మనిషి ఆరోగ్యానికి దోహదపడేవి జీవన విధానం,ఆహారం ,ఆలోచనా దృక్పధం. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కోలుకోవడానికి చికిత్స తో పాటు తగిన ఆహారం కూడా అవసరం. ఆహారమే ఔషధం అన్నారు. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్ధాలు తీసుకోవాలి..ఈ వీడియోలో క్యాన్సర్ బాధితులకు మేలు చేసే మరియు యాంటి క్యాన్సర్ గుణాలను పెంచే టాప్ 8 యాంటి క్యాన్సర్ ఫుడ్స్ గురుంచి తెలుసుకుందాం.
ఈ జాబితాలో ముందుగా చెప్పుకునేవి సిట్రస్ పండ్లు .
1. సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లలో విటమిన్ సి సమృద్దిగా వుంటుంది. ఇది శరీరంలో బ్యాక్టీరియ తో పోరాడే శక్తి నిస్తుంది.రోగ నిరోధక శక్తి పెంచుతుంది నారింజ , నిమ్మ వంటి సిట్రస్ పండ్లు క్యాన్సర్ బాధితులలో ఇమ్యునిటి బూస్టింగ్ కు సహాయపడుతాయి.
వీటిలో విటమిన్ సి, b6 పొటాషియమ్, మెగ్నిషియమ్ వంటి మినరల్స్, ఫైబర్ తో పాటు క్యాన్సర్ కణాలను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఫ్లెవనాయిడ్స్ ,ఫినోలిక్ యాసిడ్స్, అన్తోసీయానిన్స్, స్టిల్బిన్స్, లిపిడ్స్ వంటి బయోయాక్టీవ్ మాలిక్యూల్స్ ఉంటాయి ఇవి శరీరంలో ట్యూమర్లను పుట్టించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి.
2. బ్లూబెర్రీ
బ్లూబెర్రీలలో ప్రోటీన్లు, విటమిన్ సి, ఈ ,పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ఫైబర్,కాలోరిస్ వుంటాయి. క్యాన్సర్ కణాలను అరికట్టడంలో బ్లూబెర్రీల్లోని అన్తోసీయానిన్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఇవి శ్వాస కోశ వ్యవస్థ పై సమర్ధవంతంగా పనిచేసి శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులను నిరోధిస్తాయి. ప్రతిరోజూ బ్లూబర్రీలతో పాటు బ్లాక్ బెర్రీలు కూడా తీసుకోవడం మంచిది.
3. కాలిఫ్లవర్
క్రూసిఫెరస్ కాయగూరలు అంటే క్యాబేజీ, కాలిఫ్లవర్,లలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువ. వీటిలోని ఫ్లేవనాయిడ్లు, కెరాటినాయిడ్లు, బీటా కెరాటిన్, టూటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్ సెల్స్ ను అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి.
4. టమాటా
టమాటాలోని లైకోపిన్ రసాయనం క్యాన్సర్ కణాలు విస్తరించకుండా ఆపుతుంది. టమాటాలో విటమిన్ ఏ, సి, ఇ ఉంటాయి. వీటిలో వుండే ఫైటో కెమికల్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి..
5. గ్రీన్ టీ
క్యాన్సర్ బాధితుల డైట్ చార్ట్ లో మరొకటి గ్రీన్ టీ. ప్రతిరోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి లభిస్తుంది. గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్‌ల వలన క్యాన్సర్ నుండి రక్షణ లభిస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లు మరియు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి దోహదపడుతుంది. మెదడుపనితీరు మెరుగుపడుతుంది ,ఫాట్ బర్న్ అవుతుంది. ఊబకాయాన్ని నిరోధిస్తుంది.గుండె జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది.
6. పసుపు
కూరకాయలు పండ్లతో పాటు మన వంటింట్లో లభ్యమయ్యే కొన్ని పదార్ధాలు కూడా క్యాన్సర్ బాధితులకు మేలు చేస్తాయి. వాటిలో ఒకటి పసుపు. పసుపులో మెడికల్ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. పసుపులోని కుర్కుమిన్ క్యాన్సర్ వ్యాధిపై అద్భుతంగా పోరాడుతుంది. శరీరంలో వున్న కాన్సర్ కణాలను చంపి క్యాన్సర్ కణాలు వృద్ధికాకుండా సమర్ధవంతంగా అడ్డుకుంటుంది. దానివల్ల కాన్సర్ వేగంగా తగ్గే అవకాశాలు ఎక్కువ వుంటాయి. క్యాన్సర్ తోపాటు అర్ధరైటిస్, అల్జీమర్స్, గుండె సంబంధిత రోగాలకు కూడా పసుపు ఉపయోగపడుతుంది.
7. బ్రోకలీ
బ్రోకలీలో ప్రత్యేకంగా, సల్ఫోరాఫేన్ అని ఫైటోకెమికల్ అధిక మొత్తంలో ఉంటుంది., ఇది క్యాన్సర్తో పోరాటం చేసే మొక్కల సమ్మేళనం. బ్రోకలీ తీసుకోవడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ మరియు నోటి క్యాన్సర్ల ప్రమాదాలను తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
8. పోషకాల కల్పవల్లి వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. విటమిన్- బి6, విటమిన్-సి, మాంగనీస్, సెలీనియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి.. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే క్యాన్సర్ కణాల నియంత్రణలో వెల్లుల్లి నిర్ణయాత్మకపాత్ర పోషిస్తుందని చెబుతారు. పచ్చి వెల్లుల్లి తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వెల్లులి తినడం వల్ల మీ శరీరంలో వున్న కొలెస్ట్రాల్ ను తగిస్తుంది. దాని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి.
వెల్లుల్లిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు అర్థరైటిస్, వ్యాధుల నుండి రక్షణ ఇస్తాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని భారీ లోహాలను డిటాక్సిఫై చేయవచ్చు..జీర్ణవ్యవస్థ ఉత్తేజితమయ్యి ఆకలి పుడుతుంది…. వెల్లులులోని విటమిన్-సి నోటిపూత, నోట్లో పొక్కులు. ఎర్రటి మచ్చాలకు, ఇంకా ఇతర నోటివ్యాధుల నుండి రక్షణనిస్తుంది. వెల్లులి శరీరంలో కొవ్వు కణాలు పేరుకు పోకుండా చూస్తుంది.
క్యాన్సర్ పేషంట్లు చికిత్స తో పాటు ఈ విధంగా ప్రకృతిలో లభించే పోషక ఆహారం తీసుకుంటే మందులకు అనుగుణంగా శరీరం స్పందించే లా శక్తి పొందవచ్చు. సహజ పద్దతిలో రోగ నిరోధక శక్తి పెంచుకుని క్యాన్సర్ ను జయించవచ్చు అలాగే ఆరోగ్యంగా ఉన్నవారు ఈ టాప్ 8 క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ కు దూరంగా ఉండడానికి కావాల్సిన ఇమ్మ్యూనిటి పెంచుకోవచ్చు.
Also Read: లోబీపి ఉన్న వారు తినాల్సిన ఆహారాలు