సేంద్రియ విధానం లో పండించిన కూరగాయలకు కానీ పండ్లకు కానీ మార్కట్ లో చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే అవి మిగతా వాటికన్నా ఖరీదైనవి గా ఉంటాయి. ఈ ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు తినడం వల్ల మన శరీరానికి కావలసినన్ని పోషకాలు అందడమే కాకుండా కెమికల్స్ కి దూరంగా ఉండొచ్చని వీటిని జనాలు ప్రిఫర్ చేస్తుంటారు.
ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు నిజంగా ఆర్గానిక్ గా పండించినవా కాదా అని కానీ ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి ఇది పూర్తిగా చదివి తెలుసుకోండి.
ముందు ఆసలు ఆర్గానిక్ అనే పదానికి అర్థం తెలుసుకోవలసిన అవసరం మనకుంది. సేంద్రియ వ్యవసాయం లో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించరు. జంతువుల నుండి, మొక్కల నుండి వచ్చిన వ్యర్థాలానే ఎరువులుగా వేసి మొక్కలను పెంచుతుంటారు. అసలు కెమికల్ జాడ కనపడకుండా, ప్రకృతి కి హాని కలగకుండా స్వచ్చంగా పండ్లు కూరగాయలను ఈ సేంద్రియ సేద్యం లో పండిస్తుంటారు.
ఒక వేళ ఎటువంటి కెమికల్ కలవని మట్టిలో, ఎటువంటి కెమికల్స్ కలవని స్వచ్చమైన నీటితో, ఎటువంటి కెమికల్స్ లేని గాలి వీచే చోట చేసే సేంద్రియ వ్యవసాయమే ఒరిజినల్ ఆర్గానిక్ పండ్లను, కూరగాయలను ఇవ్వగలదు. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం లో అలాంటి చోటు ఉందా?
మీరే ఆలోచించండి..
ఇప్పుడు మనం తినే ఆర్గానిక్ అనే పేరుతొ దొరికే కూరగాయలు, పండ్లు వంద శాతం కాకున్నా తొంభై శాతం వరకు ఆర్గానిక్ అని అనుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే వీటిలో రుచి మరియు పోషకాలు వీటిలో ఎక్కువే ఉంటాయి. కానీ ఈ ఆర్గానిక్ మార్కెట్ కి కూడా డిమాండ్ ఎక్కువగా పెరిగిపోవడంతో ఇందులో కూడా కొన్ని రకాల కెమికల్స్ ని ఉపయోగించే ప్రమాదం లేకపోలేదు. ఎప్పుడైనా మీరు ఆర్గానిక్ కూరగాయలను కొనాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ పొలం లో నుండి వచ్చినవి కొనడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే మీకు సరైన ఆర్గానిక్ కూరగాయలు పండ్లు దొరికే అవకాశం ఎక్కువ.
ఈ ఆర్గానిక్ వ్యవసాయం చాలా రకాలు గా కల్తీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చాలా కెమికల్స్ ఉపయోగించి పండించే పంటల మధ్యలో ఆర్గానిక్ పంట పండిస్తుంటే ఆ పొలం లో నుండి గాలి ద్వారా కానీ, నీటి ద్వారా గానీ కెమికల్స్ ఈ ఆర్గానిక్ ఫార్మ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆర్గానిక్ అంటే ఎలాంటి GMO విత్తనాలు ఉపయోగించకుండా దేశీ విత్తనాలు ఉపయోగించి, ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా సహజమైన ఎరువులనే ఉపయోగించి మన ఆరోగ్యానికి మన ప్రకృతికి ఎటువంటి హాని జరగకుండా మేలు చేసేలా పంట పండించే ఉత్తమమైన విధానం.
నిజం చెప్పాలంటే మార్కెట్ లో సాధారణ కూరగాయలతో పోలిస్తే రెండు, మూడింతలు ఖరీదు ఉండే ఈ ఆర్గానిక్ కూరగాయలు పండ్లు పండించడానికి అంత ఎక్కువ ఖర్చవ్వదు, ఆర్గానిక్ అనగానే రేట్ చూడకుండా కొనేసే వాళ్ళు ఉండటం వల్ల, పండించే ఆర్గానిక్ పంట శాతం తక్కువ ఉండటం వల్ల ఈ ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ఆర్గానిక్ అనే పదం వినగానే ఖర్చు ఎంతైనా పెట్టి కొనే ముందు, అవి నిజంగా సేంద్రియంగానే పండించాబడ్డాయా అని చెక్ చేయండి. కానీ ప్రతీ ఆర్గానిక్ ఫుడ్ ని నిజంగా సేంద్రియంగా పండించారా అని చెక్ చేయటం కష్టమే!
అందుకని 100% ఆర్గానిక్ తినాలి అనుకుంటే మాత్రం తెలిసిన వాళ్ళ పొలాల నుండి వచ్చినవి కొనటం ఉత్తమం. లేదా మార్కెట్ లో ఆర్గానిక్ వి ఎలా గుర్తుపట్టాలో మేము చేసిన మరో వీడియో లో చూసి తెలుసుకోండి.
Also Read: మన పసుపు కల్తీ అవుతుందా?