మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు మరియు ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు అంటే ఏమిటి ?

You are currently viewing మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు మరియు ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు అంటే ఏమిటి ?

Malignant Tumor : మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు క్యాన్సర్ కారకాలు. వీటినే ప్రాణాంతక కణతులు అని కూడా అంటారు. మన శరీరంలోని జీవకణాలు, క్యాన్సర్ కణాలుగా  మారి ఒకే చోట గుమి గూడినప్పుడు ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు  ఏర్పడుతుంటాయి. ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు ఏర్పడటానికి ముందు ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు ఏర్పడుతాయి. ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు  ఏర్పడిన తర్వాత వీటిని త్వరగా గుర్తించకపోతే  ఇవి కాస్తా మ్యాలిగ్నెంట్ ట్యూమర్లుగా మారుతాయి. కాబట్టి ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లను  త్వరగా గుర్తించి చికిత్స  తీసుకుంటే  క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశాలు  తక్కువగా ఉంటాయి.ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు మన శరీరంలో ఏ శరీర బాగంలోనైనా ఏర్పడగలవు. అలాగే తక్కువ సమయంలోనే పెద్దగా పెరగడం ఒక చోట నుంచి ఇంకో చోటకి  స్ప్రెడ్ అవ్వడం ఇతర శరీర భాగాలనును డ్యామేజ్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఈ క్యాన్సర్ ట్యూమర్లు ఒకచోట నుంచి  ఇంకో చోటకి అంటే ఇతర శరీర భాగలకి స్ప్రెడ్ అవ్వడాన్నే మెటాస్టాటిస్ అని అంటారు.

మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు ఏర్పడినప్పుడు కనిపించే లక్షణాలు :

ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ సమస్య కలిగి ఉన్న వ్యక్తులలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా అలసట ఎక్కువగా ఉండటం, శ్వాస సరిగ్గా ఆడకపోవటం, రక్త హీనత సమస్యలు ఉండటం, అతిసార సమస్య అలాగే ఉన్నట్టుండి బరువు తగ్గడం,రాత్రి సమయంలో చెమటలు అధికంగా పట్టటం వీటితోపాటూ ఎప్పుడైనా శరీరాన్ని తడుముకున్నా లేదా శరీరంలో గడ్డలు కదిలినట్లు అనిపించటం.ఇవన్నీ కూడా ట్యూమర్స్ లక్షణాలే.

నిర్థారణ పరీక్షలు:

మనలో మొదలయ్యే ఈ లక్షణాలను బట్టి అది మ్యాలిగ్నెంట్ ట్యూమరా లేక బినైన్ ట్యూమరా అని ముందే గుర్తించడానికి సాధ్యపడదు. దీనికోసం క్యాన్సర్ నిర్ధారణలో ఉపయోగించే ఇమేజింగ్ పరీక్షలలో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటే CT స్కాన్, బోన్ స్కాన్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ స్కాన్ అంటే MRI స్కాన్, PET స్కాన్ అలాగే  అల్ట్రాసౌండ్ ఎక్స్-రే వంటి పరీక్షలు చేయవంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి వీటితోపాటూ జీవాణు పరీక్షలు అంటే బయాప్సీ టెస్టులు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ  బయాప్సీ పరీక్ష  సమయంలో కొంత కణజాలం సేకరించి ల్యాబ్ కి పంపించి టెస్టులు చేస్తారు. ఈ విధంగా మనం ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లను నిర్థారిస్తూ ఉంటారు.

 మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు  ఎన్ని రకాలు :

మ్యాలిగ్నెంట్  ట్యూమర్లు 4 రకాలు. అవి కార్సినోమా, సార్కోమాస్, లుకేమియా, లింఫోమా. వీటి గురించి కూడా ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

కార్సినోమా క్యాన్సర్లు  మన బాడీలో చర్మంతో అలాగే చర్మ కణజాలంతో సంబంధం కలిగి ఉన్న శరీర భాగాలలో సోకుతుంది. అయితే క్యాన్సర్ కేసుల్లో దాదాపు 90% వరకు కార్సినోమాలు మన అవయవాల చర్మం లేదా లైనింగ్‌లలో ఉండే  ఎపిథీలియల్ కణజాలం ద్వారానే ఎఫెక్ట్ అవుతుంటాయి.

ఈ క్రమంలో సాధారణ కార్సినోమాలలో  చర్మం, రొమ్ము, ప్రోస్టేట్, మూత్రాశయం, గర్భాశయం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు మరియు పురీషనాళం ఇలాంటి శరీర భాగాలకి  ఈ క్యాన్సర్ సోకుతుంటుంది.

సార్కోమా క్యాన్సర్ ట్యూమర్లు. ఈ రకమైన క్యాన్సర్ ట్యూమర్లు  ఎముకలు  మృదులాస్థి  కండరాలు, ప్లీహం అలాగే   కొవ్వు వంటివాటి కణజాలాలలో ప్రారంభమవుతుంది. ఇవి ఇతర క్యాన్సర్ల  మాదిరిగా కాకుండా  యువకులలో సార్కోమా క్యాన్సర్లు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక లుకేమియా క్యాన్సర్ విషయానికొస్తే లుకేమియా క్యాన్సర్ ని బ్లడ్ క్యాన్సర్  అని కూడా పిలుస్తారు. ఈ బ్లడ్ క్యాన్సర్ సోకినప్పుడు  రక్త కణాలు సాధారణ స్తితిలో కాకుండా  అసాధారణ రీతిలో  పెరుగుతుంటాయి. కానీ లుకేమియా క్యాన్సర్లలో  దాదాపుగా క్యాన్సర్ గడ్డలు ఏర్పడవు.  కానీ ఈ క్యాన్సర్ సోకినప్పుడు రక్తహీనత ,అలసట మరియు రక్తం గడ్డకట్టే సమస్యలకు దారితీస్తుంది.

లింఫోమా.ఈ రకమైన క్యాన్సర్ శోషరస వ్యవస్థ అంటే లింఫాస్టిక్ సిస్టమ్ ని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో లింఫ్ వెజిల్స్ అలాగే లింఫ్ నోడ్స్ వంటివాటిని ప్రభావితం చేస్తూ అభివృద్ధి చెందుతుంది.  లింఫోమాలు మన శరీరంలో ఎక్కువగా మెడ, అండర్ ఆర్మ్ లేదా గజ్జ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి  వీటి చుట్టూ  ఉన్న బాడీ  పార్ట్స్ ఎక్కువగా ఈ లింఫోమా క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంటుంది.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also read: పేగు(కొలోన్ ) క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స