సాంప్రదాయ భారతీయ ఆహార విధానం ప్రత్యేకత ఏమిటి ?

You are currently viewing సాంప్రదాయ భారతీయ ఆహార విధానం ప్రత్యేకత ఏమిటి ?

ఈ రోజుల్లో మనందరి జీవితాలలో ఆహారం అనేది ఒక ప్రధానమైన అంశం లా మారిపోయింది. అంతే కదా మరి!  ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల డైట్ లు ఫాలో అవుతూ.. ఎప్పుడూ తిననివి మన డైట్ లో భాగం చేసుకుంటూ మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. 

కానీ గమనించారా! ఇప్పుడైతే ఇంటర్నెట్ పుణ్యమా అని చాలా రకాల డైట్ లు మనకు తెలుస్తున్నాయ్, మరి మన తాత ముత్తాతలు అసలు డైట్ చేయకుండా హేల్తీ గా ఉండే వాళ్ళు.. 

అప్పట్లో వాళ్లకు కార్బోహైడ్రేట్ తెలీదు, గ్లుకోస్ తెలీదు.. కీటో డైట్ తెలీదు..మెడిటేరియన్ డైట్ తెలీదు.

మరి ఎలా హేల్తీగా ఉన్నారు?

 అసలు వాళ్ళు ఎం తినే వాళ్ళు? 

ఇలాంటి విషయాలను మనం ఈ మన భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానం గురించి 

మన దేశం లో ప్రతీ వంద కిలోమీటర్లకు వంట చేసే విధానం, తినే ఆహారాలు వేరు గా ఉంటాయి. ఇప్పుడలా లేవనుకోండి. అంతా వెస్టర్న్ ఫుడ్ పై ఆధారపడుతున్నాం. ఒకప్పుడు అలానే ఉండేది, వాళ్ళ చుట్టుపక్కన దొరికేది మాత్రమే తిని ఆరోగ్యంగా ఉండే వాళ్ళు. అలా చేయటం వల్లే వాళ్లకు ఆహారం తక్కువ ఖరీదుకే లభించేది. కానీ ఇప్పుడు అలా కాదు మన చేతిలో ఉండే ఫుడ్ వంద కిలో మీటర్ల దూరం నుండి వేల కిలోమీటర్ల దూరానికి మారిపోయింది. 

మన సాంప్రదాయ భారతీయ ఆహార విధానంలో సహజంగా పండిన తాజా ఆహారమే ఉండేది. అప్పట్లో వాళ్లకు ప్రిజర్వేటివ్ తెలీదు.. ఫ్రిజ్ లో పెట్టి దాచుకోవడం తెలీదు..

ఇప్పుడు మనం తినే కూరగాయలు కూడా వాళ్ళు తినేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం తినే వాటిలో చాలా వరకు విదేశీయులు మనకు పరిచయం చేసిన కూరగాయలు,పండ్లే ఎక్కువ.

అప్పట్లో వంకాయ, గుమ్మడికాయ వంటివి, ఇక పండ్లలో మామిడి, పనస వంటి ఇక్కడ పుట్టినవే తినేవారు.

Vegetables

 

ఇక ధాన్యం మరియు పప్పు దినుసులు అనేది మన దేశంలో ఎక్కడైనా సాధారణ ఆహరం. వీటిలో గోధుమ, బార్లీ, బియ్యం, జ్జోన్నలు, కొర్రలు వంటి సిరిధాన్యాలు ఇవన్నీ తినే వాళ్ళు. ఇప్పుడు మనకు ప్లేట్ లో తెల్లగా పాలిష్ చేసిన బియ్యం తో చేసిన అన్నం మాత్రమే ఇప్పుడు కనబడుతుంది మరి.. ఒకప్పుడు అలా కాదు.

Grains

ఇక పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకునే వారు, స్వచమైన పాలు, నెయ్యి, పెరుగు వంటివి తయారుచేసుకుని తినే వారు. అక్కడ కల్తీ జరిగే చాన్స్ ఉండేది కాదు. ఇంతటి ఆరోగ్యమైన న్యాచురల్ ఫుడ్ తినటం వల్ల మాత్రమే కాదు, అవి వండే పద్దతి, తినే సమయం కూడా ఇప్పటికంటే వేరుగా ఉండేవి.

Organic milk

అప్పట్లో మట్టి పాత్రల్లో వంట చేసేవారు, లోహాలను తక్కువగా ఉపయోగించేవారు. ఇంకా వాటిలో ధాన్యాన్ని బాగా నానబెట్టి వండేవారు. ప్రెజర్ కుక్కర్ లతో ఐదు నిమిషాల వంట కాకుండా నిదానంగా ఓపికగా వంట చేసేవారు. ఇవన్నీ ఆ ఫుడ్ ని ఇంకా హేల్తీ గా చేసేవి. దేశంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన ఆహారం తిన్నా స్వచ్చమైన సహజ ఆహారాన్నే తినే వారు. అందుకే వారికి హార్ట్ అటాక్, ఊబకాయం, క్యాన్సర్, షుగర్, బీ పి ఇవన్నీ తెలిసేవి కావు!

మనం అలా కాదు కదా మరి.. రుచి కోసం ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటుపడిపోయాం.. సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం! మన భారతీయ ఆహార విధానం లో ఇలా వండే ఆహారంలో సహజత్వం ఉన్నట్టే తినే విధానం లో కూడా ఉండేది. తినే ఆహారాన్ని గౌరవించి తినేవాళ్ళు. తినడానికి కింద కూర్చొని నిశ్శబ్దంగా ప్రశాంతంగా భుజించేవాళ్లు. దీనినే ఇప్పుడు మనం మైండ్ ఫుల్ ఈటింగ్ అంటున్నాం. ఒకప్పుడు మన పూర్వికులు ఇలానే తినే వాళ్ళు. అందుకే వాళ్లకు, మనకు ఉన్నట్టు క్రేవిన్గ్స్ ఉండేవి కావు. అరటి ఆకులో వడ్డించుకొని, నేల మీద కూర్చొని, చేతులతో ప్రశాంతంగా తినేవారు. అలాంటి సహజమైన ఆహారం ప్రశాంతమైన మనసుతో భుజించేవారు కాబట్టే మన సాంప్రదాయ భారతీయ ఆహార విధానం అంతటి ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఇప్పుడు  మారిన కాలానికి మనం పూర్తిగా మళ్ళీ అలా మారలేక పోయినా,  వీలైనంత మారడానికి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు. 

ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

Also Read: తినడానికి స్పూన్ బదులు చేతులను ఉపయోగించడం వెనక ఉన్న సైన్స్ ఏంటి?

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.