రసాయన ఆయుర్వేదం అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

You are currently viewing రసాయన ఆయుర్వేదం అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

రసాయన ఆయుర్వేదం

ఆయుర్వేదం మన విలువైన సంపద. ఆయుర్వేదానికి ఉన్న ఎనిమిది శాఖలలో రసాయన ఆయుర్వేదం కూడా ఒకటి. రసాయన ఆయుర్వేదం ఆరోగ్యాన్ని మెరుగు చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాగే జీవిత కాలాన్ని పెంచటంలో, మానసిక ధృడత్వాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

రసాయన ఆయుర్వేదం మన శరీరంలోని ధాతువులను సరైనవిగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. సుశ్రుత సంహిత ప్రకారం రసాయన ఆయుర్వేదం ఆరోగ్యమైన దీర్ఘాయువుకు ఒక సమాధానం లాంటిది అని రాసి ఉంది. యవ్వనంగా ఆరోగ్యంగా ఉండటంలో రసాయన ఆయుర్వేదం సహాయం చేస్తుంది. అలాగే రసాయన ఆయుర్వేదం రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులను కూడా  నయం చేయగలదు. 

రసాయన ఆయుర్వేదంలో ముఖ్య విభాగాలు

రసాయన ఆయుర్వేదంలో ముఖ్య విభాగాలలో మొదటిది  కుటి ప్రవేశిక మరియు రెండవది వాతాతపిక.

కుటి ప్రవేశిక 

కుటి ప్రవేశిక రసాయన అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తారు, ఈ చికిత్స చేయటానికి వ్యక్తి చికిత్స ముగిసేదాకా నిర్దేశిత ఆశ్రమంలో ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్స వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి దీర్ఘాయువు పొందుతారు.

వాతాతపిక

వాతతపిక రసాయన అనే  విధానాన్నే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాము.వాతతపిక రసాయన అనేది ఒకే ప్రదేశంలో ఉండాల్సిన పని లేకుండా తమ పని తాము చేసుకుంటూ ఎక్కడ ఉంది అయినా ఉపయోగించవచ్చు .

ఈ వాతతపిక రసాయనంలో కామ్యరసయన,నైమిత్తిక రసాయన మరియు అజశ్రిక రసాయన అనే విధానాలు ఉన్నాయి.

మొదటిది కామ్య రసాయన 

ఏదైనా సరైన కారణంచేత చికిత్స చేస్తే దానినే కామ్య రసాయన అంటారు. ఇందులో ప్రాణ కామ, మేధా కామ, శ్రీ కామ అనే మూడు విధానాలు కనిపిస్తాయి. మొదటిది 

  • ప్రాణ కామ అంటే శారీరక సమస్యలను సరిచేయటానికి లేదా శారీరక ధృడత్వాన్ని అందించటానికి చేసే చికిత్స, ఇందులో ఆమ్లా, గుడుచి, అశ్వగంధ వంటి మూలికలు ఉపయోగిస్తారు.
  • రెండవది మేధా కామ అంటే మానసిక మరియు మేధకు సంబంధించిన సమస్యలకు చేసే చికిత్స, ఇందులో బ్రాహ్మి, శంకపుశష్పి,జ్యోతిష్మతి వంటి మూలికలు ఉపయోగిస్తారు.
  • ఇక మూడవది శ్రీ కామ ఇది పూర్తీ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు, ఇందులో త్రిఫల, అశ్వగంధ, భ్రింగరాజ వంటి మూలికలు ఉపయోగిస్తారు.

రెండవది నైమిత్తిక రసాయన

నైమిత్తిక రసాయన అనేది ఏదైనా ఆరోగ్య సమస్యను తగ్గించటానికి కానీ నివారించటానికి కానీ సహాయపడే విధానం.ఇందులో సమస్యకు తగ్గట్టుగా మూలికను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ప్రమేహ అనగా డయాబెటిస్ కోసం హరిద్ర, శిలాజిత్, ఆమలాకి వంటి మూలికలు ఉపయోగిస్తారు. నరాల సమస్యకు బల, అతిబల వంటివి. చర్మ సమస్యలకు తువారక, గుడుచి, భ్రింగరాజ ఉపయోగిస్తారు.

ఇలా సమస్యకు తగ్గట్టుగా ఇందులో రసాయనాలను ఉపయోగిస్తారు.

మూడవది ఆజశ్రిక రసాయన

ఇందులో మనం రోజు తీసుకునే నెయ్యి, పాలు వంటివి వస్తాయి, ఇవి మన రోజు వారి జీవితంలో మన ఆరోగ్యానికి సహాయం చేస్తాయి.

ఆహార – విహార – ఔషధ 

రసాయన ఆయుర్వేదాన్ని మరో రకంగా విభజిస్తే ఆహార,విహార,ఔషధ అనే మూడు భాగాలుగా చూడవచ్చు.

  • ఆహార అంటే మనం తినే ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది అయ్యి ఉండాలి అని ,ఆయుర్వేదం ప్రకారం తినే ఆహారంలో షడ్రుచులు ఉండాలట అలా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
  • విహార అంటే శరీరానికి మరియు రోజు చేసే క్రియకు సంబంధించినది, ఇందులో రోజూ ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి చేసే స్నానం నుండి తగినంత సమయం నిద్ర పోవటం, ధ్యానం చేయటం, సమయానికి ఆహరం తీసుకోవటం వంటివి ఉంటాయి.
  • ఇక ఔషధ అంటే ఆరోగ్యానికి వచ్చే సమస్యలకు పరిష్కారం రసాయనాల ద్వారా చూపించటం.

రసాయన ఆయుర్వేదాన్ని ఏ వయసులో ఉన్నవాళ్ళు అయినా ఉపయోగించవచ్చు, సమస్య ఉంటే పరిష్కారం కోసం ఉపయోగించవచ్చు లేదా ఆరోగ్యంగా ఉండటానికి, శక్తిని పెంచుకోవటానికి కూడా ఉపయోగించవచ్చు.

రసాయన ఆయుర్వేదం పని తీరు 

రసాయన ఆయుర్వేదంలో చికిత్స తీసుకునే తప్పుడు ఏదైనా రసాయన ద్రవ్యం తీసుకున్నప్పుడు ముందు ఆ ద్రవ్యం అగ్ని అనగా జీర్ణ వ్యవస్థలోకి వెళుతుంది, జీర్ణ క్రియ పూర్తి అయిన తరువాత అది మన బాడీ టిష్యుస్ లో కలిసి అక్కడి నుండి మైక్రో సర్కులేషన్ జరిగి శరీరంలోని ఇతర టిష్యుస్ లోకి వెళ్లి సమస్యను సరిచేస్తుంది. ఈ విధంగా రసాయన ఆయుర్వేద ఆరోగ్య సమస్యలను సరి చేయగలదు అలాగే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేయగలదు.

 రసాయన ఆయుర్వేదంలో రసాయనాలు పనిచేసే ప్రక్రియలలో  అగ్ని దీపన, అంటే జీర్ణ వ్యవస్థను జీవక్రియను సరిచేయటం. ఆమపాచన, అంటే శరీరంలోని టాక్సిన్స్ ను తీసివేయటం. 

మేధ్య ,అంటే శక్తిని మెరుగుపరచడం, బాడీ టిష్యుస్ ను సరిచేయటం, ఇలా వివిధ రకాలు ఉంటాయి.

రసాయన ఆయుర్వేదం వల్ల మాడరన్ మెడిసిన్ దృష్ట్యా జరిగే చర్యలు 

  • యాంటీఆక్సిడెంట్ చర్య

అనేక మొక్కల ఆధారిత ఆహారాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, హానికరమైన ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా శరీరం యొక్క రక్షణలో సహాయపడే అణువులు. ఈ ఫ్రీ రాడికల్స్ మధుమేహం మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించటంలో  సంబంధం కలిగి ఉంటాయి.

  • ఇమ్యునోమోడ్యులేటరీ చర్య

ఇమ్యునోమోడ్యులేటర్లు శరీరం యొక్క రోగనిరోధక ప్రతిస్పందనను మార్చే మందులను సూచిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ అనేది అవయవాలు, తెల్ల రక్త కణాలు, ప్రొటీన్లు మరియు ఇతర రసాయన పదార్ధాలతో కూడిన సంక్లిష్టమైన నెట్‌వర్క్, వివిధ సమస్యల నుండి రక్షించడానికి కలిసి పని చేస్తుంది. జెర్మ్స్ మరియు క్యాన్సర్ కణాలు వంటి చెడు కణాలను ఎదుర్కొన్నప్పుడు, బలమైన రోగనిరోధక వ్యవస్థ వాటిపై రాడుతుంది.

  • హేమోపోయిటిక్ ప్రభావం

రక్త కణ భాగాలను ఉత్పత్తి చేసే ప్రక్రియ అయిన హేమాటోపోయిసిస్, రక్త వ్యవస్థను ఉత్పత్తి చేయడానికి మరియు తిరిగి నింపడానికి పిండం అభివృద్ధి మరియు యుక్తవయస్సు రెండింటిలోనూ జరుగుతుంది. హేమాటోపోయిసిస్ అధ్యయనం వల్ల  వైద్యులకు రక్త రుగ్మతలు మరియు క్యాన్సర్‌ల గురించి లోతైన అవగాహనను అందిస్తుంది.

  •  అడాప్టోజెనిక్ చర్య

అడాప్టోజెన్లను ఉపయోగించడం అంటే శరీరాన్ని సమతుల్య స్థితికి పునరుద్ధరించడం, దీనిని హోమియోస్టాసిస్ అని పిలుస్తారు. అడాప్టోజెన్‌లు మీ శరీరంలో రసాయన ప్రతిచర్యలను పెంచే లేదా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు మరియు కార్టిసాల్ స్థాయిలను పెంచినప్పుడు, కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి అడాప్టోజెన్‌లు పని చేస్తాయి.

  •  యాంటీ ఏజింగ్ చర్య

యాంటీ ఏజింగ్  అనేది వృద్ధాప్య ప్రక్రియను మందగించడం, నిరోధించడం లేదా తిప్పికొట్టడం మరియు ఆరోగ్యంగా మరియు జీవశాస్త్రపరంగా సమర్థవంతంగా ఉండటాన్ని ప్రత్యేకంగా సూచిస్తుంది.

  • అనాబాలిక్ చర్య

అనాబాలిక్ మరియు క్యాటాబోలిక్ ప్రక్రియలు సమతుల్యంగా ఉంటే, కణజాలం చెక్కుచెదరకుండా ఉంటుంది మరియు మంచి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 

  • పోషక పనితీరు

పోషకాల యొక్క ముఖ్యమైన విధులు  శరీరానికి శక్తి యొక్క ప్రధాన వనరుగా పనిచేయటం. అవి శరీర కణజాలాలను నిర్మించడంలో మరియు మరమ్మత్తు చేయడంలో సహాయపడతాయి. 

  • న్యూరోప్రొటెక్టివ్ చర్య

న్యూరోప్రొటెక్షన్ అనేది తీవ్రమైన (ఉదా. గాయం లేదా స్ట్రోక్) మరియు దీర్ఘకాలిక న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ (ఉదా. గాయం లేదా స్ట్రోక్) రెండింటి వల్ల కలిగే గాయం నుండి కేంద్ర నాడీ వ్యవస్థ (CNS)ని రక్షించడానికి ఉపయోగించే యంత్రాంగాలు మరియు వ్యూహాలను సూచిస్తుంది.

చివరగా:

ఆయుర్వేదం యొక్క పవిత్ర గ్రంథాల ఆధారంగా శాస్త్రీయ ఆయుర్వేదాన్ని పాటించటం ద్వారా దీర్ఘాయువు మరియు యవ్వనాన్ని ఇవ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం రసాయన ఆయుర్వేదం యొక్క లక్ష్యం. 

Also read: Breast Cancer Symptoms: బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు