సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు మన ఆరోగ్యానికి మంచివి?

You are currently viewing సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు మన ఆరోగ్యానికి మంచివి?

మనకు మూడు కాలాలు ఉన్నాయి..

అదే నండి మన భాషలో చెప్పాలంటే  ఎండాకాలం..వర్షాకాలం.. చలికాలం..

ఒకప్పుడు ఎండాకాలం రాగానే మనకు మామిడి పళ్ళు గుర్తొచ్చేవి. ఎక్కడ మళ్ళీ సీజన్ అయిపోతుందేమో అని తెగ తినేసేవాళ్ళం. అదే చలి కాలంలో నారింజ పళ్ళు, ద్రాక్ష పళ్ళు ఇంకా సపోటా పళ్ళు ఎక్కువగా కనిపించేవి..ఇక వర్షాకాలం అంటే మనకు సీతాఫలం..స్పెషల్ గా అప్పుడు మాత్రమే ఈ పండ్లు దొరికేవి. సీజనల్ ఫ్రూట్స్ ని అప్పట్లో అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు..అలాగే అవి మన హెల్త్ కి కూడా చాలా మంచి చేసేవి.

మరి ఇప్పుడు చలికాలం లో కూడా మనకు మ్యాంగో జ్యూస్ దొరుకుతుంది, చాలా మందికి సీజనల్ ఫ్రూట్స్ తినే అలవాటు పోయింది. అసలు సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎందుకు మనం తినాలి అనేది ఇప్పుడు చూద్దాం.  

ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే వేసవి కాలం లో మనకు ఎండా వల్ల స్ట్రోక్స్ ని నివారించడానికి అలాగే మన ఇమ్మ్యునిటీ పెంచడానికి మామిడి పండు సహాయం చేస్తుందట. అలాగే మన బాడీ టెంపరేచర్ ఎక్కువ పెరగకుండా  ఉంచడానికి సమ్మర్ లో పుచ్చకాయ హెల్ప్ చేస్తుంది. ఇక వర్షాకాలంలో సీతాఫలం మన బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి అలాగే మన మూడ్ ని బెటర్ చేయటానికి సహాయపడుతుందట. అలాగే సపోటా పండు మనకు చలికాలం లో ఇన్ఫెక్షన్స్ తో ఫిట్ చేయడానికి అలాగే మన బాడీ ని వెచ్చగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా కాలాన్ని బట్టి మన సమస్యలకు పరిష్కారంగా ప్రకృతి మనకు ఈ సీజనల్ ఫ్రూట్స్ ను ఇచ్చింది. కూరగాయల విషయంలో కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది.

సీజనల్ ఫ్రూట్స్ అనేవి మన ప్రకృతి మనకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఫ్రూట్ టైం టేబుల్.

ఇవి మాత్రమే కాదు మనం సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ మీరు కొనే ముందు అవి సరిగ్గా పండినవా లేక కృత్రిమంగా వాటిని పక్వానికి వచ్చేలా చేసారా అనేది చూసుకోవాలి. కానీ మీరు సీజన్ లో సరైన సమయానికి ఆ పండు తీసుకుంటే అలాంటి సమస్య ఉండదు, ఎందుకంటే సీజన్ రాకముందే తింటే అవి కెమికల్స్ తో పండించి ఉండొచ్చు. ఒకవేళ సీజన్ అయ్యాక తింటే అవి కెమికల్స్ ఉపయోగించి పాడు అవ్వకుండా ఉంచినవి అయ్యి ఉండొచ్చు. అందుకే సీజనల్ ఫ్రూట్స్ కొనే విషయం లో టైమింగ్ అనేది ముఖ్యం.

ఈ సీజనల్ ఫ్రూట్స్ కేవలం ఆ ప్రత్యెక కాలం లోనే మార్కెట్ కి వస్తాయి కాబట్టి ఆ సీజన్ లో ఆ పండు ధర తక్కువగా అందరికి అందుబాటులో ఉంటుంది. అదే మీరు మామిడి పండు వర్షాకాలం లో కొంటే దాని రేట్ మూడింతలు ఉంటుంది కదా ! అందుకే సరైన సమయానికి బడ్జెట్ లో మంచి హేల్తీ ఫ్రూట్స్ ఇవి. ఇంకా ఈ పండ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి, తాజాగా ఆ కాలంలోనే కోయబడి ఫ్రెష్ గా ఉండటం వల్ల ఇవి మన హెల్త్ కి కూడా బాగా సపోర్ట్ చేయగలవు. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ తినమన్నాం కదా అని పక్క రాష్ట్రం లో నుండి వచ్చినవి అత్యంత ఖరీదు పెట్టి కోనేయకండి, మీ ఊర్లో లేదా మీ పక్కన ఊర్లో పండినవి తింటేనే మీకు ఎక్కువ మంచి జరుగుతుంది.  ఎందుకంటే ఈ నేచర్ అవి మీ కోసం ఇస్తుంది. 

సో.. మీరు సీజనల్ ఫ్రూట్స్ ను హ్యాపీ గా ఆ పండ్ల సీజన్ లోనే తినగలిగితే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం..రుచికి రుచి అందుతుంది. ఇక నుంచైనా ఎక్సాటిక్ ఖరీదైన పండ్లను కొనే ప్లేస్ లో మీ చుట్టూ పక్కన పండే పండ్ల పై ఒక లుక్కేయండి మరి ! ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

Also Read: ఆర్గానిక్ ఫుడ్స్ అసలు అర్థం ఏంటి?