పిల్లలను సరిగ్గా పెంచడానికి సహాయపడే ‘పెరెంటింగ్ టిప్స్’

You are currently viewing పిల్లలను సరిగ్గా పెంచడానికి సహాయపడే ‘పెరెంటింగ్ టిప్స్’

పిల్లలను సరిగ్గా పెంచటం ఈ తరంలో అంత సులభమైన పని కాదు, మారుతున్న కాలం వల్ల చాలా అడ్వాన్స్ అయిన మనస్తత్వాల మధ్యలో మంచి పెరెంటింగ్ అనేది ఎంతో అవసరం. 

పిల్లలను అర్థంచేసుకొని సరైన విధానంలో పెంచడానికి ఐదు పెరెంటింగ్ టిప్స్

1.తక్కువ అంచనా వేయకండి..అర్థంచేసుకోవటానికి ప్రయత్నించండి. 

ప్రతీ ఒక్కరిలో ఒక ట్యాలెంట్ ఉంటుంది, మీ పిల్లలకు మీరు అనుకున్నదే  ఖచ్చితంగా ట్యాలెంట్ గా ఉండకపోవచ్చు. మరేదైనా ప్రత్యేకమైనది ఉండవచ్చు. అందుకని మీరు ఏదైనా పిల్లలు చేయలేకపోతే అది వారి బలహీనతగా చూడకండి వారి బలమేంటో అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. కొందరు పాటలు ద్యాండ్ అంటూ యాక్టివ్ గా వీటిలో పాల్గోనకపోవచ్చు వాళ్లకు బొమ్మలు గీయటం వంటి మరో విషయంలో మంచి ప్రజ్ఞ ఉండవచ్చు.అందుకనీ పిల్లలు వేటిలో ఆసక్తి చూపుతున్నారు, వారి ఇష్టాలేంటి అనేవి గమనిస్తూ ఉంది వారికి నచ్చిన కళల్లో మరింత ముందుకెళ్ళేలా ప్రోత్సహిస్తే అందులో ఆనందంగా ఉంటారు. అందువల్ల మీరు అనుకున్నాదో లేక చెప్పిందో చేయలేదని విసుక్కోకుండా వారికి ఎందులో ఆసక్తి ఉందో అర్తంచేసుకోవటం మంచిది.

2.ఎవరితోనూ పోల్చకండి. 

పిల్లల్ని పక్కింటి వాళ్ళతోనో లేక క్లాస్ లో ఇంకొకరితోనో పోల్చకండి. ప్రతీ ఒక్కరూ ఒకే మైండ్ తో ఇక్కడ ఉండరు,ఎవరి తెలివితేటలూ వాళ్ళవి. ఒకరికి ఒక సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు వస్తే ఇంకొకరికి ఇంకేదో సబ్జెక్ట్ లో రావచ్చు. అంతమాత్రాన చదవట్లేదని కాదు కదా. మనం పోల్చి చూసి తక్కువ చేసి మాట్లాడితే పిల్లల సున్నితమైన మనసు ఎక్కువగా బాధపడుతుంది. పిల్లలని మానసికంగా ధృడంగా ఉండేలా పెంచాలి.

3.అలవాట్లను గమనిస్తూ ఉండండి..అవసరమైనప్పుడు సరైన  సలహా ఇవ్వండి. 

పిల్లలకు ఎప్పుడూ మంచి అలవాట్లనే నేర్పండి, వాళ్ళ అలవాట్లను ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. సరైన ఆహార అలవాట్లు, నిద్ర అలవాట్లు అనేవి పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. పిల్లల అలవాట్లలో ఏదైనా తేడ గమనిస్తే కోపంతో కాకుండా వారికి అర్థమయ్యేలాగా ప్రేమగా చెప్పి వాటిని సరి చేయండి. కోపం చూపించకండి. వాళ్లకు అవసరమైనప్పుడు సరైన సలహా అందింకాడానికి మీరు ఉన్నారనే భరోసా ఇవ్వండి.

4.వాళ్లకు మీరు మంచి రోల్ మోడల్ గా ఉండండి. 

పిల్లలు మీరు చెప్పింది ఎంతవరకు చేస్తారో కానీ.. మీరు చేసింది అయితే ఖచ్చితంగా చేస్తారు. పిల్లల ముందు మీ మాటతీరు కానీ,మీ ప్రవర్తన కానీ సౌమ్యంగా ఉండేలా చోసుకోండి. వాళ్ళ ముందు మీరు  కోపంగా, చిరాగ్గా ఉంది అరుస్తూ ఉంటే వాళ్ళ మనసులలో అది నాటుకుపోతుంది. వాళ్ళకు మీరొక రోల్ మోడల్ లా ఉండండి.

5.వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించండి. 

తప్పనిసరిగా పిల్లల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించండి, ఆ సమయం మీరు పిల్లల్ని అర్థం చేసుకోవటానికి అవసరం. అలాగే ఆ సమయంలో పిల్లలకు మీకు మధ్యలో కమ్యునికేషన్ అనేది బలపడుతుంది. వాళ్లతో స్నేహంగా ఉండండి. వాళ్లకు కేటాయించిన సమయంలో వాళ్ళకు నచ్చింది చేయనివ్వండి అందులో మీరు భాగమవ్వండి. పిల్లలను ఎంత బాగా అర్తంచేసుకోగలిగితే అంతలా వాళ్ళను సరైన మార్గంలో వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు. 

మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి  ఈ క్రింది  లింక్ పై క్లిక్ చేయండి.

Also Read: ఆరోగ్యం కోసం అందరికీ అందుబాటులో ఉండే సూపర్ ఫుడ్స్