Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి?

You are currently viewing Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి?

బ్లడ్ క్యాన్సర్ (Blood Cancer)… దీన్నే ల్యుకీమియా అని అంటారు. మిగిలిన క్యాన్సర్లతో పోలిస్తే బ్లడ్ క్యాన్సరు నయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే బ్లడ్ క్యాన్సరంత ప్రమాదకరమైంది మరొకటి లేదు, తొందరగా గుర్తిస్తే బ్లడ్ క్యాన్సరంత వేగంగా తగ్గిపోయే క్యాన్సరు కూడా వేరొకటి లేదు. అందుకే బ్లడ్ క్యాన్సర్ తగ్గడమన్నది వ్యాధిని గుర్తించడం మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలోనే గుర్తిస్తే బ్లడ్ క్యాన్సరును సాధారణ కీమోథెరపీ చేసి నయం చేయవచ్చు. మరీ జటిలమైతే మాత్రం బ్లడ్ క్యాన్సర్ తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

Blood Cancer

బ్లడ్ క్యాన్సర్ ఎలా వస్తుంది.?

దాదాపుగా శరీరంలో వచ్చే క్యాన్సర్లన్నీ అవయవాలకు వస్తుంటాయి. అవయవాలకు కాకుండా వచ్చే క్యాన్సర్ ఏదైనా ఉందంటే అది బ్లడ్ క్యాన్సర్ మాత్రమే. దీన్నే ద్రవ్యరూప క్యాన్సరని కూడా చెబుతుంటారు. మనిషికి రక్తం ప్రాణవాయువును అందిస్తుంటుంది. రక్త కణాలు ఎముకమజ్జలో మెత్తగా స్పాంజిలా ఉండే భాగంలో తయారవుతుంటాయి. ఇక్కడ పుట్టే కణాల్లో ఏ ఒక్క కణంలో జన్యుమార్పు సంభవించినా అది బ్లడ్ క్యాన్సరుకు దారితీస్తుంది. బ్లడ్ క్యాన్సర్లో క్యాన్సర్ కణాలు రక్తంలో కలిసిపోయి ఉంటాయి.

బ్లడ్ క్యాన్సర్ వలన కలిగే పరిణామాలు:

రక్తంలో ప్రధానంగా నాలుగు విభాగాలుంటాయి.

ఎర్రరక్త కణాలు : ఇవి శరీరానికి అవసరమైన ఆక్సిజన్ ను అందిస్తుంటాయి.

తెల్ల రక్త కణాలు : శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇన్ఫెక్షన్లపై పోరాడుతూ తెల్లరక్త కణాలు శరీరానికి రక్షణ కల్పిస్తుంటాయి.

ప్లేట్లెట్లు : రక్తం గడ్డ కట్టడానికి, రక్తస్రావం కాకుండా ఉండటానికి ప్లేట్లెట్లు సహాయపడతాయి.

ప్లాస్మా  : శరీరంలోని అవయవాలకు ప్రోటీన్లు, పోషకాలు, హార్మోన్లను అందిస్తుంటుంది ప్లాస్మా.

బ్లడ్ క్యాన్సర్ వలన శరీరంలో కలిగే మార్పులు:

  • బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు రక్తంలో ఎర్రరక్త కణాలు గణనీయంగా తగ్గిపోతాయి.
  • రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో తెల్లరక్త కణాలు అమాంతం పెరుగుతాయి.
  • ప్లేట్లెట్లు సంఖ్య దారుణంగా పడిపోతుంది.

బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు:

Blood cancer symptoms
  • బ్లడ్ క్యాన్సర్లో ప్రధానంగా కనిపించే లక్షణం ఆయాసం.
  • ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోతే ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
  • శ్వాస సరిగ్గా అందక కొంచెం దూరం నడిచినా, చిన్న పని చేసినా ఆయాసం వస్తుంటుంది.
  • ప్లేట్లెట్ల సంఖ్య కూడా తగ్గిపోవడంతో రక్తం గడ్డకట్టకుండా ముక్కు, నోరు, మలమూత్ర ద్వారాల గుండా రక్తస్రావం జరుగుతుంటుంది.
  • మూడు నాలుగు వారాల పాటు దీర్ఘకాలిక జ్వరం, శరీరంపై నల్లటి మచ్చలు, వాటంతటవే పుట్టుకొచ్చే పుండ్లు ,
  • ఆహారం తీసుకుంటున్నా నీరసంగా ఉండటం,
  • కారణం లేకునా బరువు తగ్గడం,
  • ఆకలి లేకపోవడం, వంటి అసాధారణ లక్షణాల ఆధారంగా బ్లడ్ క్యాన్సరును గుర్తించవచ్చు.

బ్లడ్ క్యాన్సర్ (Blood Cancer)  చికిత్స:

బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ముందు ఇది ఏ రకమైన క్యాన్సర్ అన్నది తెలుసుకోవాలి, మిగిలిన క్యాన్సర్లలా బ్లడ్ క్యాన్సర్లో స్టేజిలు ఉండవు. కాని ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. బ్లడ్ క్యాన్సరును ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. వేగంగా వచ్చే క్యాన్సర్ మెల్లిగా వచ్చే క్యాన్సర్. వేగంగా వచ్చే క్యాన్సర్లను అక్యూట్ క్యాన్సర్లని మెల్లగా వ్యాప్తి చెందే క్యాన్సర్లను క్రానిక్ క్యాన్సర్లని అంటారు.

రక్త కణాల్లోని రకాలు:

రక్త కణాల్లో లింఫోసైట్లు, మైలోసైట్లని రెండు రకాలుంటాయి.

ల్యుకీమియా రకాలు:

  • లింఫోసైట్లలో వచ్చే క్యాన్సర్లను అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకీమియా, క్రానిక్ లింఫోబ్లాస్టిక్ ల్యుకీమియా అంటారు.
  • మైలోసైట్లలో వచ్చే క్యాన్సర్లను అక్యూట్ మైలాయిడ్ ల్యుకీమియా, క్రానిక్ మైలాయిడ్ ల్యుకీమియా అంటారు.

ఈ విధంగా ల్యుకీమియాని నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది.

ల్యుకీమియా చికిత్స:

క్రానిక్ మైలాయిడ్ ల్యుకీమియా మినహాయించి మిగిలిన మూడు రకాల బ్లడ్ క్యాన్సర్లలో సాధారణ కీమోథెరపీ ద్వారానే చికిత్స చేస్తుంటారు. కీమోథెరపీ తర్వాత అత్యధిక బ్లడ్ క్యాన్సర్లలో ఇది పునరావృతం కాదు. క్రానిక్ మైలాయిడ్ ల్యుకీమియాలో మాత్రం పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి మూలుగు మార్పిడి చేస్తే క్యాన్సర్ నయమయ్యే అవకాశముంటుంది. అందుకే ఇతర క్యాన్సర్లతో పోలిస్తే బ్లడ్ క్యాన్సర్ నయమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అనవసర రక్తస్రావం, దీర్ఘకాలిక జ్వరం, శరీరంపై మచ్చలు, పుండ్లు, నీరసం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించి పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభిస్తే బ్లడ్ క్యాన్సర్ తప్పక పూర్తిగా నయమవుతుంది.

Ayurvedic Blood cancer treatment

రసాయన ఆయుర్వేద చికిత్స:

రోగనిరోధక శక్తికి ఆధారమైన రసాయన ఆయుర్వేద చికిత్సలో బ్లడ్ క్యాన్సరుకు అద్భుత పరిష్కారాన్ని సూచిస్తోంది పునర్జన్ ఆయుర్వేద. ముందుగానే వ్యాధిని గుర్తించి పునర్జన్ ఆయుర్వేద డాక్టర్లను సంప్రదిస్తే వెంటనే చికిత్స ప్రారంభించి మంచి ఫలితాలను సాధించవచ్చు.  ప్రాణాధారమైన ప్రకృతి వైద్యం ఆయుర్వేదాన్ని నమ్ముకుందాం.  జీవితకాలాన్ని పొడిగించుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకుందాం.

మీకు ఎవైనా అనుమానాలుంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 80088 42222 కి కాల్ చేయండి.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also read: భారతదేశంలో ఏటా యాభై వేల మందికి చిన్న పిల్లలకు క్యాన్సర్ !