన్నత స్థాయికి  తీసుకెళ్ళకు అనే భావంతో చెబుతారు. గొప్ప స్థాయి ని పోల్చడానికి వాడుతున్నారు అంటే ఈ మునగ అంత  గొప్పదని అర్ధం. మునగాకుతో మూడు వందల రోగాలు దూరం అంటున్నారు కొందరు వైద్య నిపుణులు అంటే దాదాపు  అన్ని వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తుందని భావం. 

మునగాకుతో చిరంజీవిగా జీవిస్తారు 

వృక్ష శాస్త్రంలో మునగాకుని Drumstick Leaves ‘మోరింగా ఒలియ ఫెర” అంటారు. ఈ ఆకు అందించే ప్రయోజనాల దృష్ట్యా  దీనిని ట్రీ ఆఫ్ లైఫ్, మిరకిల్ మోరింగా, మదర్స్ బెస్ట్ ఫ్రెండ్, డ్రమ్  స్టిక్ ట్రీ, నెబిడాయే అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఆఫ్రికన్ భాషలో నెబిడాయే అంటే మృత్యువు లేనిది అని అర్ధం. ఒకసారి నాటిన తర్వాత ఈ చెట్టు కాండాన్ని ఎన్ని సార్లు నరికినా మరల మరల పెరుగుతూనే ఉంటుంది.  అలాగే మునగాకులు, మునక్కాయలు, మునగ పూతను తినేవారు సంపూర్ణ ఆరోగ్యం తో చిరకాలం చిరంజీవిగా జీవిస్తారని భావించాలి.

పోషకాలు 

ఆయుర్వేద వైద్య శాస్త్రంలో దీనిని ౩౦౦ రకాల వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు. మునగాకులో  ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్, ఫైబర్, ఫాట్, ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అంతేకాదు విటమిన్ ఏ, బి 1, బి 2, బి ౩, విటమిన్ సి కూడా ఉంటాయి. మానవ శరీర నిర్మాణానికి  అమినో ఆసిడ్స్  దోహదపడుతాయి. ఇలా ఉపయోగపడే   20 అమినో ఆసిడ్స్ లో 19 మునగాకులోనే లభిస్తాయి.

బాడి డిటాక్సీ ఫికేషన్

ఇందులో ఉండే పీచు  పదార్ధం పేగులలో పేరుకుపోయిన వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపడానికి సహాయం చేస్తుంది. మలబద్దకం దూరం చేస్తుంది తద్వారా బాడిలో డిటాక్సీ ఫీ ఫికేషన్  ప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది.

ఉదర సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం హర్బల్ యాంటాసిడ్

మునగాకులో ఉండే  ఐసోథయోసయనెట్స్ , హైఫై లోరీ లు కడుపులో  పుండ్లను, మంటను తగ్గిస్తాయి. బ్యాక్టీరియ ను నిరోధిస్తాయి. హర్బల్ యాంటాసిడ్ గా పనిచేస్తుంది.  మునగాకు యొక్క యాంటి బ్యాక్టీరియల్ యాంటి మైక్రోబియల్ లక్షణం వలన శరీరంలో మొండి బ్యాక్టీరియను సైతం నివారిస్తుంది. యాంటి  బయోటిక్స్ కు కూడా లొంగని సాల్మనెల్ల ఇకోలి ,స్టాఫీలోకస్ అనే మొండి బ్యాక్టీరియను నివారించడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గుండెకు మేలు

మునగాకులో ఉండే ఇసోథియోసయనేట్స్  డయాబెటిస్ ను  కంట్రోల్ చెయ్యడానికి ,చేస్తాయి .కోలేస్త్రోల్ ను తగ్గించి ధమనుల్లో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఆస్తమా నివారిణి

మునగాకులో వుండే యాంటి ఇంఫ్లమాటరి గుణం వలన ఊపిరితిత్తుల వాపుని నివారిస్తుంది. శ్వాసక్రియ సాఫీగా  సాగుతుంది .దగ్గు గురక కూడా తగ్గించడానికి మునగాకు వినియోగం దోహదపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

యాంటి ఎలర్జిక్

ఎలర్జీలు అరికట్టడానికి కూడా మునగాకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటి ఎలర్జిక్ లక్షణం వలన ఎలర్జిక్ రైనైటిస్, ఎనాఫిలిక్స్ వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తుంది. డస్ట్ ఎలర్జీ ఉన్నవారికి మునగాకు మేలైన ఎంపిక .

కిడ్ని స్టోన్స్ నివారణకు

మునగాకు వేర్లు కూడా ఔషధ విలువలు కలిగి ఉంటాయి. కిడ్నిలో, గాల్ బ్లాడర్ లో, గర్భసంచుల్లో  స్టోన్స్  నివారించడంలో  మునగాకు బాగా పనిచేస్తుంది.

ఎడిమా అరికడుతుంది

మునగాకు యాంటి ఇంఫ్లమాటరి గా కుడా పనిచేస్తుంది, కీళ్ళు కాళ్ళు, శరీరం లో ఇతర భాగాలూ వాపు కు గురి కాకుండా చేసి  ఎడిమాను అరికడుతుంది.

పల్మనరి హైపర్ టెన్షన్ నివారిణి

ఇందులో ఉండే  నియోజేనిన్స్, ఐసోథియోసయనేట్లు  ఆర్టరిస్ గట్టి పడకుండా నిరోధించి  పల్మనరి హైపర్ టెన్షన్ ను నివారిస్తాయి.

ఆత్మహత్యలు  అరికడుతుంది

మునగాకు ఆరోగ్య ప్రదాయినే కాదు ప్రాణ రక్షణకు కూడా దోహదపడుతుంది..మన మెదడులో ఉండే మోనోఅమైన్స్   నోర్ పైన్ ఫ్రైన్ ,  సెరోటినిన్ డొపమైన్స్ ను  స్స్థిరీకరించి ప్రతికూల భావాలను తొలగిస్తుంది, డిప్రెషన్ ను నిరోధించి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆవేశపూరిత ఆలోచనలను  అరికడుతుందని నిపుణులు చెబుతున్నారు.  అబ్బురపరిచే ఈ ఉపయోగం వలనేనేమో మునగాకులు, మునక్కాయలు, మునగ పూతను తినేవారు సంపూర్ణ ఆరోగ్యం తో చిరకాలం చిరంజీవిగా జీవిస్తారని చెబుతారు.

స్ట్రెస్ రిలీవర్

శరీరంలోని స్ట్రెస్ హార్మోన్లను నియత్రించి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. శరీరాన్ని హోమియోస్టాసిస్ అంటే యధాస్థితిలో కొనసాగించడానికి దోహదపడుతుంది. మెదడు పై ప్రభావవంతంగా పని చేయడం వలన ఇది అల్జీమర్స్ను, అరికట్టడంలో ,నరాల బలహీనతను నివారించడంలో  కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

క్యాన్సర్ కంట్రోల్

మునగ ఆకులు, కాయలు, గింజల లో కూడా పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల  నుండి కూడా రక్షిస్తాయి  క్యాన్సర్ కంట్రోల్ లో కీలకపాత్ర వహిస్తాయి. ఇందులో ఉండే ఫ్లవనయిడ్స్, ఫినోలెక్ కంపౌన్డ్స్,పాలిఫెనా ల్స్. శరీరంలో క్యాన్సర్ కణాలు పుట్టకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్తో పోరాడే శక్తి ని పెంచుతాయి. యాంటి ఆక్సిడెంట్స్ , బీటాకెరోటిన్, క్లోరోజేనిక్ యాసిడ్ మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు గురి కాకుండా చేస్తాయి.క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తాయి.

ముగింపు

ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే మునగాకుని  పోషకాల గనిగా చెప్పవచ్చు. మునగాకుని నిత్య ఆహారంలో చేర్చుకోండి. మన శరీరానికి కావలసిన అన్ని పోషక విలువలూ మునగాకులోనే లభిస్తాయి. అంతేకాదు వ్యాధు గ్రస్తులు వైద్యంతో పాటు, తమ ఆహారంలో మునగాకు చేర్చుకుని ఆరోగ్యం పొందిన దాఖలాలు కోకొల్లలు. మునగాకు సూపర్ ఫుడ్స్ కె సూపర్ఫుడ్. రోగ నిరోధకశక్తి , దేహ బలం, మానసిక ఆరోగ్యం అన్నీ  అందిస్తుంది, అందుకే మునగాకుని ఆరోగ్యప్రదాయిని, కల్పవృక్షం, కామధేను అంటారు..

Also Read: ఆర్గానిక్ ఫుడ్స్ అసలు అర్థం ఏంటి?

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.